ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర విజ‌యోత్సవ వేడుక‌లు

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

jagan padayatra
Updated:  2018-09-25 11:43:06

ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర విజ‌యోత్సవ వేడుక‌లు

వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఇంచార్చ్ బందెల విల్సన్ బాబు ఆధ్వర్యములో కమిటీ సభ్యులు కేక్ కట్ చేసి ప్రజాసంకల్ప పాద యాత్ర విజయోత్సవ వేడుకలు బందెలా రత్నం తోటలో చేశారని ఒక ప్రకటనలో గల్ఫ్ ప్రతినిధి మండా వర్జిల్ బాబు తెలిపారు.ఈ సందర్భంగా దోహా కన్వీనర్ దొండపాటి శశి కిరణ్, కార్య నిర్వాహుకులు విల్సన్ బాబు మాట్లాడుతూ ఎండనక వాననక, పగలనక రాత్రనక, ప్రజలతో మమేకం అవుతూ, ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుంటున్న జననేత అన్ని వర్గాల వారికి అన్ని ప్రాంతాల వారికి మేలు చేసే నవ రత్నాల సృష్టికర్త, రేపటి మన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం దిశ దశ నిర్దేశించవలసిన దమ్మున్న తెలివైన ప్రజలంటే అమితమైన ప్రేమగలిగి నిరంతరం కష్టపడే తత్వం కలిగిన మడమ తిప్పని నైజం కలిగిన నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటివారినైనా ఎదురించగలిగిన ధీశాలి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర 3000 కి.మీ పూర్తి చేసుకొంటున్న సందర్భంగా ప్రజాసంకల్ప యాత్ర విజయోత్సవ సభకి హాజరైన వారందరికీ ధన్య వాదాలు తెలిపారు.

padayatra

మనిషి ఈ ఆధునిక యుగం లో 200 కి.మీ లు నడవలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 3000 కిమి పూర్తి చేయడం చాలా గొప్ప విషయం అన్నారు జగన్ మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రిని చేస్తే ఖచ్చితంగా తండ్రిని మించిన పరిపాలన తెగలరని తెలిపారు. నవరత్నాలు అనేవి నిజం గా అన్ని వర్గాల వారికి ,ప్రతి కుటుంబానికి మేలు చేస్తాయని మనమందరం వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గా చూడగలమన్నారు.

fans of jagan

ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ రావి సూర్యప్రకాష్, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు, నల్లి నాగేస్వరరావు, యూత్ ఇంఛార్జి ఆరోన్ మనీష్, సోషల్ మీడియా ఇంఛార్జి గెడ్డం చంటి, మైనారిటీ ఇంఛార్జి షేక్ దర్బార్ భాషా, sc, st ఇంఛార్జి నేతల జయరాజు, యూత్ వైస్ ఇంచార్జ్ వసంతప్ప,మేడంకి రాజా,సహాయ కోశాధికారి అరుణ్,సేవాదల్ వైస్ ఇంఛార్జి అలీ,సభ్యులు మత్తి సందేశ్ కుమార్,మోహన్ రెడ్డి, బీర సునీల్, మెడిది రాజశేఖర్,బందెల రత్నం గారు,తదితరులు పాల్గొన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.