కువైట్ లో ప్రవాసాంధ్ర రెడ్డీస్ అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవం...

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

reddys association
Updated:  2018-06-19 12:50:41

కువైట్ లో ప్రవాసాంధ్ర రెడ్డీస్ అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవం...

ప్రవాసాంధ్ర రెడ్డీస్ అసోసియేషన్ ను కువైట్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశము కువైట్ లో సమస్యలలో ఉన్న తెలుగు వారిని కుల మత ప్రాంతాలకు అతీతంగా ఆదుకోవడం మరియు ఈ కమిటీలో కువైట్ లో ఉన్నసభ్యుడు దురదృష్టం కొద్ది మరణిస్తే వారి కుటుంబానికి  50 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుంది. 
 
ప్రతి 2 సం:లకు ఒక సారి కమిటీ సభ్యులు అధ్యక్షుడిని ఎన్నికోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కమిటీ సభ్యులు చిట్వేల్ మండలం, నాగవరం గ్రామం, అలివేలి మంగాపురంకు చెందిన మన్నూరు చంద్రశేఖర్ రెడ్డిని అధ్యక్షుడిగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఒక ప్రకటనలో మాజీ అధ్యక్షులు బత్తిన శివారెడ్డి తెలిపారు. 
 
ఈ సందర్భముగా మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, నా ఎన్నికను ఏకగ్రీవం అయ్యే దానికి సహాకరించిన ప్రముఖ వ్యాపారవేత్త వైసీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డికి, కమిటీ వ్యవస్ధాపకులు, కమిటీ కార్యవర్గ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కమిటీ సభ్యులు అందరి సహాయసహాకారాలతో నా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని వాగ్దానం చేశారు. 
 
వైకాపా గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్, ముమ్మడి బాలిరెడ్డి, మాజీ అధ్యక్షులు బత్తిన శివారెడ్డి, ఉపాధ్యక్షులు ముమ్మడి వెంకటసుబ్బారెడ్డి, చింతల చంద్రశేఖర్ రెడ్డి, పులపుత్తూర్ సురేష్ రెడ్డి, సభ్యులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, గాలివీటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, దొట్ల సుమాన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గోని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మన్నూరు చంద్రశేఖర్ రెడ్డికి అభినందనలు తెలిపి స్వీట్స్ తినిపించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.