కువైట్ లో ఘనంగా మాజీ పార్లమెంట్ సభ్యులు మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

ycp ex mp mithun reddy
Updated:  2018-09-11 15:24:48

కువైట్ లో ఘనంగా మాజీ పార్లమెంట్ సభ్యులు మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కువైట్: వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కువైట్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు గారి ఆధ్వర్యములో కువైట్ ఒమేరియా పార్క్ లో భారీ కేక్ కట్ చేసి మరియు అల్పాహార విందు ఏర్పాటు చేసి మాజీ ఎం.పి. వెంకట పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి గారి 41వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారని ఒక ప్రకటనలో కో కన్వీనర్ యం. వి. నరసా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.  ఈ కార్యక్రమానికి గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్, ముమ్మడి బాలిరెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. 
 
ఈ సందర్భముగా  ఇలియాస్, బాలిరెడ్డి  గార్లు  మాట్లాడుతూ  రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని సమైఖ్యాంధ్ర కోరకు తన  ఎం.పి. పదవిని తృణపాయంగా భావించి రాజీనామా చేయడమే కాక తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా 6 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన మిధున్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజల తరపున శిరస్సు వంచి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో రాజకీయాలలో ఉన్నత పదవులు అధిష్టించాలని మనసారా ప్రార్ధిస్తూ కువైట్ కమిటీ సభ్యులు అందరి తరపున 41వ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 
 
కార్యనిర్వాహుకులు గోవిందు నాగరాజు మాట్లాడుతూ కువైట్ కమిటీ సభ్యులను అమితంగా అభిమానించి మేము ఏ సమయములో పోయి కలిసిన చిరు నవ్వుతో పలకరించి ఎంతో గౌరవం ఇచ్చే మా అభిమాన డైనమిక్ యువ నేత  మిధున్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం నాకు ఎంతో ఆనందంగా ఉందని. గల్ఫ్ లో తెలుగు వారి సమస్యలపై నిరంతరం సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తు తెలుగుదేశం  ప్రభుత్వం గల్ఫ్ లో ఉన్న అభాగ్యులను పట్టించుకోక పోయిన కువైట్ కమిటీ పెద్దల అభ్యర్ధన మేరకు అంబులెన్స్ ఏర్పాటు చేసిన గొప్ప మానవతా వాది  మిధున్ రెడ్డి గారికి గల్ఫ్ లో ఉన్న రాష్ట్ర ప్రవాసాంధ్రుల తరపున  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 
ఈ కార్యక్రమములో  గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు పి. రెహామన్ ఖాన్, ప్రధాన కోశాధికారి నాయని మహేష్ రెడ్డి, గవర్నింగ్  కౌన్సిల్ సభ్యులు మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, తెట్టు రఫీ, లాజరాస్, సలహాదారులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,అన్నాజీ  శేఖర్, గల్ఫ్ ప్రతినిధి షేక్ నాసర్,మీడియా ఇంచార్జ్ 
 
ఆకుల ప్రభాకర్ రెడ్డి,  బిసి ఇంచార్చ్ రమణ యాదవ్, యూత్ ఇంచార్చ్ మర్రి కళ్యాణ్, సోషల్ మీడియా ఇంచార్చ్ గాలివీటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, సేవాదళ్ ఇంచార్చ్ గోవిందు రాజు, సాంస్కృతిక విభాగం ఇంచార్చ్ కె. వాసుదేవ రెడ్డి, ఎస్టీ.ఎస్సి. ఇంచార్చ్ బి.ఎన్. సింహా, మైనారిటీ ఇంచార్చ్ షేక్ గఫార్, కమిటీ సభ్యులు షేక్ గౌస్ బాషా, షాహుస్సేన్, సుబ్రహ్మణ్యం రెడ్డి, సయ్యద్ సజ్జాద్, రవి శంకర్, పిడుగు సుబ్బారెడ్డి, హరినాథ్ నాయిడు. షేక్ సబ్దర్, కె. నాగసుబ్బారెడ్డి, కోనేటి సూరి, వూరిడో కోటి, మల్లికార్జున, జగన్ యూత్ ఫోర్స్ అధ్యక్షులు లక్ష్మి ప్రసాద్, కువైట్ రెడ్డీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షలు యం. వెంకట సుబ్బారెడ్డి, వి.పి. రామచంద్ర రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎన్. శ్రీనివాసుల రెడ్డి. మాజీ అధ్యక్షులు బత్తిన శివారెడ్డి,  మరియు కార్యవర్గ సభ్యులు,  యూత్ ఫోర్స్ సభ్యులు నరసింహ యాదవ్, పవన్ కుమార్, బి. వెంకటేష్, గోపాల్, మణీ, పి. వెంకటేష్, బి. నరసా రామయ్య, వై  కోట  యూత్ ఇస్మాయిల్  మరియు  సభ్యులు, ఎస్టీ ఎస్సి సేవ సమితి అధ్యక్షుడు పోలూరి ప్రభాకర్, సభ్యులు  బోనగిరి సుబ్బయ్య, ఏ. ఉదయ్, శంకర్, టి . నాగరాజు, జగన్ మరియు వై.యస్.ఆర్. కుటుంబ అభిమానులు

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.