వైసీపీ కువైట్ కమిటీ సామాజిక సేవలు

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

Updated:  2018-02-11 07:17:01

వైసీపీ కువైట్ కమిటీ సామాజిక సేవలు

వైయస్ఆర్ సీపీ కువైట్  కమిటీ   సభ్యులు  మానవతా దృక్పధంతో తమ వంతు సహాయంగా  అవుట్ పాస్  మరియు  అవుట్  పాస్  దరఖాస్తు  కొరకు భారతీయ రాయబార  కార్యాలయం వద్ద ఉదయం 5 నుండి సాయంత్రం 5 వరకు భోజనం  మరియు నీళ్లు లేక అవస్ధలు పడుతున్న వారికి  వై  యస్ ఆర్ సీపీ కువైట్  కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి  ఆధ్వర్యములో కమిటీ సభ్యులు అన్నం  నీళ్ల బాటిల్స్  అందించడము అభినందనీయమని గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్ తెలిపారు.          
                                   
 ఈ సందర్భముగా బాలిరెడ్డి  మాట్లాడుతూ.... 7 సంవత్సరాల తర్వాత కువైట్ ప్రభుత్వం రెసిడెన్సీ  (  అకామా  )  మరియు  పాస్  పోర్ట్  లేని విదేశీయలకు   క్షమాబిక్ష పెట్టి 22 - 02 - 18 వరకు వెళ్లి పోయిన వారు మరల తిరిగి కువైట్  వచ్చే అవకాశం  కల్పించిన కువైట్ దేశ రాజుకి తెలుగు ప్రజల తరపున కృతజ్ఞభి వందనాలు తెలుపుతూ... అలాగే భారత రాయబార కార్యాల‌య   అధికారులు సమయం తక్కువ ఉందని సెలవు  రోజు కూడా పని చేస్తూ కువైట్  ఇమ్మిగ్రేషన్  పనులన్నీ అంబాసిలోనే ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.    
 
కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం .వి. నరసారెడ్డి మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవాసాంధ్రుల  సంక్షేమం కొరకు ఎంతో అట్టహాసంగా పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ప్రారంభించిన APNRT ( ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెన్సీ తెలుగు ) ఇంత వరకు బాధితులను ఆదుకోవడానికి ముందుకు రాకపోవడం  దారుణమని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులను ఆదుకొని  స్వదేశానికి   వచ్చిన తర్వాత పునరావాసం కల్పిస్తామని ప్రకటించడం హార్షణీయమని ఇకనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి అభాగ్యులను ఆదుకోవడానికి ముందుకు రావాలని అభ్యర్ధన చేశారు. 
 
గవర్నింగ్  కౌన్సిల్   సభ్యుడు పి . రెహామన్ ఖాన్, ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కువైట్ లో వివిధ పార్టీ అభిమానులు సామాజిక సేవ సంస్ధ సభ్యులు 29 - 01 - 18 నుండి తమ పనులు ప్రక్కన పెట్టి ప్రతి రోజు అంబాసి వచ్చి బాధితులకు సహాకరిస్తున్న ప్రతి ఒక్కరికి కమిటీ తరపున కృతజ్ఝ‌తలు తెలిపారు. 
 
ఈ కార్యక్రమములో మర్రి కళ్యాణ్,  రమణా యాదవ్,  బి.యాన్ .సింహ, అబు తురాబ్,     షా హుస్సిన్, బాలకిష్ణ రెడ్డి, రహంతుల్లా,  పిడుగు.సుబ్బారెడ్డి, గోవిందరాజు,వి.రమణ, హనుమంత్ రెడ్డి,  ఏ.వి ధర్మా రెడ్డి, పి. సురేష్ రెడ్డి ,  మన్నూరు భాస్కర్ రెడ్డి,  సుబ్బయ్య,   సింగమాల సుబ్బారెడ్డి,   శ్రీనివాసులు రెడ్డి,  సంపత్, తుపాకుల కన్నయ్య , అయిత రమణ తదితరులు  పాల్గొన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.