కువైట్ లో ఘనంగా వై.యస్. అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

ys avinash reddy
Updated:  2018-08-27 16:24:12

కువైట్ లో ఘనంగా వై.యస్. అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు

మాలియా ప్రాంతములో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ యూత్ వైస్ ఇంచార్చ్ సింగమాల సుబ్రహ్మణ్యం రెడ్డి ఆధ్వర్యములో భారీ కేక్ కట్ చేసి వై.యస్. అవినాష్ రెడ్డి 34 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి అని ఒక ప్రకటనలో గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్, ముమ్మడి బాలిరెడ్డి తెలిపారు. 
 
ఈ సందర్భముగా గల్ఫ్, కువైట్ కన్వీనర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కొరకు నిరంతరం పోరాడుతూ ప్రత్యేక హోదా కొరకు ఎం. పి. పదవిని తృణపాయంగా భావించి రాజీనామా చేయడమే కాక తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండ 6 రోజులు ఆమరణ దీక్ష చేసిన వై.యస్. అవినాష్ రెడ్డి కడప ఎం. పిగా ఉండటం గర్వకారణమని కడప పార్లమెంట్ నియోజక ప్రజలు 2019 లో  అత్యధిక మెజార్టీతో గేలిపించుకోవలని అభ్యర్ధన చేస్తూ. వై.యస్. అవినాష్ రెడ్డి ని అమితంగా అభిమానించే ఎస్. సుబ్రహ్మణ్యం రెడ్డి కి అభినందనలు తెలుపుతూ కువైట్ కమిటీ సభ్యులు అందరి 34 వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఎస్. సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తన సమస్యలుగా భావించే నాయకులు మరి ముఖ్యంగా కువైట్ కమిటీ సభ్యులు అంటే ప్రత్యేక అభిమానం చూపించి ఏ సమయములో పోయిన నవ్వుతు పలకరించే మా అభిమాన నాయకులూ వై.యస్. అవినాష్ రెడ్డి  జన్మదిన వేడుకలు కువైట్ లో చేయడం ఆనందంగా ఉందన్నారు. 
 
ఈ కార్యక్రమములో కో కన్వీనర్లు గోవిందు నాగరాజు. యం. వి. నరసారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పి. రెహమాన్  ఖాన్, ప్రధాన కోశాధికారి నాయని మహేష్ రెడ్డి, గవర్నింగ్  కౌన్సిల్ సభ్యులు తెట్టు రఫీ, మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, సలహా దారులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, బి.సి. ఇంచార్చ్ రమణ యాదవ్, మీడియా ఇంచార్చ్ ఆకుల ప్రభాకర్ రెడ్డి, యూత్ ఇంచార్చ్ మర్రి కళ్యాణ్,  సోషల్ మీడియా ఇంచార్చ్ గాలివీటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎస్సి. ఎస్టీ. ఇంచార్చ్ సింహా, గల్ఫ్ ప్రతినిధి షేక్ నాసర్, మీడియా సభ్యుడు పులపుత్తూర్ సురేష్ రెడ్డి, సలహా దారులు ఆబూతురాబ్,కోశాధికారి పిడుగు సుబ్బారెడ్డి,  సేవాదళ్ వైస్ ఇంచార్చ్ నాగసుబ్బారెడ్డి,  యూత్ సభ్యులు షేక్ సబ్దర్, పి. రవిశంకర్, హారినాధ్ చౌదరి, జగన్ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు షేక్ జబీవుల్లా, జగన్ ఫోర్స్ అధ్యక్షుడు లక్ష్మి ప్రసాద్ , జగన్ సైన్యం అధ్యక్షుడు మహబూబ్ బాషా, మరియు వై.యస్.ఆర్. కుటుంబ అభిమానులు పాల్గోన్నారు.      

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.