ఘనంగా ఆరోగ్యశ్రీ ప్రదాత వైయస్ఆర్ 69వ జయంతి వేడుకలు

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

ys rajasekahr reddy
Updated:  2018-07-09 01:38:11

ఘనంగా ఆరోగ్యశ్రీ ప్రదాత వైయస్ఆర్ 69వ జయంతి వేడుకలు

కువైట్ మలియా ప్రాంతములో షెర్స్టన్ రౌండ్ బౌండ్  పార్క్ లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ఆధ్వర్యములో వైయస్ఆర్  69వ జయంతి వేడుకలు కో కన్వీనర్ గోవిందు నాగరాజు, గవర్ని౦గ్  కౌన్సిల్ సభ్యులు పి. రెహామన్ ఖాన్, ప్రధాన  కోశాధికారి నాయని  మహేశ్వర్ రెడ్డి, లలిత రాజు, తెట్టు రఫీ, అధికార ప్రతినిధి ఆకుల ప్రభాకర్ రెడ్డి పి. సురేష్ రెడ్డి ఎస్ సి &ఎస్ టి ఇంచార్చ్  బి.ఎన్ సింహ, సోషల్ మీడియా ఇంచార్చ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, సలహాదారులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,  పిడుగు సుబ్బారెడ్డి,షేక్. రహమతుల్లా, కె. నాగసుబ్బారెడ్డి,  హరినాథ్ చౌదరి, షేక్ గౌస్, పోలూరు ప్రభాకర్ , సూర్యనారాయణరెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు బత్తిన శివ రెడ్డి చింతల చంద్రశేఖర్ రెడ్డి ఎన్ శ్రీనివాసులు రెడ్డి జగనన్న యూత్ ఫోర్స్ అధ్యక్షులు లక్ష్మీప్రసాద్ నరసింహ యాదవ్ దినేష్ మహేష్ యాదవ్, ఎగ్బల్ బాషా , ఒ.మోహాన్ రెడ్డి  భారీగా వై.యస్.ఆర్.కుటుంబ అభిమానులు పాల్గొన్నారని ఒక ప్రకటనలో గల్ఫ్, కువైట్ 
కన్వీనర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
ysr birthday celebrations 
 
ఈ సందర్భముగా కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన బూటకపు హామీలతో చంద్రబాబు  ప్రభుత్వం రైతులకు,ఆడపడుచులకు ,విద్యార్ధిలకు  కాపులకు నమ్మించి మోసం చేసారని.రాజధాని మరియు పట్టుసీమ రూపంలో  అవినీతి ఆంధ్రప్రదేశ్ లో ఏరులై పారుతున్నది ఎద్దేవా చేశారు. కేక్ కట్ చేసి మహానేతని స్మరించుకున్నారు. 
 
కో-కన్వీనర్ గోవిందు  నాగరాజు, గవర్ని౦గ్  కౌన్సిల్  సభ్యుడు రెహామన్ ఖాన్, ప్రధాన కోశాధికారి  నాయని మహేశ్వర్  రెడ్డి మాట్లాడుతూ మహానాయకులు రాజశేఖర్ రెడ్డి  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పధకాలు అందించిన ఘనత వై.యస్.ఆర్ ది ముఖ్యముగా గల్ఫ్ ప్రాంతాలలో ఉన్న తెలుగు వారి సమస్యలను గుర్తించి సమస్యల పరిష్కారం కొరకు భారత దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా ప్రత్యేకంగా మంత్రిని ఎర్పాటు చేసిన ఘనత వై.యస్.ఆర్.దని కొనియాడారు.వారు లేని లోటు రాష్ట్ర ప్రజలకు గల్ఫ్ ప్రవాసాంధ్రులకు కనబడుతుందని అవేదన వ్యాక్తం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.