గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ కి ఘన సన్మానం చేసిన NRI లు

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

kuwait
Updated:  2018-07-06 01:51:13

గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ కి ఘన సన్మానం చేసిన NRI లు

కడప శాసన సభ్యుడి ఆఫీసులో NRI లు లక్కీ అజీస్ ( కువైట్ ) మౌల సయ్యద్ ( సౌదీ ) కలిసి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి మరియు తెలుగు వారికి చేస్తున్న సేవలను గుర్తించి ఇలియాస్ కి సన్మానం చేశామని 1996 నుండి గల్ఫ్ సమస్యల కొరకు పోరాడుతున్న వ్యక్తి ఇలియాస్ అని తెలిపారు.
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన కడప శాసన సభ్యులు ఎస్.బి. అంజాద్ బాషా, కడప పార్లమెంటరీ ఇంచార్చ్ కడప మేయర్ కె. సురేష్ బాబు మాట్లాడుతూ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి కువైట్ కన్వీనర్ గా ఎటువంటి స్వలాభావం ఆశించకుండా పార్టీ కొరకు పని చేస్తున్న వ్యక్తులలో మొదటి స్ధానంలో ఇలియాస్ ఉంటారని. జిల్లా నుండి ఎవరు టెలిఫోన్ చేసి గల్ఫ్ సమస్యల గురించి తెలిపిన వెంటనే స్పందించి కమిటీ సభ్యులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్క‌రించే వరకు నిద్రపోర‌ని తెలిపారు,
 
జిల్లా అధికార ప్రతినిధి అఫ్జల్ ఖాన్  మాట్లాడుతూ, గత రంజాన్ మాసంలో సుమారు 20 రోజులు కువైట్ లో ఉన్యాను ఇక్కడ ఉన్న మన పార్టీ అభిమానుల కన్నా ఎక్కువ అభిమానం కమిటీ సభ్యులలో చూశాను. ప్రతి ఒక్కరు ఒక కమిట్ మెంట్ తో పనిచేస్తారు ఒక విధంగా మనం ఆలోచన చేస్తే ఎడారి దేశంలో ఎడారిలో పార్టీ పూలను విజిమ్మచేసిన వ్యాక్తి ఇలియాస్ అన్నారు. 
 
గల్ఫ్ ప్రతినిధి జి.ఎస్. బాబురాయుడు, జగన్ హెల్పింగ్ హైన్డ్స్ అధ్యక్షులు షేక్ జబీవుల్లా , కడప పట్టాన అధ్యక్షుడు పులి సునీల్, మాజీ విద్యుత్ శాఖ జిల్లా అధ్యక్షులు మహాబూబ్ బాషా, పట్టణ యువ విభాగం అధ్యక్షులు ఆదిత్య తదితరులు ఇలియాస్ గురించి కొనియాడారు. 
 
సన్మాన గ్రహీత ఇలియాస్  మాట్లాడుతూ, ఎంతో అభిమానంతో ఈ రోజు నాకు సన్మానించిన లక్కీ అజీస్. మౌల సయ్యద్  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి సన్మానాలు ఇంకా బాధ్యతను పెంచుతాయని. గల్ఫ్ సమస్యలు పరిష్కరించడమే నా జీవిత ఆశయమని నా ఆశయం జననేత జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే నెరేవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ. 
 
ఈ రోజు నేను ఈ గల్ఫ్ కమిటీలో ఉన్నాను అంటే దానికి కారణం కడప మేయర్ సురేష్ బాబు ని వారికి కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే ఈ రోజు ఈ సన్మానానికి నేను అర్హుడు అయినాను అంటే కువైట్ లో ఉన్న పాత కమిటీ మరియు కొత్త కమిటీ మరియు దోహా ఖతార్ నూతన కమిటీ సభ్యులు అందరు పార్టీ అభ్యున్నితి కొరకు చేస్తున్న కృషి ఫలితమే నాని.  నేను ఒక దారి మాత్రమే ఆ దారిలో ఉన్న రాళ్లను మూళ్ళ పొదలను తీస్తూ దారిని రహా దారిగా తీర్చి దిద్దిన కమిటీ సభ్యల కష్ట ఫలితమే ఈ సన్మానమని తెలియచేస్తూ. సామజిక సేవలో కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి మరియు కమిటీ సభ్యుల సహాయసహాకారాలతో చేస్తున్నామని ఇందులో నా పాత్ర చాలా చిన్నదాని దోహా ఖతార్ కన్వీనర్ దొండపాటి శశికిరణ్ మరియు సభ్యలు కూడా సామజిక సేవలో ముందుండం అభినందయని ఈ రోజు ఇంతటి గౌరవం నాకు దక్కే దానికి మూలాకారకులైన ముఖ్యంగా కువైట్ కమిటీ సభ్యలకు మరియు దోహా ఖాతర్ సభ్యులు కృతజ్ఞభివందనాలు తెలియచేసుకున్నారు. 
 
నేను తెలుగు దేశం పార్టీ పేరు మీద కువైట్ 14 సం పనిచేశాను అనే దానికన్నా 14 సంవ‌త్స‌రాలు వనవాసం చేసినాను అని చెప్పడం సబాబుగా ఉంటుందని. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నేను చాలా డబ్బులు ఖర్చు చేసుకున్నానని నా సమయాన్ని కూడా ఎక్కువ వెచ్చించానని కానీ ఏ రోజు కూడా నన్ను పార్టీ అధిష్టానం సరిగ్గా గుర్తించలేదని. 
 
కానీ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న సేవలకు నన్ను పార్టీ అధినాయకుడి నుండి నాయకులు. కార్యకర్తలు . అభిమానులు చూపిస్తున్న ప్రేమ అభిమానం విలువ కట్టలేనిదని. వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో ఒక సభ్యుడిగా ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. 
 
ఈ కార్యక్రమములో కువైట్ కమిటీ సభ్యులు కె. వాసు దేవా రెడ్డి, NRI లు షేక్ ఆన్సర్, సిటీ అలీ, షేక్ గయాజ్, మహమ్మద్ గౌస్ (బాబు) అన్వర్, పార్టీ మైనారిటీ పట్టణ అధ్యక్షులు షఫీ, 36వ డివిజన్ ఇంచార్చ్ రఫీ, 29వ ఇంచార్చ్ డిష్ జిలాన్, మజహర్ ఖాన్, ఇర్ఫాన్, పార్టీ అభిమానులు NRI లు భారీగా పాల్గోన్నారు 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.