సెప్టెంబర్ 2వ తేదీ నుండి కువైట్ లో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలు

Breaking News

హోమ్        ప్రవాస      న్యూస్

ysrcp kuwait
Updated:  2018-08-23 05:09:45

సెప్టెంబర్ 2వ తేదీ నుండి కువైట్ లో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలు

మాలియా ప్రాంతములో ఉన్న పవన్ రెస్టారెంట్ లో 23 - 08 - 18 న వైకాపా కువైట్ కమిటీ సర్వసభ్య సమావేశము జరిగిందని ఈ సమావేశములో కమిటీ ముఖ్య నాయకులు అందరు పాల్గోన్నారు. 
 
వైకాపా కువైట్ కమిటీ పార్టీ సభ్యులకు పార్టీ గుర్తింపు కార్డ్స్ ను ఇవ్వడము కొరకు జరిగిన కార్యక్రమములో కమిటీ సభ్యుల ఆమోదంతో  మహానాయకులు దివంగత ముఖ్యమంత్రి
డా: వై.యస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి రోజున కువైట్ లో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలు మొదలు పెట్టాలని నిర్ణయం జరిగిందని గల్ఫ్, కువైట్ కన్వీనర్లు తెలిపారు.
ysrcp
  
kuwait
ఈ సందర్భముగా ఇలియాస్, బాలిరెడ్డి మాట్లాడుతూ  కువైట్ లో ఉన్న మన తెలుగు ప్రజల వద్దకు మన కమిటీ సభ్యులు పోయి సభ్యత్వాలు చేయవలసిందిగా కమిటీ సభ్యులకు అభ్యర్ధన చేశారు.