అజ్ఞాత‌వాసి రివ్యూ

Breaking News

హోమ్        న్యూస్

Updated:  2018-01-21 12:05:45

అజ్ఞాత‌వాసి రివ్యూ

నిర్మాణ సంస్థ: హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌
తారాగ‌ణం : ప‌వ‌న్ క‌ల్యాణ్‌, కీర్తిసురేష్‌, అను ఇమాన్యుయేల్‌ 
సంగీతం : అనిరుధ్‌
చాయాగ్ర‌హ‌ణం : మ‌ణికంద‌న్‌
కూర్పు : కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
నిర్మాత : ఎస్‌.రాధాకృష్ణ‌
ద‌ర్శ‌క‌త్వం : త‌్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌
 
 
తొలిప్రేమ చిత్రంతో టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టారు ప‌వ‌న్ క‌ళ్యాన్. అయితే తొలి సినిమా తొలి ప్రేమ‌తోనే బాక్సాఫిస్ వ‌ద్ద సంద‌డి చేసి మెగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే బిరుదును తెచ్చుకున్నారు... అదే రీతిలో గ‌తంలో ఖుషి, బాలు, సుస్వాగ‌తం, త‌మ్ముడు, వంటి అనేక సినిమాల‌లో న‌టించి మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు.. 
 
అయితే ఇదే త‌ర‌హాలోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ 25 వ సినిమా అజ్ఙాత‌వాసి విడుద‌లైంది... ఈ సినిమా నేడు బాక్సాఫిస్ వద్ద సంద‌డి చేస్తోంది. సాధార‌ణంగా చెప్పాలంటే వ‌ప‌న్ సినిమా అంటేనే ఇక క్రేజ్ ఉంటుంది... మ‌రి ఆయ‌న సినిమాకు త్రివిక్ర‌మ్ జ‌త‌క‌లిస్తే ఆ సినిమా ఎంత‌లా ఉండ‌బోతుందో తెలుసుకోవాల‌నుకుంటే ఈ క‌థ‌ను చూడాల్సిందే.
 
కథ 
గోవింద్ భార్గ‌వ్ అలియాస్ విందా(బొమ‌న్ ఇరానీ) ప్రముఖ వ్యాపార వేత్త‌. ఏబీ సంస్థ‌ల‌కు అధిప‌తి. కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు విందాని, అత‌ని త‌న‌యుడిని వ్యాపార లావాదేవీలు కార‌ణంగా చంపేస్తారు. దాంతో విందా భార్య ఇంద్రాణి (ఖుష్బూ) కంపెనీ వ్య‌వ‌హారాలు ప‌ర్య‌వేక్ష‌ణ కోసం బాల‌సుబ్ర‌మ‌ణ్యం(ప‌వ‌న్ క‌ల్యాణ్‌)ని మేనేజ‌ర్‌గా నియ‌మిస్తారు. అస్సాం నుండి వ‌చ్చిన బాల‌సుబ్ర‌మ‌ణ్యం మేనేజ‌ర్‌గా వ్య‌వ‌హారాలు చేసుకుంటేనే.. విందా హ‌త్య‌కు కార‌కులెవ‌ర‌నే దానిపై ఆరా తీస్తుంటాడు. ఇంత‌కు విందాను హ‌త్య చేసిందెవ‌రు? అస‌లు బాల‌సుబ్ర‌మ‌ణ్య‌మెవ‌రు? అస్సాం నుండి ఏబీ మేనేజ‌ర్‌గా రావ‌డానికి కార‌ణాలేంటి? బాల‌సుబ్ర‌మ‌ణ్యం, అభివ్య‌క్త భార్గ‌వ‌కు ఉన్న రిలేష‌న్ ఏంటి? సీతారామ్‌(ఆదిపినిశెట్టి) ఎవ‌రు త‌న‌కి, విందాకు ఉన్న లింకేంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే వెండితెర‌పై సినిమా చూడాల్సిందే.
 
!! విశ్లేష‌ణ !!
 
టాలీవుడ్ లో అగ్ర సినిమా అంటే క‌థ మొత్తం ఆయ‌న చుట్టే తిరుగుతుంది. అలానే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అజ్ఙాత‌వాసి సినిమా క‌థ కూడా  ప‌వ‌న్ చుట్టు తిరిగింది. డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కూడా ప‌వ‌న్ ను బేస్ చేసుకుని ఈ క‌థ‌ను మ‌లిచారు... ఈ సినిమాలో ప్ర‌తీ ఒక్క‌రు వారి వారి న‌ట‌న‌కు న్యాయం చేశారు... అందులో ముఖ్యంగా చెప్పాలంటే ఖుష్బు  పాత్ర ద‌ర్శ‌కుడు ఇంద్రాణి పాత్ర‌లో చ‌క్క‌గా చిత్రీకరించారు.. ఈమె గ‌తంలో స్టాలిన్ సినిమాలో చిరంజీవికి అక్క‌గా త‌న న‌ట‌న‌తో అంద‌రిని ఆక‌ట్టుకుంది.
 
ఈ సినిమా త‌రువాత ఖుష్బు మ‌రే సినిమాలో న‌టించ‌లేదు... అయితే అజ్ఙాత‌వాసి లో న‌టించి మ‌రోసారి త‌న పాత్ర‌లో ఒదిగిపోయింది. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న డైలాగ్స్ తో, యాక్స‌న్, ఫైట్స్ ల‌తో త‌న అభిమానుల‌ను అల‌రించారు. ప‌వ‌న్ స‌ర‌స‌న కీర్తి సురేష్, అను ఇమాన్యుయేల్ పాత్ర కూడా ద‌ర్శ‌కుడు అద్భుతంగా మ‌లిచారు. ఇక పోతే రావు ర‌మేష్ పాత్ర కేవ‌లం కామెడికే ప‌రిమితం చేశారు... మిగిలిన పాత్రలో న‌టించిన వారంద‌రు విల‌న్ గా చిత్రీక‌రించారు. అయితే ముఖ్యంగా ప‌వ‌న్ పాడిన కొడ‌కా కోటేశ్వ‌ర‌రావా పాట సినిమాలో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది... మ‌ణికంద‌న్ ప్ర‌తీ స‌న్నివేశాన్ని చ‌క్క‌గా చిత్రీక‌రించాడు. ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన హ్యాట్రిక్ మూవీ కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి అవి సినిమాలో ఆక‌ట్టుకున్నాయి.. పెద్ద కంపెనీ యాజ‌మానుల మ‌ధ్య పోరు అంటే ఎత్తులు, పై ఎత్తులు ఉండ‌టం.. హీరో ఎంట్రీ వ‌చ్చి త‌న కుటుంబాన్ని కాపాడుకోవడం వంటి స‌న్నివేశాలను చాలా సినిమాల్లో ప్రేక్ష‌కులు చూసేశారు. అయినా ఆద‌రిస్తారు అన‌డంలో అతిశ‌యోక్తి లేదు అనే చెప్పాలి.
 
!! బ‌లాలు !!
 
ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌ట‌న 
ఇంట‌ర్వెల్ ముందు స‌న్నివేశాలు అద్బుతంగా మ‌లిచారు
కామెడీ సన్నివేశాలు
మ్యూజిక్
సినిమాటోగ్ర‌ఫీ
 
!! బ‌ల‌హీన‌త‌లు !!
 
క‌థ అత్తారింటికి దారేది సినిమాకు ద‌గ్గ‌ర‌గా ఉండ‌టం
క‌థ‌నంలో అధిక సారాంశం  లేక‌పోవ‌డం
ఈ చిత్రంలో హీరోయిన్స్ పాత్ర త‌గినంత లేక‌పోవ‌డం
 
అజ్ఞాత‌వాసి కాస్త ఎత్తులు, న‌ట‌న, స్టైల్, ఫైట్లతో అల‌రించాడు కేవ‌లం అభిమానుల‌ను మాత్ర‌మే 
 
 
  రేటింగ్ - 2.75/5
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.