రష్మిక కి ప్రొడ్యూసర్స్ అంత ఇచ్చుకోగలరా?

Breaking News

హోమ్        న్యూస్

Updated:  2018-09-14 06:08:22

రష్మిక కి ప్రొడ్యూసర్స్ అంత ఇచ్చుకోగలరా?

"ఛలో" సినిమా తో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కిరాక్ భామ రష్మిక. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ కావడం రష్మిక కెరీర్ కి పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. ఆ సినిమా అయిపోయిన వెంటనే రష్మికకి వరుస పెట్టి ఆఫర్స్ వచ్చాయి, కానీ రష్మిక మాత్రం ఆలోచింది ఏరి కోరి మరి "గీత గోవిందం" సినిమాలో నటించింది. ఈ సినిమా అయితే ఏకంగా వంద కోట్ల దగ్గరకి వచ్చి ఆగింది. ఇప్పుడు ఈ హిట్ చూసుకునే రష్మిక ప్రొడ్యూసర్స్ దగ్గర ఎక్కువ వసూలు చేస్తుంది అంట.
 
తదుపరి సినిమాలకి రష్మిక ఏకంగా 75 లక్షల నుంచి కోటి వరకు డిమాండ్ చేస్తుంది అంట. కానీ మన తెలుగు నిర్మాతలు మాత్రం రష్మికకి 50 లక్షలు మాత్రమే ఇచ్చుకోడానికి ముందుకి వస్తున్నారు. రష్మిక మాత్రం కనీసం కనికరించకుండా ఒక్క రూపాయి కూడా తగ్గించట్లేదు అంట. ఒకవేళ ఈ భామ ఇదే ధోరణి కొనసాగిస్తే తెలుగు ఇండస్ట్రీ లో ఎక్కువ కాలం కొనసాగాలేరు అని అంటున్నారు ఫిలిం నగర్ జనాలు. మరి రష్మిక తన జోరు తగ్గిస్తుందో లేదో చూడాలి.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.