ఛలో మూవీ రివ్యూ

Breaking News

హోమ్        న్యూస్

Updated:  2018-02-02 12:05:29

ఛలో మూవీ రివ్యూ

నిర్మాణ సంస్థ : ఐరా క్రియేష‌న్స్‌
తారాగ‌ణం: నాగ‌శౌర్య‌, ర‌ష్మిక మండ‌న్నా, సీనియ‌ర్ న‌రేష్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు
కూర్పు: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
సంగీతం: సాగ‌ర్ మ‌హ‌తి
చాయాగ్ర‌హ‌ణం: సాయిశ్రీరామ్‌
నిర్మాత : ఉషా ముల్పూరి
ద‌ర్శ‌క‌త్వం: వెంకీ కుడుముల‌
 
 
 
నాగ‌శౌర్య ఊహ‌లు గుస‌గుస‌లాడే సినిమాతో త‌న‌కంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో త‌ర్వాత వ‌రుస‌గా దిక్కులు చూడ‌కు రామ‌య్యా, జాదూగాడు, క‌ల్యాణ వైభోగ‌మే, ఒక మ‌న‌సు, జో అచ్యుతానంద వంటి సినిమాలు చేసుకుంటూ వ‌చ్చాడు శౌర్య కాని ఈ సినిమాలు హిట్ టాక్ కు దూరంగా కాస్త అటూ ఇటూగా త‌న కెరియ‌ర్ ను మార్చాయి 
తాజాగా సొంతంగా ఐరా క్రియేష‌న్స్ నిర్మాణ సంస్ధ‌ను  స్టార్ట్ చేసి వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఛ‌లో సినిమా చేశాడు ఆ సినిమా నేడు విడుద‌లైంది ఆ చిత్రం ఎలా అల‌రించిందో ఓ సారి చూద్దాం 
 
క‌థ:
చిన్న పిల్ల‌ల మ‌న‌స్త‌త్వం చాలా భిన్నంగా ఉంటుంది. కానీ నేప‌థ్యానికి భిన్నంగా ఉండే పిల్లాడు హ‌రి (నాగ‌శౌర్య‌). చిన్న‌పిల్లాడైనా ఎవ‌రైనా గొడ‌వ‌లు ప‌డుతుంటే చూడాల‌నుకునే విప‌రీత మ‌న‌స్త‌త్వం హ‌రిది. దీంతో హ‌రి తండ్రి (సీనియ‌ర్ న‌రేశ్‌) త‌న‌ని తిరుపురం అనే ఊరుకి పంపేస్తాడు. హ‌రి అక్క‌డే పెరిగి పెద్ద‌వుతాడు. తిరుపురం ఆంధ్ర బోర్డ‌ర్‌లో ఉంటుంది. ఆ ఊళ్లో తెలుగువారు, త‌మిళులు ఎందుక‌నో కంచె వేసుకుని గొడ‌వ‌లు ప‌డుతుంటారు. హ‌ద్దు దాటి ఎవ‌రూ రారు. అలా వ‌స్తే సంప్ర‌దాయంగా చంపేసుకుంటూ ఉంటారు. తిరుపురం కాలేజీలో చ‌దువుకున్న హ‌రి కార్తీక (ర‌ష్మిక మండ‌న్నా)ను ప్రేమిస్తాడు. తెలుగువాడైన హ‌రిని చంపాల‌నుకుంటారు త‌మిళులు అయితే హ‌రి త‌ప్పించుకుంటాడు. త‌మ ప్రేమ గెల‌వాలంటే రెండు వ‌ర్గాలు క‌ల‌వాల‌నే నియ‌మం పెడుతుంది కార్తీక ,అప్పుడు హ‌రి ఏం చేస్తాడు? రెండు ఊర్ల‌ను క‌లుపుతాడా త‌న ప్రేమ‌ను సాధిస్తాడా అనేది తెలుసుకోవాలంటే తెర‌పై చూడాల్సిందే 
 
 
విశ్లేష‌ణ‌:
 
  ఈ చిత్రంలో నాగ శౌర్య న‌ట‌న బాగుంది లుక్స్ విష‌యంలో డైరెక్టర్ బాగా చూపించారు నాగ శౌర్య‌ను.. నాగా శౌర్య పాత్ర న‌ట‌న ప‌రంగా మెప్పించింది త‌న న‌ట‌న బాగుంది.. ర‌ష్మిక‌కు తొలిచిత్రం అయినా త‌న న‌ట‌న‌తో మెప్పించింది.న‌ట‌న బాగానే చేసింది తొలిచిత్రం అయినా.సీనియ‌ర్ న‌రేష‌, ప్ర‌గ‌తి, రాజేంద్ర‌న్‌, ప్ర‌వీణ్‌, మైమ్ గోపీ, వైవా హ‌ర్ష‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, రాకెట్ రాఘ‌వ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. స‌త్య, వెన్నెల‌కిషోర్ త‌దిత‌రులు త‌మ‌దైన కామెడీ మెప్పించే ప్ర‌య‌త్నం చేశారు.ఫ‌స్టాఫ్ అంతా హీరో, హీరోయిన్ ప్రేమ‌క‌థ‌, వారి మ‌ధ్య టీజింగ్ స‌న్నివేశాలతో సాగిపోతుంది. కాస్త అక్క‌డ‌క్క‌డా లాజిక్ లేకుండా సినిమా న‌డుస్తుంది. ఓ సిల్లీ పాయింట్ లా గ్రామంలో ఇరువర్గాలు కొట్టుకోవ‌డం అనేది అర్ధం కాని అంశం. సంగీతం బాగుంది పాట‌లు బాగున్నాయి. అస‌లు గొడ‌వ‌లు ప‌డే కుమారుడ్ని గొడ‌వ‌లు ఎక్కువ‌గా ఉండే ఊరికి తండ్రి ఎందుకు పంపుతాడు అనే లాజిక్ ద‌ర్శ‌కుడు మిస్ అయ్యారు అని స‌గ‌టు ప్రేక్ష‌కుడ్ని ఆలోచింప చేస్తుంది.
 
 
బ‌లాలు:
హీరో హీరోయిన్ పాత్ర‌లు
సినిమాటోగ్ర‌ఫీ
మాట‌లు, 
పాట‌లు
సంగీతం 
నేప‌థ్యం
 
 
బ‌ల‌హీన‌త‌లు
బ‌ల‌మైన క‌థ లేక‌పోవ‌డం
లాజిక్ లేని స‌న్నివేశాలు
సెకండాఫ్ స్లో నేరేష‌న్ 
 
 
రేటింగ్ 2.5 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.