"చి.లా.సౌ" మూవీ రివ్యూ

Breaking News

హోమ్        న్యూస్

Updated:  2018-08-03 11:21:05

"చి.లా.సౌ" మూవీ రివ్యూ

తెలుగు లోకి "అందాల రాక్షసి" అనే సినిమా ద్వారా హీరో గా ఎంట్రీ ఇచ్చాడు రాహుల్ రవీంద్రన్. ఆ సినిమా తరువాత రాహుల్ కి తెలుగు లో అంత గొప్పగా అవకాశాలు రాలేదు. అయితే ఇక హీరోగా సక్సెస్ అవ్వను అని గ్రహించాడో ఏమో గానీ సడన్ గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వైపు అడుగులు వేసాడు. అక్కినేని ఫ్లాప్ హీరో అయిన సుశాంత్ ని హీరోగా పెట్టి "చి.లా.సౌ" అనే సినిమాని డైరెక్ట్ చేసాడు రాహుల్ రవీంద్రన్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ కింద అక్కినేని నాగార్జున ఈ సినిమాకి వెన్నుముక్కగా నిలిచాడు. మరి దర్శకుడిగా మారిన ఈ హీరో తన తోలి సినిమా తో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడో లేదో అనేది ఇప్పుడు రివ్యూ లో చూద్దాం.
 
ముందుగా కథ విషయంలోకి వెళ్తే 27 ఏళ్ళ అర్జున్ (సుశాంత్) పెళ్లి చేసుకోడానికి రెడీ గా ఉండడు. పేరెంట్స్ ఎంత ఒత్తిడికి గురి చేసిన గాని అయిదేళ్ళ తరువాతే పెళ్లి చేసుకుంటాను అని పట్టుబట్టుకొని కూర్చుంటాడు. ఇక లాభం లేదు అనుకోని అర్జున్ పేరెంట్స్ అర్జున్ కి అంజలి (రుహని శర్మ) తో పెల్లు చూపులు అరేంజ్ చేస్తారు. అలా అర్జున్ తన పేరెంట్స్ ద్వారా అంజలిని కలుస్తాడు. అప్పుడే అంజలితో క్లియర్ గా చెప్పేస్తాడు అర్జున్ తను అప్పుడే పెళ్ళికి రెడీ గా లేడు అని. అదే టైం కొంచెం డిస్సపాయింట్ అయిన అంజలి అర్జున్ కి తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అసలు అంజలి గతం ఏంటి ? అర్జున్ అంజలికి ఎలా ఇంప్రెస్ అయ్యాడు ? ఫైనల్ గా వాళ్లు పెళ్లి చేసుకున్నారా లేదా అనేది మిగిలిన కథ.
 
ఇక నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే సుశాంత్ తన గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. ఈ సినిమాలో తప్పకుండా ఒక కొత్త సుశాంత్ ని చూస్తారు ప్రేక్షకులు. ఒక్క లుక్ విషయంలోనే కాకుండా మాటలు, పెర్ఫార్మన్స్ విషయంలో కూడా చాలా బాగా డెవలప్ అయ్యాడు సుశాంత్. సుశాంత్ మొట్ట మొదటి సారి తన కెరీర్ లో కమర్షియల్ కథకి దూరంగా ఒక క్యూట్ లవ్ స్టొరీ లో నటించాడు అని చెప్పొచ్చు. అలాగే కొత్త నటి అయిన రుహని శర్మ కూడా సుశాంత్ పక్కన పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఈ కొత్త అమ్మాయి బిగ్ స్క్రీన్ మీద చాలా అందంగా అనిపించింది. ఇక హీరోయిన్ తల్లిగా రోహిణి బాగా చేసింది. చాలా రోజుల తరువాత రోహిణికి ఈ సినిమా ద్వారా ఒక మంచి పాత్ర లభించింది అని చెప్పొచ్చు. అదే విధంగా హీరో తల్లి తండ్రులుగా అను హసన్ ఇంకా సంజయ్ స్వరూప్ లు పర్వాలేదు అనిపించారు. ఇకపోతే సినిమాకి వెన్నెల కిషోర్ పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. వెన్నెల కిషోర్ సుజీత్ అనే క్యారెక్టర్ లో నవ్వుల పువ్వులు పూయించాడు. అలాగే రాహుల్ రామ కృష్ణ కూడా ఉన్నది కాసేపే అయిన నవ్వించాడు.
 
ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమా కి మ్యూజిక్ అందించిన ప్రశాంత్ విహారిని ముందుగా మెచ్చుకోవాలి. చక్కటి మ్యూజిక్ తో అలాగే మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సీన్స్ ని బ్యూటిఫుల్ గా నడిపించాడు. సినిమా చాల చోట్ల డల్ అయినప్పుడు ప్రశాంత్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆ సీన్ ని బాగా ఎలివేట్ చేసాడు. ఇక సినిమాటోగ్రాఫర్ సుకుమార్ తన పనితనం తో పర్వాలేదు అనిపించాడు. నైట్ ఎఫెక్ట్ లో వచ్చే సీన్స్ ని చాలా అందంగా చూపించాడు సుకుమార్. ఇకపోతే డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గురించి మాట్లాడుకోవాలి. నటన నుంచి దర్శకత్వం వైపుకి వచ్చిన రాహుల్ తన తోలి సినిమాకి చాలా మంచి కథని రాసుకున్నాడు. అలాగే సీన్స్ కి తగ్గ మాటలని కూడా బాగా రాసుకున్నాడు రాహుల్. కానీ కథనం మాత్రం ఇంకొంచెం ఫాస్ట్ గా నడిపించి ఉంటే బాగుండేది అనిపించింది. ఏది ఏమైనా దర్శకుడిగా తోలి ప్రయత్నంలో మాత్రం రాహుల్ తప్పటడుగు వేయలేదు అనే చెప్పాలి. ప్రేక్షకులకి ఒక క్యూట్ లవ్ స్టొరీ ని చాలా క్యూట్ గా ప్రెసెంట్ చేసాడు రాహుల్.
 
ఇక ఫైనల్ గా చూసుకుంటే రాహుల్ మాత్రం తన తోలి స్క్రిప్ట్ తోనే అందరిని ఆశ్చర్యపరిచాడు. ఒక మంచి డీసెంట్ కథని ప్రేక్షకులని చెప్పడంలో సక్సెస్ అయ్యాడు రాహుల్. అలాగే అక్కినేని హీరో అయిన సుశాంత్ కి కూడా ఒక మంచి కథని ఇచ్చాడు రాహుల్. ఈ వీకెండ్ కి ఒక మంచి క్లాస్ సినిమా చూడాలి అనుకుంటే "చి.లా.సౌ" కి హ్యాపీ గా వెళ్ళొచ్చు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.