కేరాఫ్ కంచరపాలెం సినిమా రివ్యూ

Breaking News

హోమ్        న్యూస్

co kancharapalem review
Updated:  2018-09-05 11:22:52

కేరాఫ్ కంచరపాలెం సినిమా రివ్యూ

గత కొంత కాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక సినిమా పేరు తెగ మారుమోగిపోతుంది. ఆ సినిమానే "కేరాఫ్ కంచరపాలెం". వెంకటేష్ మహా అనే కొత్త కుర్రాడు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇండస్ట్రీ లో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరో రానాని. అందుకే రానా తన సొంత బ్యానర్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ మీద ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమాని చూసిన వారు అంతా ఈ సినిమాని ఒక రేంజ్ లో పొగిడేస్తున్నారు. మరి అంతలా ఈ సినిమాలో ఎం ఉంది. అసలు ఈ సినిమా అంత ఎత్తున తీసుకెళ్ళి ఎందుకు పెట్టారు అనేది ఇప్పుడు మనం రివ్యూ లో చూద్దాం.
 
ముందుగా కథ విషయంలోకి వెళ్తే ఇది ఒక నాలుగు జీవితాల కథ. సుందరం (కేశవ కర్రి) అనే స్కూల్ పిల్లాడు తన తరగతి లో ఉండే సునీత (నిత్య శ్రీ) ని ప్రేమిస్తాడు, సునీత అంటే సుందరం కి చాలా ఇష్టం. తన కోసం ఏమైనా చేయ్యగాలుగుతాను అనేంతగా సునీత ని ఇష్టపడతాడు. మరో వైపు జోసెఫ్ (కార్తీక్ రత్నం) ఓ జిమ్‌లో పనిచేస్తూ గొడవలు, సెటిల్‌మెంట్స్‌ చేసే జోసెఫ్‌ ఓ గొడవ వల్ల పరిచయం అయిన భువనేశ్వరి (ప్రణీతా పట్నాయక్‌) అనే బ్రాహ్మణుల అమ్మాయిని ప్రేమిస్తాడు.
 
కానీ జొసెఫ్ ఒక రౌడీ అదే వాళ్ళ ప్రేమకి అడ్డుగా మారుతుంది. మరోవైపు గడ్డం (మోహన్ భగత్) వైన్ షాప్ లో బాయ్ గా పని చేస్తూ ఉంటాడు. రోజు తన షాప్ ముందే ఒక వేశ్య సలీమా (విజయ ప్రవీణ పరుచూరి) వచ్చి మందు కొనుక్కొని వెళ్తుంది. ఆ అమ్మాయి ఎప్పుడు పరద కట్టుకొని ఉంటుంది. ఆ పరద వెనకాల దాగి ఉన్న కళ్ళని చూసి గడ్డం ఆమె ప్రేమలో పడిపోతాడు. ఇంకో వైపు రాజు (సుబ్బారావు) ఓ గవర్నమెంట్‌ ఆఫీసులో అటెండర్‌. 49 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కానీ బ్రహ్మచారి. అదే సమయంలో  ఒరిస్సా నుంచి ట్రాన్సఫర్‌ మీద తమ ఆఫీసుకు వచ్చిన ఆఫీసర్‌ రాధ( రాధ బెస్సీ) తో ప్రేమలో పడతాడు. మరి వీరి ప్రేమ పెళ్ళికి దారి తీసిందా లేదా ? ఇలా కంచరపాలెం లో జరిగే నాలుగు జీవితాల సమ్మోహనమే ఈ సినిమా.
 
ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాతో దాదాపు 52 మంది కొత్త నటులు తెలుగు తెరకి పరిచయం కానున్నారు. దాదాపు ఈ సినిమాలో నటించిన అందరూ కొత్త వారే. ఎక్కువ హంగులకి పోకుండా పాత్రకి తగ్గట్టు పాత్రలో జీవిస్తూ మరి నటించారు, ఇంకా చెప్పాలి అంటే ఇది తమ కథ అనుకోని తమ పాత్రల్లో లీనమైపోయారు నటులు. సినిమా స్టార్ట్ అయినప్పుడు మనకి ప్రతి ఒక్క పాత్ర కొత్తగానే ఉంటుంది, కానీ అలవాటు అయిన కొద్ది వారు మనలో కలిసిపోతారు. సినిమా చూసి ఇంటికి వచ్చాక కూడా మనతో ఉండిపోతారు.
 
ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే వెంకటేష్ మహా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇప్పటి కాలం లో ఒక్క చిన్న హీరోతో కమర్షియల్ సినిమా తీసి దాన్ని ఆవరేజ్ హిట్ చేసి ఆ హిట్ పేరు చెప్పుకొని కొంచెం మార్కెట్ ఉన్న హీరో తో సినిమాలు తీసే డైరెక్టర్స్ ఉన్న ఈరోజుల్లో కేవలం కథ మీద పాత్రల మీద ఉన్న నమ్మకంతో అవే నాకు తల్లి తండ్రులు అని నమ్మి వాటితోనే ఉంటూ వాటితోనే గడుపుతూ  సొంతగా ఎన్నో కష్టాలు పడి తెలుగు సినిమాకి ఒక మంచి చిత్రాన్ని అందించాడు వెంకటేష్ మహా. సినిమాలో వచ్చే ప్రతి ఒక ఎమోషన్ ని చాలా సహజంగా తెరకెక్కించాడు దర్శకుడు. సాధారణంగా ఏ సినిమా అయిన సరే కొంత మంది మాత్రమే కనెక్ట్ అవుతారు, కానీ ఈ సినిమాలో ఏదో ఒక టైం లో ప్రతి ఒక ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. సినిమాటోగ్రఫీ సినిమాకి తగట్లు ఉంది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి.నిర్మాత పరుచూరి విజయ ప్రవీణాను ఇలాంటి చిత్రాన్ని నిర్మిచినందుకు అభినందించి తీరాలి. ఇలాంటి సినిమాలు జనాల్లోకి రాకముందే చచ్చిపోతాయి, కానీ ఇలాంటి ఒక సినిమా ఉంది అని గ్రహించి దాన్నీ ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్న రానాని మెచ్చుకోవాలి.
 
మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆలోచింపజేస్తుంది...ముఖ్యంగా బ్రతుకు విలువ తెలుపుతుంది. "కేరాఫ్ కంచరపాలెం" ఇది ఒక ఊరు పేరు మాత్రమే కాదు ఒక జీవితం. ఆ ఊరిలో ఉండేవి పాత్రలు మాత్రమే కాదు మనతో పాటు ఉండి మనల్ని జీవితం గురించి ఒక్క సారి ఆలోచించుకునేలా చేసే జ్ఞపకాలు.
 
రేటింగ్:- ఇది కమర్షియల్ సినిమా అయితే రేటింగ్ ఇవొచ్చు, కానీ ఇది ఒక జీవితం ప్రతి ఒక్కరు వెళ్లి అనుభవించాల్సిందే. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.