ఈ నగరానికి ఏమైంది సినిమా రివ్యూ

Breaking News

హోమ్        న్యూస్

Updated:  2018-06-29 09:08:09

ఈ నగరానికి ఏమైంది సినిమా రివ్యూ

సినిమా  : ఈ నగరానికి ఏమైంది?
కాస్టింగ్  : విశ్వక్ సేన్ నాయుడు, సుశాంత్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, సిమ్రన్ చౌదరి
మ్యూజిక్  : వివేక్‌ సాగర్‌
దర్శకత్వం : తరుణ్‌ భాస్కర్‌
ప్రొడ్యూసర్ : డి. సురేష్‌ బాబు
 
మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన తరుణ్ భాస్కర్ కొంచెం గ్యాప్‌ తీసుకొని మరో మంచి సబ్జెక్టు తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్కా యూత్‌ ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది? సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌ లాంటి గొప్ప సంస్థ నిర్మించటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ సినిమాకి చేసిన ప్రొమొతిఒన్స్ కూడా మంచి హైప్ ని ఇచ్చాయి...సుమారు పది సినిమాలు ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్నాయి...
 
పెళ్లి చూపులు సినిమాతో డిఫరెంట్ గా ట్రై చేసి హిట్ కొట్టిన తరుణ్ భాస్కర్...ఈ నగరానికి ఏమైంది? మరో హిట్ కొడతాడా లేదా చూద్దాం...
 
కథ:
 
ఈ నగరానికి ఏమైంది? ఈ సినిమా నలుగురు మధ్య తరగతి కుటుంబ యువకుల కథ. వివేక్, కార్తిక్, కౌశిక్, ఉపేంద్ర లు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఈ నాలుగురు ఎదో సాధించాలని కలలు కంటుంటారు...  అందులో కార్తీక్‌కి ఓనర్‌ కూతురితో పెళ్లి కుదరటంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒక్కటవుతారు. బార్‌లో ఫ్రెండ్స్‌ అంతా బాగా తాగేసి అనుకొని పరిస్థితుల్లో గోవా వెళ్లిపోతారు. అలా గోవాకి వెళ్లిన నలుగురు స్నేహితులు ఏం చేశారు..? ఈ ప్రయాణం వారికి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది.? ఈ ట్రిప్ తరువాత వారు ఎలా మారిపోయారు? అన్నదే మిగతా కథ.
 
నటీనటులు :
 
సినిమా అంతా నలుగురు కుర్రాళ్ల చుట్టూనే తిరుగుతుంది. కొత్త వాళ్ళను ఎంచుకున్న వాళ్ళ నుంచి నటనను రాబట్టుకోగలిగాడు దర్శకుడు తరుణ్ భాస్కర్...ఈ నలుగురు కుర్రోళ్ళు కొత్త వాళ్లైనా వాళ్ళ పాత్రలకు న్యాయం చేసారు...వివేక్‌ ప్రేమ కథలో వచ్చే శిల్ప పాత్రలో సిమ్రాన్‌ చౌదరిని అందంగా చూపించారు. మోడ్రన్ అమ్మాయిగా అనీషా ఆంబ్రోస్‌ అందం, అభినయంతో ఆకట్టుకుంది.
 
విశ్లేషణ :
 
పెళ్లిచూపులు లాంటి హిట్ సినిమా తరువాత దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ పక్కా యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ను ఎంచుకొని, డిఫరెంట్ గా తెరకెక్కించాడు. గతంలో మనమెప్పుడు చూడని సరి కొత్త పంధాలో ఈ సినిమా నడుస్తుంది...సినిమా సన్నివేశాలు ఇరికించినట్టు కాకుండా కథతోనే సాగిపోతాయి...
 
నలుగురు స్నేహితుల మధ్య కథను ఆసక్తికరంగా తెరమీద చూపించటంలో తరుణ్ భాస్కర్‌ విజయం సాధించాడని చెప్పాలి. కొన్ని సందర్భాలలో అయితే దర్శకత్వాన్ని తనలోని రచయిత డామినెటే చేసింది
 
సినిమాలో వచ్చే కొన్ని డైలాగ్స్ మనల్ని కదిలింపచేస్తాయి..ఫస్ట్ హాఫ్ కామెడీ సీన్స్‌ తో కథ వేగంగా నడుస్తుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం నెమ్మదించిన బాగానే నడిపించాడు... మ్యూజిక్వి డైరెక్టర్ వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చారు...పాటలు పరవాలేదు...
 
ప్లస్‌ పాయింట్స్‌ :
 
లీడ్‌ రోల్స్ లో చేసిన వారి నటన
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ 
డైలాగ్స్‌
సినిమాటోగ్రఫీ 
 
మైనస్‌ పాయింట్స్‌ :
 
సికంద్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు
లవ్‌ స్టోరి
 
రేటింగ్ : 3

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.