గాయత్రి మూవీ రివ్యూ

Breaking News

హోమ్        న్యూస్

Updated:  2018-02-09 01:02:14

గాయత్రి మూవీ రివ్యూ

టైటిల్ : గాయత్రి
జానర్ : యాక్షన్‌ డ్రామా
తారాగణం : మోహన్‌ బాబు, మంచు విష్ణు, శ్రియ, నిఖిలా విమల్‌, అనసూయ
సంగీతం : తమన్‌ ఎస్‌
దర్శకత్వం : మదన్‌
నిర్మాత : మోహన్‌ బాబు
 
సీనియ‌ర్ న‌టుడు మంచు మోహ‌న్ బాబు హీరోగా తెర‌కెక్కిన చిత్రం గాయ‌త్రి చాలా గ్యాప్ తీసుకుని మెయిన్ రోల్ లో మోహ‌న్ బాబు సినిమా చేశారు ల‌క్ష్మి ప్ర‌స‌న్న బ్యాన‌ర్ పై తెర‌కెక్కిన ఈ చిత్రంలో మోహ‌న్ బాబు ద్విపాత్రాభిన‌యం చేశారు ఓ సారి ఆ సినిమా ఎలా అల‌రించిందో చూద్దాం.
 
!! కథ !!
 
దాసరి శివాజీ !! మోహన్‌ బాబు!! రంగస్థల నటుడు. దూరమైన కూతురి కోసం ఎదురుచూస్తూ కొంత మంది అనాథలను చేరదీసి శారదా సదనం అనే అనాథాశ్రమాన్ని నిర్వహిస్తుంటాడు. దానికి రీజ‌న్ తన కూతురు ఏదో ఒక అనాథాశ్రమంలో ఉండే ఉంటుందన్న నమ్మకంతో  అలా అన్ని అనాథాశ్రమాలకు డబ్బు సాయం చేస్తుంటాడు. 
ఆ డబ్బు కోసం నేరస్థులలా మేకప్ వేసుకొని వారికి బదులు జైలు శిక్ష అనుభవిస్తుంటాడు.శివాజీ మీద అనుమానం వచ్చిన జర్నలిస్ట్‌ శ్రేష్ఠ !! అనసూయ!! అతడి చేసే పని ఎలాగైన బయటపెట్టాలని ప్రయత్నిస్తుంటుంది.. దాని కోసం ఆమె అవ‌కాశాలని చూస్తుంది.
 
ఓ గొడవ కారణంగా శివాజీకి తన కూతురు ఎవరో తెలుస్తుంది. కూతుర్ని కలుసుకునే సమయానికి గాయత్రి పటేల్ !!మోహన్‌ బాబు!! , శివాజీని కిడ్నాప్ చేస్తాడు. తన బదులుగా శివాజీని ఉరికంభం ఎక్కించాలని ప్లాన్ చేస్తాడు గాయత్రి పటేల్‌. తనకు బదులుగా శిక్ష అనుభవించడానికి గాయత్రి పటేల్‌.. శివాజీనే ఎందుకు ఎంచుకున్నాడు..? శివాజీ కూతురు గాయత్రికి, గాయత్రి పటేల్‌కు సంబంధం ఏంటి..? ఈ సమస్యల నుంచి శివాజీ ఎలా బయటపడ్డాడు..? చివరకు గాయత్రి పటేల్‌ ఏమయ్యాడు..? అన్నదే వెండితెర‌పై చూడాలి
 
 
విశ్లేషణ :
మ‌ద‌న్  ఈసారి ఓ థ్రిల్ల‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు... మోహ‌న్ బాబును ఈ క‌థ‌కు ఎంచుకోవ‌డం బాగుంది అని చెప్ప‌వ‌చ్చు.. చాలా కాలం తరువాత మోహన్‌ బాబు ను పూర్తి నెగెటివ్ క్యారెక్టర్ లో చూపించిన మదన్, అభిమానులను  మెప్పించాడు... ఫ‌స్ట్ హాఫ్ క‌థ చాలా వేగంగా న‌డిచింది అని చెప్ప‌వ‌చ్చు. సెకండాఫ్ కాస్త స్లో అనే చెప్ప‌వచ్చు... పాటల అమ‌రిక అసంద‌ర్బంగా ఉంది అని ప్రేక్ష‌కులు భావిస్తారు..
 
డైమండ్‌ రత్నబాబు డైలాగ్స్ సినిమాకు చాలా ప్ల‌స్ గా ఉన్నాయి . ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివాజీ పాత్రతో పలికించిన డైలాగ్స్‌కు థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి.. తమన్ సంగీతమందించిన పాటలు పరవాలేదనిపించినా.. నేపథ్య సంగీతంతో మాత్రం మరోసారి మ్యాజిక్ చేశాడు. ఎడిటింగ్‌, సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. సినిమాలో చాలా రోజులు త‌ర్వాత మోహ‌న్ బాబు త‌న పూర్తిస్ధాయి న‌ట‌న‌తో అల‌రించాడు అభిమానుల‌ను. 
 
ప్లస్ పాయింట్స్ :
మోహన్‌ బాబు నటన
డైలాగ్స్‌
పంచ్ డైలాగ్స్ 
ఫ‌స్ట్ ఆప్ 
 
మైనస్ పాయింట్స్ :
సెకండ్‌ హాఫ్‌ స్లో నేరేషన్‌
సాంగ్స్‌
 
రేటింగ్ 2.75

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.