గూఢచారి మూవీ రివ్యూ

Breaking News

హోమ్        న్యూస్

Updated:  2018-08-03 12:48:15

గూఢచారి మూవీ రివ్యూ

"క్షణం" సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి ఒక రకం అయిన థ్రిల్లర్ సినిమాని పరిచయం చేసాడు అడివి శేష్. ఆ సినిమా సక్సెస్ తరువాత శేష్ కి డైరెక్టర్ గా కథా రచయిత గా మంచి అవకాశాలు వచ్చాయి, కానీ శేష్ మాత్రం అవేవి ఓకే చెయ్యకుండా మళ్ళి తన సొంత కథతో హీరో గా "గూఢచారి" అనే సినిమాని చేసాడు. ఈ సినిమా ద్వారా శశి కిరణ్ తిక్క ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు శేష్. మరి పూర్తి స్థాయి స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ "గూఢచారి" మరి ప్రేక్షకుల అంచనాల్ని అందుకుందో లేదో ఇప్పుడు రివ్యూ లో చూద్దాం.
 
ముందుగా కథ విషయంలోకి వెళ్తే గోపి (అడివి శేష్) వాళ్ళ నాన్న చిన్నప్పుడే దేశం కోసం ప్రాణం వదిలేస్తాడు. ఆ తరువాత గోపి ప్రాణానికి ప్రమాదం ఉంది అని గ్రహించిన గోపి మామయ్య సత్య (ప్రకాష్ రాజ్) గోపి కి అర్జున్ గా పేరు మార్చి పెంచుతాడు. అలాగే తన తండ్రి గురించి మర్చిపోవాలి అని, ఎవరు అడిగిన తన తండ్రి పేరు రఘువీర్ అని చెప్పకూడదు అని కండిషన్ పెడతాడు. అర్జున్ కూడా అలాగే పెరుగుతాడు, కానీ అర్జున్ కి మాత్రం దేశం కోసం సీక్రెట్ గా పనిచేసే త్రినేత్ర లో జాయిన్ అవ్వాలి అని ఉంటుంది, అనుకునట్టుగానే త్రినేత్ర లో జాయిన్ అవుతాడు అర్జున్. ఈ క్రమం లోనే అర్జున్ సమీరతో (శోబిత) ప్రేమలో పడాతాడు. ఇక అక్కడ నుంచి అర్జున్ లైఫ్ ఎలా టర్న్ అయ్యింది, అసలు సమీర అర్జున్ లైఫ్ లోకి ఎందుకు వచ్చింది. సత్య అర్జున్ దగ్గర దాచిపెట్టిన నిజం ఏంటి, ఆ నిజాన్ని అర్జున్ ఎలా చేధించాడు అనేది మిగిలిన కథ.
 
ఈ సినిమాలో అడివి శేష్ చాలా స్టైలిష్ గా అనిపించాడు. "గూఢచారి" అనే టైటిల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు శేష్. దేశం కోసం ఏదో ఒకటి చేయాలి అనే తపనతో ఉండే యువకుడి పాత్రలో శేష్ అదరగొట్టాడు. అలాగే ఈ సినిమాలో శేష్ తరువాత ముఖ్యంగా మాట్లడుకోవాల్సింది ప్రకాష్ రాజ్ గురించి. ఆయన సినిమాలో కనిపించేది చాలా తక్కువ సార్లు అయిన కూడా కథని ముందుకి నడిపించే పాత్రలో ఒదిగిపోయాడు ప్రకాష్ రాజ్. ఇక అనిష్ కురివిల్ల కూడా ఇది వరకు సినిమాల కంటే కూడా మంచి పాత్రని పోషించాడు. మన తెలుగు హీరోయిన్ అయిన శోబిత కి కూడా కథలో ముఖ్య పాత్రలో నటించే అవకాశం లభించింది. ఇకపోతే ఈ సినిమా తో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన సుప్రియ యార్లగడ్డ తన పెర్ఫార్మన్స్ తో అందరిని మెప్పించింది. ఇన్ని రోజుల తరువాత యాక్టింగ్ చేసిన కూడా ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ తో నటించింది సుప్రియ. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కి కామెడీ ని పండించే రోల్ కంటే కూడా ఒక సీరియస్ రోల్ దక్కింది అని చెప్పొచ్చు.
 
ఇక టెక్నికల్ విషయానికి వస్తే ముందుగా మాట్లడుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి, కెమెరా మెన్ శానియాల్ డియో తన వర్క్ తో మూవీ ని హాలీవుడ్ లెవెల్ కి తీసుకొని వెళ్ళాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఒక సీక్వెన్స్ ని అయితే తన కెమెరా వర్క్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు శానియాల్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల కూడా తన హాంటింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మూవీ ని థ్రిల్లర్ మోడ్ లోకి తీసుకొని వెళ్ళాడు. ఎడిటర్ గ్యారీ కూడా చాలా షార్ప్ కట్స్ తో మూవీ ని చాలా ఫాస్ట్ గా ముందుకి నడిపించాడు. ఇక కథ గురించి మాట్లాడుకుంటే అడివి శేష్ కొంచెం ఓల్డ్ కథనే చాలా కొత్తగా చెప్పే ప్రయత్నం చేసాడు. కథనంలో మాత్రం శేష్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయిన కూడా కొన్ని కొన్ని ట్విస్ట్స్ తో మూవీ ని హాలీవుడ్ రేంజ్ లోకి తీసుకొని వెళ్ళాడు. ఇకపోతే డైరెక్టర్ శశి కిరణ్ తిక్క కూడా శేష్ కథని అర్ధం చేసుకొని తన స్టైల్ లో తను తెరకెక్కించాడు. యాక్షన్ సీన్స్ ని అయితే శశి చాలా బాగా హ్యాండిల్ చేసాడు.
 
మొత్తానికి ఒక ట్విస్ట్ లతో కూడిన థ్రిల్లర్ ఇంకా యాక్షన్ సినిమాని చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే "గూఢచారి" కి వెళ్ళొచ్చు. తెలుగు ప్రేక్షకులకి ఒక హాలీవుడ్ రేంజ్ థ్రిల్లర్ ని అందించడం తో సక్సెస్ అయ్యాడు శేష్. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.