హలో మూవీ రివ్యూ

Breaking News

హోమ్        న్యూస్

Updated:  2018-01-21 12:35:19

హలో మూవీ రివ్యూ

నిర్మాణ సంస్థ‌లు: అన్న‌పూర్ణ స్టూడియోస్‌, మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌

తారాగ‌ణం: అఖిల్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ‌, అనీష్ కురువిల్లా, స‌త్య‌కృష్ణ‌, వెన్నెల‌కిషోర్‌, అజ‌య్, కృష్ణుడు త‌దిత‌రులు

సంగీతం: అనూప్ రూబెన్స్‌

చాయాగ్ర‌హ‌ణం: పి.ఎస్‌.వినోద్‌

కూర్పు: ప‌్ర‌వీణ్ పూడి

నిర్మాత‌: అక్కినేని నాగార్జ‌న‌

ర‌చ‌న‌: విక్ర‌మ్ కుమార్‌, ముకుంద్ పాండే

ద‌ర్శ‌క‌త్వం: విక్ర‌మ్ కె.కుమార్‌

అక్కినేని ఫ్యామిలీలో మూడో వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చారు నాగార్జున చిన్న కుమారుడు అఖిల్.... త‌న పేరుతోనే తొలి సినిమా తీసి ఆశించినంత‌స్ధాయిలో ఆక‌ట్టుకోక‌పోయినా సినిమాలో న‌ట‌న ప‌రంగా మంచి మార్కులు కొట్టేశాడు.. ఇక త‌ర్వాత తీసే సినిమాల‌పై మ‌రింత ఫోక‌స్ పెట్టి.... రెండేళ్ల గ్యాప్ తీసుకున్నాడు అఖిల్.. అక్కినేని ఫ్యామిలీకి మ‌నం సినిమాని అందించిన, డైరెక్ట‌ర్ విక్రమ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా అనౌన్స్ చేయ‌గానే సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. టైటిల్ హ‌లో అని అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండి సినిమా విష‌యంలో నాగార్జున‌, అఖిల్ ఎంతో కేర్ తీసుకున్నారు. దీని వ‌ల్ల సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి.

క‌థ‌!!

శీను !!అఖిల్‌!!అనాథ‌, త‌న‌కి జున్ను అలియాస్ ప్రియ !!కల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌!! అనే చిన్న‌ అమ్మాయి ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం చిగురిస్తుంది. అయితే జున్ను వాళ్ల తండ్రి!! అనీష్ కురువిల్లా!! కి ఢిల్లీ ట్రాన్స్‌ఫ‌ర్ కావ‌డంతో జున్ను ఢిల్లీ వెళ్లిపోతుంది. అలా వెళ్లే స‌మ‌యంలో జున్ను శీను వంద కాగితంపై నెంబ‌ర్ రాసిస్తుంది. ఆ వంద  కాగితం ఎక్క‌డో పోతుంది. ఓ యాక్సిడెంట్ కారణంగా శీను.. ప్ర‌కాష్‌!! జ‌గ‌ప‌తిబాబు!!స‌రోజిని!! ర‌మ్య‌కృష్ణ‌!! ల‌కు ప‌రిచ‌యం అవుతాడు. వారు శీనుకి అవినాష్ అనే పేరు పెడ‌తారు. అవినాష్ పెరిగి పెద్ద‌యినా ప్ర‌తి రోజూ, జున్ను, త‌ను క‌లుసుకున్న జంక్ష‌న్ ద‌గ్గ‌ర‌కు వెళుతుంటాడు. ఓ రోజు అవినాష్‌కి ఓ క్యాబ్ డ్రైవ‌ర్ ఫోన్ చేస్తాడు. క్యాబ్ డ్రైవ‌ర్‌కి ద‌గ్గ‌ర‌లో వయోలిన్ ట్యూన్ విన‌ప‌డుతుంది. అది చిన్న‌ప్పుడు త‌ను జున్నుతో క‌లిసి ప్లే చేసిన ట్యూన్‌ని ప‌సిగ‌ట్టిన అవినాష్ ఆ ఆడ్ర‌స్ క‌నుక్కునే లోపు ఎవ‌రో త‌న ఫోన్ లాక్కుని పారిపోతారు. ఆ ఫోన్ కోసం, అందులోని నంబ‌ర్ కోసం అవినాష్ వారిని వెంబ‌డిస్తాడు. చివ‌రికి ఆ నెంబ‌ర్‌ను శీను అలియాస్ అవినాష్ తెలుసుకున్నాడా? అస‌లు జ‌న్నుని అవినాష్ ఎలా క‌లుసుకున్నాడు? అనే విష‌యాలు తెలియాలంటే వెండి తెర‌పై సినిమా చూడాల్సిందే

!! విశ్లేష‌ణ !!

అఖిల్ చూడ్డానికి చాక్లెట్ బోయ్ లా చురుగ్గా క‌నిపిస్తాడు.. అత‌న్ని చూడ‌గానే హాలీవుడ్ హీరోలా ఉంటాడు అంటారు తెలుగు ఇండ‌స్ట్రీలో.. అత‌నికి ల‌వ్ స్టోరీలు బాగా సెల‌క్ట్ అవుతాయ‌ని అంటున్నారు. ఇక అఖిల్ చేసిన రెండో సినిమా హలో లో ఎంతో బాగా క‌నిపించాడు ...అత‌న్ని చేరదీసిన మంచి జంట‌గా జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ‌, చిన్న‌త‌నాన్ని, స్నేహాన్ని మ‌ర్చిపోని రెండు హృద‌యాలుగా నాయికానాయ‌కులు.. వారిమ‌ధ్య విధి వ‌ల్ల ఏర్ప‌డ్డ‌ పెద్ద గ్యాప్ , కానీ విధి త‌మ‌ను క‌లిపి తీరుతుంద‌నే ఆ ప‌సి మ‌న‌సుల‌ విశ్వాసం ఈ కాన్సెప్ట్ ను బాగా తీశారు ద‌ర్శ‌కుడు. స్క్రీన్ పై అఖిల్ చాలాబాగున్నాడు..ఈ కాలంలో ఒక్క ఫోన్ నెంబర్‌ని ట్రేస్ చేయ‌లేక ఇబ్బందిప‌డే హీరో విష‌యం మాత్రం అంత తేలిగ్గా మింగుడుప‌డ‌దు ప్రేక్ష‌కుల‌కు. ఇలాంటి కొన్ని లాజిక్కుల‌ను ప‌క్క‌న‌పెట్టి, రెండు హృద‌యాలు ప‌డే ఆవేద‌న‌గా చూస్తే సినిమా బావున్న‌ట్టే.

!! ప్లస్ పాయింట్స్ !!

అఖిల్ డ్యాన్సులు, ఫైట్లు

చేజింగ్ స‌న్నివేశాలు బాగున్నాయి.

న‌టి క‌ల్యాణి న‌ట‌న 

ర‌మ్య‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు 

అనూప్  సంగీతం 

!! మైన‌స్ పాయింట్లు !!

కొత్త క‌థ కాక‌పోవ‌డం

హ‌లో సినిమా అఖిల్ కు మ‌రో  కొత్త కెరియ‌ర్ ఇస్తుంది అంటున్నారు వీక్ష‌కులు అభిమానులు. 

రేటింగ్ 3.25 

 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.