ఇంటిలిజెంట్ రివ్యూ

Breaking News

హోమ్        న్యూస్

Updated:  2018-02-09 02:19:49

ఇంటిలిజెంట్ రివ్యూ

నిర్మాణ సంస్థ: సి.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప్రై.లి
తారాగ‌ణం: సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్‌, ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే, రాహుల్‌దేవ్‌, దేవ్‌గిల్‌, వినీత్‌కుమార్‌, జె.పి. పృథ్వీ,కాదంబరి కిరణ్‌, విద్యుల్లేఖా రామన్‌, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, భద్రం త‌దిత‌రులు
కథ, మాటలు: శివ ఆకుల
ఛాయాగ్ర‌హ‌ణం: ఎస్‌.వి. విశ్వేశ్వర్‌
సంగీతం: థమన్‌
కూర్పు: గౌతంరాజు
క‌ళ‌: బ్రహ్మ కడలి
సహనిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా
నిర్మాత: సి.కళ్యాణ్‌
క‌థ‌నం, దర్శకత్వం: వి.వి.వినాయక్‌.
  
!! ఇంట్రో !!
 
మెగా క్యాంప్ నుంచి ఎంద‌రో హీరోలు వ‌చ్చారు... అందులో పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్, సుప్రీమ్ చిత్రాల‌తో వ‌రుస‌గా విజ‌యాలు ద‌క్కించుకున్నాడు మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్... కాని అనుకున్నంత హిట్ టాక్ రాలేదు సాయిధ‌ర‌మ్ తేజ్ చిత్రాల‌కు... తాజాగా వి.వి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో సాయిధ‌రమ్ తేజ్ ఇంటిలిజెంట్ సినిమా చేశారు.. ఓ సారి ఆ సినిమా ఎలా అల‌రించిందో చూద్దాం.
 
 
!! క‌థ !!
 
విజ‌న్ సాఫ్ట్ వేర్ సొల్యూష‌న్స్ అధినేత నంద‌కిషోర్ !! నాజ‌ర్‌!! అనాథ‌ల‌కు, పేద‌వాళ్ల‌కు సాయం చేస్తూ ఉంటాడు. త‌న కంపెనీలో ప‌నిచేసే ఉద్యోగుల‌ను కూడా బాగా చూసుకుంటూ ఉంటాడు. నంద‌కిషోర్ స‌హాయంతో చ‌దువుకుని... ఆయన కంపెనీలోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదిస్తాడు తేజ !! సాయిధ‌ర‌మ్ తేజ్‌!! . త‌న స్నేహితులు !! రాహుల్ రామ‌కృష్ణ‌, స‌ప్త‌గిరి, న‌ల్ల‌వేణు!! ల‌తో క‌లిసి, న‌చ్చిన ఉద్యోగం చేసుకుంటూ ఉండే తేజుకి  జీవితంలోకి !! లావ‌ణ్య త్రిపాఠి !!ఎంట‌ర్ అవుతుంది.... ముందు తేజ అంటే ఇష్ట‌ప‌డ‌క‌పోయినా.. త‌ర్వాత అత‌ను అమ్మాయిల పై చూపే ప్రేమ‌ అత‌నికున్న గౌర‌వాన్ని చూసి అత‌న్ని ఇష్ట‌ప‌డుతుంది. 
 
అదే స‌మ‌యంలో నంద‌కిషోర్ త‌న కంపెనీ ఉద్యోగుల‌కు చేస్తున్న బెనిఫిట్స్ చూసి ప్ర‌త్య‌ర్ధి కంపెనీలు జీర్ణించుకోలేవు.. నంద‌కిషోర్‌ను దెబ్బ కొట్టి.. కంపెనీని సొంతం చేసుకోవాల‌నుకుంటారు ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం. అందులో భాగంగా మాఫియా డాన్ విక్కీ భాయ్ !! రాహుల్ దేవ్‌!!  అత‌ని త‌మ్ముడు !! దేవ్ గిల్ !! ల స‌హాయం తీసుకుంటారు. విక్కీ అండ్ గ్యాంగ్ నంద‌కిషోర్‌ను బెదిరించినా లొంగ‌డు. ఢిల్లీకి వెళ్లి సెంట్ర‌ల్ మినిష్ట‌ర్‌ను క‌ల‌వాల‌నుకుంటాడు. అయితే అనుకోకుండా త‌న కంపెనీ విజ‌న్ సాఫ్ట్‌వేర్ సొల్యూష‌న్స్‌ను విక్కీకి రాసేసి ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు నంద‌కిషోర్‌... అదే స‌మ‌యంలో తేజ‌పై అటాక్ కూడా జ‌రుగుతుంది. అస‌లు నంద కిషోర్ ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు? అస‌లు అది ఆత్మ‌హ‌త్యా? హ‌త్యా? చివ‌ర‌కు త‌న‌కు అండ‌గా నిల‌బ‌డ్డ నంద‌కిషోర్ అండ్ ఫ్యామిలీ కోసం తేజ ఎలాంటి సాహసం చేస్తాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే వెండితెర‌పై చూడాల్సిందే.
 
!! విశ్లేష‌ణ !!
 
ఈ సినిమాలో కూడా తేజ్ త‌న న‌ట‌న‌తో అల‌రించాడు.. సాయిధ‌ర‌మ్ తేజ్ న‌ట‌న‌తో సినిమాలో గ‌తంలో త‌న సినిమాల్లో ఎలా ఎన‌ర్జిటిక్ గా న‌టించాడో ఈ చిత్రంలో కూడా అల‌రిచాడు సాయిధ‌ర‌మ్ తేజ్..  కేవ‌లం హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠిని అందం కోసం గ్లామ‌ర్ కోస‌మే తీసుకున్నారు అని అనిపిస్తుంది.. ఇక గ‌త సినిమాలలో కామెడీకి పెద్ద పీట వేయాలి అని అనుకున్నారు అలాగే ఈ సినిమాలో కూడా భావించారు ద‌ర్శ‌కుడు వినాయ‌క్.
 
ఇక ప్ర‌తినాయ‌కుడి పాత్ర సినిమాకు మరింత ప్ల‌స్ అయింది....కాశీ విశ్వ‌నాథ్‌, బ్ర‌హ్మానందం, షాయాజీ షిండే త‌దిరులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.. అలాగే పోసాని కృష్ణ‌ముర‌ళి అత‌ని స్నేహితుల మ‌ధ్య వ‌చ్చే కామెడీ ట్రాక్ బాగా సాగింది....సెకండాఫ్‌లో హీరో త‌న చేసే ప‌నిలో భాగంగా క్రియేట్ చేసే ధ‌ర్మాభాయ్ పాత్ర సినిమాలో అంచ‌నాల‌ను పెంచింది.. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి... ద‌ర్శ‌కుడు వినాయ‌క్ కొత్త‌గా చూపించాలి అని అనుకున్నారు ఈ స్టోరీలో. సాయిధ‌ర‌మ్ తేజ్ న‌ట‌న‌కు ద‌ర్శ‌క‌త్వానికి మెగా అభిమానులు మ‌రోసారి ఫిదా అవుతారు.
 
 
!! బ‌లాలు !!
డాన్సులు
సినిమాటోగ్ర‌ఫీ
నిర్మాణ విలువ‌లు
కామెడీ 
 
!! బల‌హీన‌త‌లు!!
లాజిక్స్ లేక‌పోవ‌డం
సంగీతం, 
 
రేటింగ్ 2.75

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.