జై సింహా రివ్యూ

Breaking News

హోమ్        న్యూస్

Updated:  2018-01-21 12:08:46

జై సింహా రివ్యూ

టైటిల్ : జై సింహా

జానర్ : ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

తారాగణం : నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా దోషి, హరిప్రియ, ప్రకాష్‌ రాజ్, అశుతోష్ రాణా

సంగీతం : చిరంతన్‌ భట్‌

దర్శకత్వం : కేయస్‌ రవికుమార్‌

నిర్మాత : సి. కళ్యాణ్‌

 

 

సంక్రాంతి బ‌రిలో ఎదురులేని స్టార్ గా నిలుస్తారు నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య‌....ఆయ‌న సినిమాలు అంటే చెవి కోసుకుంటారు  బాల‌య్య అభిమానులు..సంక్రాంతి బ‌రిలో నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య ఈ సారి జై సింహ‌తో మ‌న ముందుకు వ‌చ్చారు..  తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార, నటాషా దోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటించారు.. మ‌రి ఈ చిత్రం ఎలా అల‌రించిందో  ఓ లుక్కేంద్దాం.

 

కథ 

    నరసింహం బాలకృష్ణ  ఏడాది వయసున్న కొడుకుతో బతుకుతెరువు కోసం తమిళనాడులోని కుంభకోణం చేరుకుంటాడు. అక్కడ ఓ గుడి ధర‍్మకర్త మురళీ కృష్ణ మురళీమోహన్  ఇంట్లో డ్రైవర్‌గా పనిలోచేరతాడు. అక్కడి లోకల్ రౌడీ కనియప్పన్‌ (కాళకేయ ప్రభాకర్) తమ్ముడికి మురళీ కృష్ణ కూతురు కారణంగా యాక్సిడెంట్ అవుతుంది. మురళీ కృష్ణ కోసం ఆ నేరాన్ని తన మీద వేసుకొని కనియప్పన్ చేతిలో దెబ్బలో తింటాడు నరసింహం. అదే సమయంలో కొత్తగా వచ్చిన ఏసీపీతోనూ నరసింహానికి గొడవ అవుతుంది. ఈ గొడవల్లో తన కొడుకుకు ఏమన్నా అవుతుందన్న భయంతో ఊరొదిలి వెళ్లిపోవాలనుకుంటాడు. కానీ అదే సమయంలో తన కొడుకు లాగే ఉండే మరో అబ్బాయిని కనియప్పన్ మనుషులు కిడ్నాప్ చేయటంతో తన కొడుకే అనుకొని ఆ అబ్బాయి కాపాడతాడు. అసలు కనియప్పన్ మనుషులు కిడ్నాప్ చేసిన బాబు ఎవరు..? ఆ బాబు నరసింహం కొడుకులాగే ఎందుకు ఉన్నాడు..? నరసింహం భార్య ఏమైంది..? కొత్తగా వచ్చిన ఏసీపీకి నరసింహానికి సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ. ఇక స‌స్పెన్స్ తెలియాలి అంటే వెండితెర‌పై చూడాల్సిందే.. 

 

!! విశ్లేషణ !! 

ఈ సినిమాలో పాత్ర‌లు అద్బుతంగా ఉన్నాయి అలాగే క‌థ‌కు త‌గ్గ‌ట్లు సినిమాలో పాత్ర‌ల ఎంపిక బాగుంది..బాల‌య్య ఎప్ప‌టిలాగా త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఇక డైలాగ్ డెలివ‌రీ బాల‌య్యకు మ‌రింత ఈ సినిమాలో ఆక‌ట్టుకున్నాడు ..

ద‌ర్శ‌కుడు కేయ‌స్ ర‌వికుమార్ బాల‌య్యకు త‌గిన విధంగా క‌థ‌ను అద్బుతంగా తెర‌కెక్కించారు ఈ విధానం బాగుంది..

 బాల‌య్య జై సింహా  సినిమాలో త‌న మార్క్ న‌ట‌న చూపించారు. ద‌ర్శ‌కుడు..ఎం.రత్నం డైలాగ్స్ సినిమాకు ప్లస్ పాయింట్, చిరంతన్ భట్ సంగీతం బాగుంది..నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. బాల‌య్య‌కు మ‌ళ్లీ ఈ ఏడాది హిట్ అందుకుంది అని చెప్పాలి.

 

 

!! ప్లస్ !!

బాల‌య్య న‌ట‌న ప్ల‌స్ 

ఎమోష‌న‌ల్ సీన్స్ 

బాల‌య్య డైలాగ్స్ 

  

!!  మైన‌స్  !!

క‌థ‌నం నెమ్మ‌దించ‌డం 

పాటలు

 

మొత్తానికి జై సింహాకు జ‌నం జేజేలు ప‌లుకుతున్నారు.

 

రేటింగ్ 2.75

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.