లవర్ మూవీ రివ్యూ

Breaking News

హోమ్        న్యూస్

lover movie review
Updated:  2018-07-20 12:54:26

లవర్ మూవీ రివ్యూ

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కి షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎంట్రీ కి వరుస హిట్స్ అందుకొని హీరో లా నిరూపించుకున్న రాజ్ తరుణ్ కి గత కొంత కాలంగా హిట్స్. ఈ ఏడాది మొదట్లో రాజ్ తరుణ్ హీరో గా చేసిన "రాజుగాడు" కూడా ఫ్లాప్ గా నిలిచింది. అయితే ఇలాంటి టైం లో దిల్ రాజు రాజ్ తరుణ్ తో సినిమా చేయడానికి ముందుకి వచ్చాడు. "అలా ఎలా" ఫేం అయిన అనీష్ కృష్ణ డైరెక్ట్ చేసిన "లవర్" తో రాజు తరుణ్ దిల్ రాజు కాంపౌండ్ లో హిట్టు కొడతాడు అని అందరూ అనుకుంటున్నారు. మరి ఈ "లవర్" ప్రేక్షకుల అంచనాల్ని అందుకుందో లేదో మనం ఇప్పుడు రివ్యూ లో చూద్దాం.
 
ముందుగా కథ విషయంలోకి వెళ్తే రాజ్ (రాజ్ తరుణ్) ఎవడో తయారు చేసిన బైక్ నడపడం ఇష్టం లేక తనే సొంతంగా ఒక బైక్ ని తయారు చేసుకొని బైక్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఇంతనికి ఒక అన్నయ్య పేరు జగ్గు (రాజీవ్ కనకాల). జగ్గు సంపత్ (సుబ్బరాజ్) దగ్గర రౌడీ దందా చేస్తూ ఉంటాడు.ఒకానొక సమయంలో రాజ్ కి ఒక చిన్న ఆక్సిడెంట్ అవుతుంది. అందుకోసం ఒక హాస్పిటల్ లో అడ్మిట్ అవుతాడు రాజ్. అక్కడ నర్స్ గా పనిచేస్తున్న చరిత (రిద్ది కుమార్) అనే అమ్మాయిని చూసి మొదటి చూపులనే లవ్ చేస్తాడు రాజ్. అయితే మొదట్లో రాజ్ ప్రేమకి నో చెప్పిన చరిత తరువాత రాజ్ చేసిన ఒక మంచి పని వాళ్ళ రాజ్ ప్రేమలో పడుతుంది. కానీ చరిత లైఫ్ కి ఒక డేంజర్ ఉంటుంది. ఆ విషయాన్నీ తెలుసుకున్న రాజ్ అన్నయ్య జగ్గు చరిత ని కాపాడే ప్రయత్నం చేసి చనిపోతాడు. అసలు చరితని రాజ్ అన్నయ్య కి సంభందం ఏంటి ? చరిత ని ఎందుకు చంపాలి అనుకుంటున్నారు? ఆ ప్రాబ్లం నుంచి రాజ్ చరిత ని ఎలా బయట పడేసాడు అనేదే మిగిలిన కథ.
 
ఇక నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఎప్పటి లాగే చాలా రొటీన్ గా చేసాడు అనిపించింది. రాజ్ తరుణ్ నటన విషయంలో ఇంకాస్త పరిణితి సాధించాలి అనిపిస్తుంది. కాకపొతే కమర్షియల్ సినిమాలు అస్సలు సెట్ కాని రాజ్ తరుణ్ ఇలాంటి పూర్తి స్థాయి కమర్షియల్ కథని ఎలా ఓకే చేసాడో మరి. ఇక హీరోయిన్ రిద్ది కుమార్ గ్లామరస్ గా కాకుండా తన నటనతో పర్వాలేదు అనిపించింది. మెయిన్ లీడ్స్ క్నతే కూడా రాజీవ్ కనకాల చాలా బాగా నటించాడు. అసలు చాలా కాలం తరువాత రాజీవ్ కనకాల కి మంచి పాత్ర లభించింది. హీరోయిన్ కాపాడే సీక్వెన్స్ లో అయితే రాజీవ్ కనకాల జీవించేసాడు అని చెప్పొచ్చు. ఇక సుబ్బ రాజ్ ఉన్నది కాసేపే అయిన గాని బానే నడిపించాడు. ఇక పేరుకి అజయ్ ఇంకా సచిన్ కేడేకర్ ఈ సినిమాలో విలన్ అని చెప్పుకున్నప్పటికి వాళ్ళు తన నటనని ప్రదర్శించే సన్నివేశాలు ఎక్కడ లేవు. ఇక హీరోయిన్ తల్లి పాత్రలో రోహిణి తనకి అలవాటు అయిన పాత్రలోనే నటించింది.
 
ఇకపోతే టెక్నీషియన్స్...స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు ఈ సినిమా చాలా గ్రాండ్ గానే తెరకెక్కించాడు. చిన్న అని చెప్పి ఏ మాత్రం బడ్జెట్ తక్కువ చెయ్యకుండా ఒక కమర్షియల్ సినిమాకి ఉండాల్సిన అన్ని హంగులు టీం కి సమకూర్చాడు దిల్ రాజు. ఇకపోతే సమీర్ రెడ్డి తన కెమెరా వర్క్ తో మూవీ ని బాగా హ్యాండిల్ చేసాడు, ముఖ్యంగా కేరళలోని కొన్ని సీక్వెన్స్ ని బాగా షూట్ చేసాడు సమీర్ రెడ్డి. ఇక ఈ సినిమాకి నలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నాగాని పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. ఇక "అలా ఎలా" అనే కామెడీ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన అనీష్ కృష్ణ ఈ సినిమా కథని మాత్రం మంచి కమర్షియల్ గా రాసుకున్నాడు. కథ రొటీన్ గానే ఉన్న కథనంతో అనీష్ కృష్ణ నేగ్గుకోస్తాడు అనుకుంటే కథనం దగ్గర కూడా వెనకబడ్డాడు అనీష్.
 
మొత్తంగా చూసుకుంటే ఒక చిన్న హీరో పక్క కమర్షియల్ సబ్జెక్ట్ తో ఒక సినిమా తీస్తే అదే "లవర్". రొటీన్ కథతో పసలేని కథనం తో ఆడియన్స్ ని లవర్స్ గా మార్చుకొలేకపోయాడు ఈ "లవర్".
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.