మహానటి రివ్యూ

Breaking News

హోమ్        న్యూస్

mahanati movie review
Updated:  2018-05-09 03:33:29

మహానటి రివ్యూ

జానర్ : బయోపిక్‌
తారాగణం : కీర్తీ సురేష్‌, దుల్కర్‌ సల్మాన్‌, సమంత, విజయ్‌ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్
సంగీతం : మిక్కీ జే మేయర్‌
దర్శకత్వం : నాగ్‌ అశ్విన్‌
నిర్మాత : అశ్వనీదత్‌, ప్రియాంక దత్‌, స్వప్నాదత్‌
 
!! ఇంట్రో!!
హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అని చెప్పిన న‌టి సావిత్రి.. న‌ట‌న‌లో మ‌రో కొత్త  ఒర‌వ‌డికి ఇప్ప‌టికి చూపించాలి అంటే ఆమెనే ఫాలో అవుతారు న‌టీమ‌ణులు... అంత పేరు తెచ్చుకుంది మ‌హానటి సావిత్రి.. నిజ‌మే పేరులోనే కాదు  ఆమె నిజంగా మ‌హాన‌టే అని చెప్పాలి.. శిఖ‌రాలు చూసిన ఆమె చివ‌రి రోజుల్లో ఎవ‌రూ ప‌డ‌ని క‌ష్టాలు ప‌డ్డారు..అయితే ఆమె జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఆమె చివ‌రి మ‌జిలీలో ఏమి జ‌రిగింది అనేది చాలా మంది తెలుసుకోవాలి అని కోరిక అభిలాష ఉంటుంది... ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మ‌హాన‌టి సినిమా అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుంది. అనేది ఓసారి చూద్దాం?
 
!! కథ!!
మహానటి పూర్తిగా సావిత్రి కథ. ఆమె జీవితంపై ఎంతో పరిశోధ‌న చేసి ఈ కథను తయారు చేశారు. సినీ అభిమానులకు సావిత్రి తెర మీదకు వచ్చిన దగ్గరనుంచే తెలుసు కానీ ఆమె గతాన్ని కూడా ఈ సినిమాతో పరిచయం చేశారు. సావిత్రి  కీర్తి సురేష్‌.. తనకు ఆర‍్నేళ్లు ఉన్నప్పుడే తండ్రి చనిపోవటంతో పెదనాన్న కే వెంకట రామయ్య చౌదరి రాజేంద్ర ప్రసాద్ సంరక్షణలో పెరుగుతుంది. చిన్నతనం నుంచి ఈ పని నీ వల్ల కాదు అంటే ఎలాగైనా పట్టు పట్టి ఆ పని చేసి చూపించటం సావిత్రికి అలవాటు. అందుకే తనకు రాదు అన్న నాట్యం దూరం నుంచి చూసి నేర్చుకుంటుంది.
 
సావిత్రి లోని ప్రతిభను గుర్తించి నాటకాలు వేసేందుకు అరుణోదయ నాట్యమండలిలో బాలనటిగా అవకాశం ఇస్తారు. నాటకాలకు ఆదరణ తగ్గిపోవటంతో సావిత్రిని సినిమాల్లో నటింప చేయాలని నిర్ణయించుకుంటాడు ఆమె పెదనాన్న. ఆ ప్రయత్నాల్లో భాగంగా 14 ఏళ్ల వయసులో సావిత్రి చెన్నై చేరుకుంటారు. ఆమెకు తమిళ్‌ రాకపోవటంతో అక్కడ ఇబ్బంది పడుతుంటే.. జెమినీ గణేషణ్  దుల్కర్‌ సల్మాన్ .. సావిత్రి అందం చూసి ఎప్పటికైన పెద్ద నటి అవుతుందని చెప్పి ఆ ఫోటోలు తీసి పత్రికల వారికి ఇస్తారు.
 
అలా పత్రికల్లో వచ్చిన సావిత్రి ఫోటోలు చూసిన ఎల్‌వి ప్రసాద్‌ తన సినిమాలో నాగేశ్వరరావు సరసన హీరోయిన్‌గా తొలి అవకాశం ఇస్తారు. కానీ ఆ అవకాశం సావిత్రి చేజారిపోతుంది. తరువాత అదే ఎల్వీ ప్రసాద్‌ దర్శకత్వంలో తెరకెక్కి పెళ్లి చేసి చూడు సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంటారు సావిత్రి. అలా వెండితెర మీదకు అడుగుపెట్టిన సావిత్రి ఎలా మహానటిగా ఎదిగారు. జెమినీ గణేషణ్ ఆమె జీవితంలోకి ఎలా ప్రవేశించారు. పెళ్లి తరువాత సావిత్రి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. కోట్ల ఆస్తులు సంపాదించిన సావిత్రి చివరకు అన్ని పోగొట్టుకోవడానికి కారణమేంటి..? అన్నదే మిగతా కథ. ఇది వెండితెర‌పై చూడాలి.
 
!! విశ్లేష‌ణ !!
సినిమాలో సావిత్రి పాత్ర చేసిన కీర్తిసురేష్ న‌ట‌న అద్బుతం కీర్తి క‌ళ్ల‌ముందు సావిత్రిని చూపించింది అనాలి...సినిమాకు ప్రధాన బలం కీర్తీ సురేష్‌.  ఆమె సావిత్రి పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసింది అనాల్సిందే. సావిత్రి చిన్న‌త‌నం నుంచి ఉన్న విధానం పెరిగిన ప‌ద్ద‌తి ఆమె ఎదిగిన త‌ర్వాత సినిమాల ప్ర‌వేశం ఒడిదుడుకులు ఎలా ఎదుర్కుంది అనేది అద్బుతంగా చూపించారు.సావిత్రి భర్త జెమినీ గణేష్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ ఒదిగిపోయారు. జర్నలిస్ట్‌ మధురవాణిగా సావిత్రి జీవితం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించే పాత్రలో సమంత జీవించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌ సీన్స్‌లో సమంత నటన కంటతడి పెట్టిస్తుంది.
 
న‌ట‌న‌తో అల‌రించే విజ‌య్ దేవ‌ర‌కొండ ఫోటో గ్రాఫ‌ర్ గా అద‌ర‌గొట్టారు అనే చెప్పాలి... కథలో పెద్దగా కీలకమైన పాత్ర కాకపోయినా సమంత, విజయ్‌ల మధ్యే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి..అక్కినేని నాగేశ్వరరావుగా నాగచైతన్య, కేవీ చౌదరిగా రాజేంద్ర ప్రసాద్‌, ఎస్వీఆర్‌గా మోహన్‌ బాబు, చక్రపాణి పాత్రలో ప్రకాష్‌ రాజ్‌, కేవీరెడ్డిగా క్రిష్‌, సింగీతం శ్రీనివాస్‌గా తరుణ్‌ భాస్కర్‌, ఎల్‌వీ ప్రసాద్‌గా అవసరాల శ్రీనివాస్‌ ఇలా ప్రతీఒక్కరు అలనాటి మహానుభావులను తెర మీద చూపించేందుకు తమవంతు సాయం చేశారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ విష‌యంలో ద‌ర్శ‌కుడు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ముఖ్యంగా నాగ్ అశ్విన్ ప్రతీ ఫ్రేమ్‌లో సావిత్రి కథను ఈ తరానికి పరిచయం చేయాలన్న తపనతో అద్బుతంగా తెర‌కెక్కించాలి అని ఆయ‌న ప్ర‌య‌త్నించారు... అందులో స‌క్సెస్ అయ్యారు అనే చెప్పాలి.
 
అల‌నాటి స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించ‌డంలో క‌ధ‌ను తెర‌కెక్కించ‌డంలో  దర్శ‌కుడు అద్బుతంగా  చేశారు అని చెప్పాలి.సినిమాకు మరో మేజర్‌ ప్లస్‌ పాయింట్ మిక్కీ జే మేయర్‌ అందించిన సంగీతం. ప‍్రతీ పాట కథలో భాగంగా వస్తూ ప్రేక్షకుణ్ని మరింతగా కథలో లీనమయ్యేలా చేస్తుంది. నేపథ్య సంగీతం కూడా సినిమా స్థాయిని పెంచింది. నిజమే అల‌నాటి చిత్రాల‌కు మైన‌స్ లు ప్ల‌స్ లు ఉండ‌వు ...  ప్ర‌తీ ఫ్రేమ్ అద్బుతం ప్ర‌తీ స‌న్నివేశం ఓ చ‌రిత్ర‌ను చూపుతుంది మొత్తానికి మ‌హాన‌టి ఓ సినిమా కాదు ఓ చ‌రిత్ర. 
 
రేటింగ్ 3.25

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.