మను తెలుగు సినిమా రివ్యూ

Breaking News

హోమ్        న్యూస్

manu review
Updated:  2018-09-07 10:55:35

మను తెలుగు సినిమా రివ్యూ

సాధారణంగా స్టార్ హీరోలు నటించే సినిమాలకి మన ఇండస్ట్రీ లో ఎక్కువ హైప్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళ సినిమా యొక్క ట్రైలర్ గాని బాగా లేకుంటే వాళ్ళ సినిమాకి కూడా హైప్ ఉండదు, అలాంటిది చిన్న సినిమాకి అయితే ట్రైలర్ బాగున్నా కూడా హైప్ ఉండదు. కానీ ఒక చిన్న సినిమా మాత్రం రిలీజ్ కి ముందే భారీ అంచనాల్ని క్రియేట్ చేసుకుంది. ఆ సినిమా పేరే "మను". ఈ సినిమా కి ప్రేక్షకుల్లో అంచనాలు పెరగడానికి ఫణింద్ర నరిశెట్టి అనే పేరు మాత్రమే కారణం. "బ్యాక్ స్పేస్" "మధురం" అనే షార్ట్ ఫిలిమ్స్ ని డైరెక్ట్ చేసి ఆకట్టుకున్న ఫణింద్ర నరిశెట్టి ఈ సినిమా ద్వార దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పైగా ఈ సినిమాని జనాలు అంతా కలిసి నిర్మించారు. రాజా గౌతం, చాందిని చౌదరి జంటగా నటించిన ఈ సినిమా మరి ప్రేక్షకుల అంచనాల్ని అందుకుందో లేదో చూద్దాం.
 
ముందుగా కథలోకి వెళ్తే మను (రాజా గౌతం) ఒక ఆర్టిస్ట్, తనకి నల్ల రంగు అంటే ఇష్టం పైగా గొప్ప పెయింటర్. అలాంటి మను యొక్క వర్క్స్ నచ్చి మను ప్రేమలో పడిపోతుంది నీలా (చాందిని చౌదరి". నీలా కూడా మంచి క్రియేటివిటీ ఉన్న వ్యక్తీ. ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం తనకి. ఇలా వీళ్ళిద్దరి ఒకళ్ళని ఒకళ్ళు ఇష్ట పడతారు. కానీ అనుకోకుండా వీళ్ళ జీవితాలు అనుకోని మలుపు తిరుగుతాయి. అలాంటి సమయం లో వీళ్ళు ఏం చేసారు, వాళ్ళ ప్రేమని ఎలా శాశ్వతం చేసుకున్నారు అనేది మిగిలిన కథ.
 
నటీనటుల విషయానికి వెళ్తే స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతం ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఇండస్ట్రీ కి రాజా గౌతం వచ్చి చాలా ఏళ్ళు అయ్యింది, కానీ ఇప్పటి వరకు రాజా గౌతం నటించిన ఏ ఒక్క సినిమాకి కూడా ఈ రేంజ్ లో హైప్ రాలేదు. నటుడిగా రాజా గౌతం ఈ సినిమాతో చాలా మెరుగయ్యాడు. ముఖ్యంగా తన లుక్ విషయం లో మంచి శ్రద్ధ వహించాడు. అలాగే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చాందిని చౌదరి కూడా మంచి నటనతో ఆకట్టుకుంది. చాందిని చౌదరి డైలాగ్ డెలివరీ బాగుంది. ఇకపోతే చిల్లర రౌడీలు గా జాన్ ఇంకా మోహన్ భగత్ పర్వాలేదు అనిపించారు. వీళ్ళకు మించి సినిమాలో చెప్పుకోదగ్గ తారంగానం ఏమి లేదు.
 
టెక్నికల్ విషయాలకి వెళ్తే....ముందుగా ఈ సినిమా యొక్క నిర్మాతల గురించి మాట్లాడుకోవాలి సాధారణంగా ఏ సినిమాకి అయిన ఒక్కరు లేదా ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉంటారు, కానీ ఈ సినిమాకి మాత్రం 115 మంది నిర్మాతలు. అవును ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు అందరూ జనాలే. దీన్నే క్రౌడ్ ఫండింగ్ అంటారు. తెలుగు లో ఇప్పటికి వరకు పలు క్రౌడ్ ఫండింగ్ సినిమాలు వచ్చినా కూడా ఈ సినిమా మాత్రం కేవలమ నాలుగు రోజుల్లోనే కోటి రూపాయల ఫండ్స్ తెచ్చుకోగలిగింది. ఈ విషయం లో మాత్రం మనం "మను" టీం ని మెచ్చుకోవాల్సిందే. ఇకపోతే సినిమా కథ విషయానికి వద్దాం, మనకి ఈ సినిమా కథ అర్ధం అవ్వాలి అంటే ముందుగా ఈ సినిమా కథనం తెలియాలి. డైరెక్టర్ ఫణింద్ర నరిశెట్టి ఈ సినిమా కథనం ని చాలా తెలివిగా రాసాను అనుకున్నాడు,  కానీ అన్ని చోట్ల అది వర్క్ అవుట్ అవ్వకపోగా ప్రేక్షకులకి చిరాకు తెప్పిస్తుంది. అలాగే సినిమాలో మొదట్లో వచ్చే డైలాగ్స్ పర్వాలేదు అనిపించిన కూడా ఆ తరువాత కూడా అవే తరహాలో మాటలు రావడం కథనం ని స్లో చేసింది. కానీ ఈ సినిమా ద్వారా మనకి తెలియని కొన్ని విషయాలని ఈ కథ ద్వారా తెలియజేసాడు ఫణింద్ర నరిశెట్టి. కథకుడిగా కొంచెం తడబడ్డా ఫణింద్ర నరిశెట్టి ఎడిటర్ మాత్రం సినిమాని బాగా కట్ చేసాడు. ఇక విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ కొన్ని చోట్ల బాగున్నా కూడా మరికొన్ని చోట్ల కంటికి ఇబ్బందిగా అనిపిస్తుంది. 
 
మొత్తంగా చూసుకుంటే "మను" అనేది మనసు పెట్టి కానుంద కొంచెం బుర్ర పెట్టి చూస్తే అర్ధం అయ్యే అవకాశం ఉంది. కానీ బుర్ర పెట్టి ఆలోచిస్తున్న కూడా ఆ కథనం మన బుర్రని మరి తికమకపెట్టి చికాకు వచ్చేలా చేస్తుంది. 
 
రేటింగ్:- 2/5
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.