మిడిల్ క్లాస్ అబ్బాయి మూవీ రివ్యూ

Breaking News

హోమ్        న్యూస్

Updated:  2018-01-21 12:33:20

మిడిల్ క్లాస్ అబ్బాయి మూవీ రివ్యూ

నిర్మాణ సంస్థ: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌

తారాగ‌ణం: నాని, సాయిప‌ల్ల‌వి, భూమిక‌, విజ‌య్‌, సీనియ‌ర్ న‌రేష్‌, ఆమ‌ని త‌దిత‌రులు

మాట‌లు: మామిడాల తిరుప‌తి, శ్రీకాంత్ విస్సా

ఎడిట‌ర్‌: ప్రవీణ్ పూడి

క‌ళ: రామాంజ‌నేయులు

సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌

చాయాగ్ర‌హ‌ణం: స‌మీర్‌రెడ్డి

నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్‌, ల‌క్ష్మ‌ణ్‌

క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: శ్రీరామ్ వేణు

 

 

టాలీవుడ్ లో వ‌రుస‌గా ఏడు హిట్ మూవీస్ త‌న ఖాతాలో వేసుకున్నాడు నేచుర‌ల్ స్టార్ నాని.. త‌న సినిమా సెల‌క్ష‌న్ అటువంటిది అంటాడు నాని.... హీరో నాని కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ‌, అందుకే నాని సినిమా అంటే ప‌డిచ‌స్తారు ఆయ‌న అభిమానులు. ఇక వ‌రుస సక్సెస్ సినిమాలు నిర్మిస్తూ త‌న కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నిర్మాత దిల్ రాజు.. 2017 లో ఐదు హిట్ చిత్రాలు నిర్మించారు దిల్ రాజు.. తాజాగా ఎంసీఏతో నాని- దిల్ రాజు - సాయిప‌ల్ల‌వి కొత్త హిట్ మూట‌గ‌ట్టుకున్నారో లేదో చూద్దాం.

 

 

 

కథ:

చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో !!నాని!! ని పెంచి పెద్ద చేస్తాడు అతని అన్నయ్య!! రాజీవ్‌ కనకాల!! ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంటుంది. అన్నయ్యకు జ్యోతి!! భూమిక!!అనే అమ్మాయితో పెళ్లవుతుంది. జ్యోతి రాకతో అన్నయ్య దగ్గర తనకు ప్రాధాన్యత తగ్గుతుందని, అందుకు కారణం తన వదినే అని నాని అనుకుంటాడు. అందుకని హైదరాబాద్‌లోని తన పిన్ని వాళ్లింట్లో కొన్ని రోజులు ఉంటాడు. అదే సమయంలో ఆర్‌.టి.ఒ ఆఫీసర్‌ అయిన జ్యోతికి వరంగల్‌కు ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. అన్నయ్య ఢిల్లీలో ట్రైనింగ్‌కు వెళ్లడంతో..అన్నయ్య కోసం వదినతో పాటు వరంగల్‌ చేరుకుంటాడు నాని. అక్కడే  !!సాయి పల్లవి!! ని చూసి ఆమెతో ప్రేమలో పడతాడు.... కథ ఇలా సాగే క్రమంలో వరంగల్‌లో శివశక్తి ట్రావెల్స్‌ అధినేత శివ బస్సులన్నీ ఆక్రమంగా నడుస్తున్నాయని జ్యోతి సీజ్‌ చేస్తుంది.

 

ఇక ఆ గ్యాంగ్  జ్యోతిపై కక్ష కడ‌తారు, అతని మనుషులు ఆమెను చంపే ప్రయత్నం చేస్తుంటారు. అదే సమయంలో వదిన మంచితనం తెలుసుకున్న నాని..ఆమెను కాపాడుకుంటాడు. అయితే జ్యోతిని పదిరోజుల్లో చంపేస్తానని..అలా చంపకుంటే ఆమెను ఏమీ చేయకుండా వదిలేస్తానని నాని దగ్గర చాలెంజ్‌ చేస్తాడు శివ. అలాగే ఈ పదిరోజులు తన వదినను కాపాడుకుంటానని శివ దగ్గర చాలెంజ్‌ చేస్తాడు నాని.. చివ‌ర‌కు చాలెంజ్ గెలిచేదెవ‌రు - ఓడెదెవ‌రు అలాగే సాయిప‌ల్ల‌వి నాని ఒక‌ట‌వుతారా లేదా అనేది వెండితెర‌పై చూడాలి.

 

 

విశ్లేష‌ణ‌!!

 

క‌థ బాగుంది.. నాలుగు పాత్ర‌ల చుట్టూ న‌డుస్తుంది ఈ చిత్రం.. ఇక నాని ఫెర్ఫామెన్స్ అమోఘం అనే చెప్పాలి.. చిత్రంలో నాని ప్ర‌తీ ఫ్రేమ్ అద్బుతంగా ఉంది.. ఈ సినిమాలో నాని డ్యాన్స్ లు ఇర‌గ‌దీశాడు అనే చెప్ప‌వ‌చ్చు..ముఖ్యంగా ఇంటర్వెల్‌ ఫైట్‌ సీన్‌కు ముందు వదిన మంచి తనాన్ని అర్థం చేసుకునే సన్నివేశంలో..అలాగే చివరి పదిహేను నిమిషాలు వదినను కాపాడుకునే సన్నివేశంలో నాని నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది... ఇక భూమిక పాత్ర కూడా బాగా ఇచ్చారు ద‌ర్శ‌కుడు, ఆమె పాత్ర‌కు న్యాయం చేసింది...సాయిపల్లవి, నాని దగ్గర లవ్‌ ప్రపోజ్‌ చేసే సీన్‌తో పాటు, నానిని అతని ఇంట్లోనే ఉండి టీజ్‌ చేసే సీన్‌ ఇలా అన్నింటా నటనతో తనదైన ముద్ర వేసింది సాయిపల్లవి... ఇక సీనియర్‌ నరేష్‌, ఆమని, రాజీవ్‌ కనకాల, నాని స్నేహితులుగా నటించిన ప్రియదర్శి, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాలో కామెడీ చాలా బాగుంది ప‌డీ ప‌డీ న‌వ్వుకునేలా ఉన్నాయి స‌న్నివేశాలు.. మొత్తానికి మ‌రో హిట్ నాని వేసుకున్నాడు అంటున్నారు అభిమానులు.

 

 

బ‌లాలు:

నటీనటులు ఎంపిక న‌ట‌న‌

కుటుంబాల మ‌ధ్య అనుబంధాలు 

కామెడీ

సినిమాటోగ్రఫీ

 

బలహీనతలు:

కొత్త కథేం కాదు

సంగీతం

 

మిడిల్ క్లాస్, మాస్, హైక్లాస్ అంద‌రిని ఆక‌ట్టుకునేలా ఉంది ఈ చిత్రం 

 

రేటింగ్   3.25 

 

 

 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.