Updated: 2018-03-23 03:04:00
ఎంఎల్ఎ రివ్యూ
మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి
నటీనటులు: కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్, రవి కిషన్, 30 ఇయర్స్ పృథ్వీ, మనాలీ రాథోడ్
సంగీతం : మణిశర్మ
దర్శకత్వం : ఉపేంద్ర మాధవ్
నిర్మాత : కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, టీజీ విశ్వ ప్రసాద్
నందమూరి కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ బ్యానర్ తో పాటు సినిమాలు నిర్మిస్తూ తాను కూడా హీరోగా తన మార్క్ చూపుతున్నాడు అప్పట్లో లక్ష్మీ కళ్యాణం సినిమాలో కాజల్ తో సినిమా చేశాడు కల్యాణ్ రామ్ ఇప్పుడు కాజల్ టాప్ హీరోయిన్ గా మెరుస్తోంది సినీ ఇండస్ట్రీలో ఇక తాజాగా పటాస్ తర్వాత మరో హిట్ కోసం ఎదురుచూస్తున్న కల్యాణ్ రామ్ ఎంఎల్ఎ సినిమాతో ఈరోజు మన ముందుకు వచ్చాడు... ఉపేంద్రమాధవ్ కథ ఎలా ఉంది? కల్యాణ్ రామ్ నటన ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం?
కథ :
గాడప్ప !! రవికిషన్ !! అనంతపురం జిల్లా వీరభద్రపురం నియోజకవర్గానికి ఎంఎల్ఎ... ఆప్రాంతంలో తరతరాలుగా గాడప్ప వంశం వాళ్లే అక్కడ ఎంఎల్ఎగా ఎన్నిక అవుతూ వస్తుంటారు. గాడప్పపై ఒక్కసారైన విజయం సాధించాలన్న కసితో నాగప్ప(జయ ప్రకాష్ రెడ్డి) గాడప్ప మీద ఎన్నికల్లో తలపడుతూనే ఉంటాడు. ఇక మన హీరో కళ్యాణ్ (కళ్యాణ్ రామ్) మంచి లక్షణాలున్న అబ్బాయ్. చెల్లెలు(లాస్య) ప్రేమించిన అబ్బాయికి వేరే పెళ్లి జరుగుతుంటే పెళ్లి పీటల మీదనుంచి లేపుకొచ్చి మరీ చెల్లెలికిచ్చి పెళ్లి చేస్తాడు. దీంతో ఇంట్లో వారికి దూరం అవుతాడు.
ఇంట్లో ఎవరికి కూడా చెప్పకుండా చెల్లి పెళ్లి చేసినందుకు కళ్యాణ్ తండ్రికి కోపం వస్తుంది. కళ్యాణ్‌తో సహా చెల్లిని కూడా ఇంట్లోనుంచి బయటకు పంపిస్తాడు....ఇక ఆ తర్వాత బెంగళూరు చేరిన కళ్యాణ్‌కు అక్కడ ఇందు(కాజల్) పరిచయం అవుతుంది.... తొలిచూపులోనే ఇందుతో ప్రేమలో పడిన కళ్యాణ్ ఆమె కంపెనీ సమస్యల్లో ఉంటే బయటపడేసేందుకు సాయం చేస్తాడు. కానీ అదే సమయంలో ఇందు ప్రమాదంలో ఉందని తెలుస్తుంది. ఆమె గతం తెలుసుకున్న కళ్యాణ్ ఏం చేశాడు..? ఎంఎల్ఎ ఎలా అయ్యాడు తెలుసుకోవాలి అంటే వెండితెరపై చూడాల్సిందే.
విశ్లేషణ !!
సినిమా పాత కథ అని అంటారు కాని చూపించే విధానం బాగుంది.. అన్ని సినిమాల్లో కల్యాణ్ రామ్ నటనకు ఎక్కువ మార్కులు పడతాయి, అయితే ఈ కథలో కూడా కల్యాణ్ రామ్ నటనకు 100 కి వంద మార్కులు వేయచ్చు. పటాస్ తర్వాత మంచి హిట్ కోసం చూస్తున్నాడు కల్యాణ్ రామ్ కు ఈ సినిమా హిట్ అనే చెప్పాలి.... 30 ఇయర్స్ పృథ్వీ,ప్రభాస్ శ్రీనులు కామెడీ బాగా చేశారు.. ఇక వారి పాత్రకు న్యాయం చేశారు... బ్రహ్మానందం కామెడీ వర్క్ అవుట్ అయ్యింది.మణిశర్మ సంగీత బాణీలు బాగున్నాయి.. ఎడిటింగ్ బాగుంది నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాలో ఇరువురి పాత్రలు బాగున్నాయి అని చెప్పాలి.
ప్లస్ పాయింట్స్ !!
కళ్యాణ్ రామ్, కాజల్
కామెడీ
సంగీతం
మైనస్ పాయింట్స్ !!
ఫస్టాఫ్
రేటింగ్ 2.75
Comments