యు టర్న్ సినిమా రివ్యూ.

Breaking News

హోమ్        న్యూస్

Updated:  2018-09-14 12:39:13

యు టర్న్ సినిమా రివ్యూ.

అక్కినేని సమంతా పెళ్లి చేసుకున్న తరువాత్ వరుస పెట్టి సినిమాలు రిలీజ్ చేస్తూ వెళ్తుంది. ఇప్పటికే ఈ ఏడాది "రంగస్థలం" "అభిమన్యుడు" "మహానటి" వంటి సినిమాలతో హిట్స్ అందుకున్న సమంతా ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించి ఒంటరి పోరాటం చేస్తాను అంటుంది. "యు టర్న్" అనే కన్నడ థ్రిల్లర్ సినిమాకి ఈ "యు టర్న్" రీమేక్ గా తెరకెక్కింది.కన్నడ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ ఏ ఈ సినిమాని కూడా డైరెక్ట్ చేసాడు మరి కెరీర్ లో తోలి సారి ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో అది కూడా ఒక థ్రిల్లర్ లో నటించిన సమంతా ఈ సినిమా ద్వారా హిట్ అందుకుందో లేదో రివ్యూ లో చూద్దాం.
 
ముందుగా కథ విషయంలోకి వెళ్తే రచన (అక్కినేని సమంతా) ఒక ఇంటర్న్ జర్నలిస్ట్. ఆర్ కే పురం ఫ్లై ఓవర్ మీద జరిగే ఇన్సిడెంట్స్ గురించి ఒక ఆర్టికల్ రాసేందుకు దానికి సంభందించిన సేకరిస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో తన పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఒడిదొడుకులు ఎదురుకోవాల్సి వస్తుంది. అదే టైం లో రచన ఒక కేసులో ఇరుక్కుంటుంది. ఈ నేపద్యంలో నాయక్ (ఆది పినిశెట్టి) తనంతట తానే ఈ కేసులో ఇంవోల్వ్ అయ్యి రచన కి హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. అప్పుడే రచన బాయ్ ఫ్రెండ్ కూడా రచన వల్ల ఇబ్బందుల్లో పడతాడు. అసలు రచనకి ఆ ఫ్లై ఓవర్ కి మధ్య ఉన్న సంభందం ఏంటి? అసలు ఆ ఫ్లై ఓవర్ మీద ఎం జరిగింది అనేదే మిగిలిన కథ.
 
ఇక నటీనటుల విషయానికి వస్తే అక్కినేని సమంతా తోలి సారి ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించి అధ్బుతమైన నటనని కనబరిచింది. ఇప్పటి వరకు కేవలం గ్లామర్ షోలగే అలాగే కమర్షియల్ హీరోయిన్ గానే పరిమితమైన సమంతా ఈ సినిమాతో నటిగా ఒక మెట్టు ఎక్కింది. ఈ సినిమాలో మన ఖచ్చితంగా ఒక కొత్త సమంతా ని చూడొచ్చు. సమంతా కి రచన అనే క్యారెక్టర్ ఎంతో ఇష్టం కాబట్టి ఆ పాత్రలో జీవించేసింది సమంతా. ఆది పినిశెట్టి కూడా ఒక ఫ్రెండ్లీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన తన హావభావాలతో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో భూమిక ఉన్నది చాల తక్కువ సేపే అయిన కూడా సినిమా కథలో మాత్రం ఒక ముఖ్య భూమికని పోషించింది భూమిక. ఇకపోతే సమంతా బాయ్ ఫ్రెండ్ గా నటించిన రాహుల్ రవీంద్రన్ తమ పాత్ర మేరకు పర్వాలేదు అనిపించాడు.
 
ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే పూర్ణ చంద్ర తేజస్వి అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అని చేపోచ్చు. ఇలాంటి థ్రిల్లర్ కథకి బ్యాక్ గ్ర్రౌండ్ స్కోర్ అనేది ఎంతో అవసరం ఎందుకంటే సినిమా కథని ముందుకి తిసుకేల్లడం లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ముఖ్య పాత్రని పోషిస్తుంది. పూర్ణ తన మ్యూజిక్ తో కథని ఒక మెట్టు పైకి తీసుకొని వెళ్ళింది. అలాగే నికేత్ బొమ్మేటి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ముఖ్యంగా ఫ్లై ఓవర్ మీద వచ్చే సీన్స్ ని బాగా తెరకెక్కించాడు నికేత్. ఇక ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించింది డైరెక్టర్ తరుణ్ భాస్కర్ భార్య లతా భాస్కర్. ఆమె తన వర్క్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అలాగే రచన - దర్శకత్వం వ్యవహరించిన పవన్ కుమార్ సినిమా కథని కథనం తో దారి తప్పకుండా చూసుకున్నాడు. కథకి తగ్గ కథనం రాసుకొని సక్సెస్ అయ్యాడు పవన్ కుమార్. కన్నడ "యు టర్న్" ని కూడా డైరెక్ట్ చేసింది పవన్ కుమారే కాబట్టి కన్నడ లో జరిగిన తప్పుల్ని తెలుగులో జరగకుండా చూసుకున్నాడు పవన్ కుమార్. ఒక మంచి మెసేజ్ తో కూడిన పాయింట్ ని తనదైన థ్రిల్లింగ్ శైలిలో ఆకట్టుకునేలా చెప్పాడు దర్శకుడు. మొదటి నుంచి సినిమా చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా కథనం రాసుకున్నాడు పవన్ కుమార్. ఈ విషయంలో పవన్ కుమార్ ని తప్పకుండా అభినందించాల్సిందే.
 
మొత్తంగా చూసుకుంటే ఈ "యు టర్న్" సినిమా ధియేటర్స్ లో ప్రేక్షకుల్ని తల తిప్పుకోనివ్వకుండా ఎంగేజ్ చేస్తుంది. థ్రిల్లర్ సినిమాలు ఎంజాయ్ చేసే వాళ్ళు తప్పక చూడాల్సిన చిత్రం. 
 
రేటింగ్ :- 3.25/5
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.