నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా రివ్యూ

Breaking News

హోమ్        న్యూస్

na peru surya na illu india
Updated:  2018-05-04 01:48:57

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా రివ్యూ

టైటిల్ : నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా
జానర్ : యాక్షన్‌ డ్రామా
తారాగణం : అల్లు అర్జున్‌, అను ఇమ్మాన్యూయేల్‌, అర్జున్‌, శరత్ కుమార్‌, బొమన్‌ ఇరానీ, రావూ రమేష్‌
సంగీతం : విశాల్‌ - శేఖర్‌ 
కథ, స్క్రీన్‌ ప్లే, డైలాగులు, దర్శకత్వం : వక్కంతం వంశీ
నిర్మాత : లగడపాటి శ్రీధర్‌, నాగబాబు, బన్నీ వాసు
 
!! ఇంట్రో !!
స్టైలిష్  స్టార్ అల్లు అర్జున్ న‌టించిన చిత్రం నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా... ఈ చిత్రంలో అను ఇమ్మాన్యూయేల్ బ‌న్నీ స‌ర‌స‌న న‌టించింది.. ఈ చిత్రంలో మొద‌టిసారిగా బ‌న్ని ఆర్మీ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించి త‌న అభిమానుల‌కు మ‌రింత ఉత్తేజ ప‌రిచారు... వ‌క్కంతం వంశీ ర‌చ‌యిత నుంచి తొలిసారి ద‌ర్శ‌క‌త్వంలో అడుగుపెట్టి మేకింగ్ చేశారు ఈ చిత్రాన్ని...నేడు విడుద‌లైన ఈ చిత్రం ఎలా అల‌రించింతో ఓసారి చూద్దాం?
 
కథ ఏంటంటే!!
సూర్య అల్లు అర్జున్  ఒక సైనికుడు... కోపం ఎక్కువ... చిన్న తప్పు జరిగినా తట్టుకోలేని మనస్తత్వం... హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి బోర్డర్‌ వెళ్లాలన్నదే అతడి లక్ష్యం... ఇంతలో పై అధికారులకు తెలియకుండా ఒక ఉగ్రవాదిని కాల్చి చంపేస్తాడు... దీంతో సైనిక నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన సూర్యను ఆర్మీ నుంచి బయటకు పంపించాలని కల్నల్‌(బొమన్‌ ఇరానీ) నిర్ణయిస్తాడు. కానీ, అందుకు ఒప్పుకోని సూర్య తన గాడ్‌ ఫాదర్‌(రావురమేష్‌)ను రంగంలోకి దింపుతాడు. అంతా బాగానే ఉందని వైజాగ్‌లో ఉన్న సైకియాట్రిస్ట్‌ రఘురామ కృష్ణంరాజు(అర్జున్‌) దగ్గర సంతకం తీసుకొస్తే బోర్డర్‌కు పంపుతానని కల్నల్‌ చెబుతాడు. రామకృష్ణం రాజు 21రోజుల సమయం ఇచ్చి, కోపం తగ్గించుకుని రమ్మని సూర్యకు చెబుతాడు. మరి ఆ ఛాలెంజ్‌లో సూర్య నెగ్గాడా? అతను బోర్డర్‌కి వెళ్లాడా? రఘురామ కృష్ణంరాజుకు సూర్యకు ఉన్న బంధం ఏంటి? అనేదే సిల్వ‌ర్ స్క్రీన్ పై చూడాలి.
 
!! క‌థ‌నం విశ్లేష‌ణ !!
ఈ సినిమాలో బ‌న్ని ఆర్మీ ఆఫీస‌ర్ పాత్ర‌లో జీవించాడ‌నే చెప్పాలి... ముఖ్యంగా చెప్పాలంటే సూర్య పాత్రలో బ‌న్నీ ఒదిగిపోయాడు ఆర్మీ ఆఫీస‌ర్ గా...  ఈ సినిమాలో ఆర్మీ ఆఫీస‌ర్ గా ఉంటూ నీతి నిజాయితీగా త‌న బాధ్య‌త‌ల‌ను స్వీక‌రిస్తూ ఉంటారు...  యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు వంశీ అద్భుతంగా చిత్రిక‌రించారు... పాత్ర కోసం బ‌న్నీ క‌ష్ట ప‌డిన తీరు తెర‌పై స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.. ఈ సినిమాలో ఒక ఆఫీస‌ర్ ఎలా ఉండాలి త‌న బాధ్య‌త‌ల‌ను ఎలా నిర్వ‌ర్తించాలి అనే అంశాన్ని ద‌ర్శ‌కుడు అద్భుతంగా చిత్రీక‌రించారు.. 
 
అలాగే బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్‌ శేఖర్ లు బన్ని ఎనర్జీకి తగ్గ ట్యూన్స్ తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు... మాస్ ఐటమ్‌ నంబర్‌, రొమాంటిక్‌ మెలోడి, ఫ్యామిలీ సాంగ్‌ ఇలా అన్ని వేరియేషన్స్‌ లోనూ ఆకట్టుకున్నారు... బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ తో సినిమా స్థాయిని మరింత పెంచారు.... వంశీ రాసిన డైలాగ్స్‌ అద్భుతంగా ఉన్నాయి. అయితే ఫ‌స్టాఫ్ బాగానే న‌డిచింది.. సెకండాఫ్ కాస్త నెమ్మ‌దించింది...ఈ సినిమాలో ఫైట్స్  సీన్స్ హైలెట్ అని చెప్పాలి. మొత్తానికి వ‌క్కంతం వంశీ త‌న తొలిప్ర‌య‌త్నంతో ద‌ర్శ‌క‌త్వంలో మంచి టాక్ తెచ్చుకున్నాడు. ఇక బ‌న్నీ త‌న కొత్త సినిమా సెల‌క్ష‌న్ తో మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా బ‌న్నీ అభిమానుల‌కు వేస‌విలో వినోదం  అందిస్తుంది అని చెప్ప‌డంలో ఎటువంటి డోకా లేదు.
 
ప్ల‌స్ !!
అల్లు అర్జున్‌ నటన 
సూర్య పాత్ర కోసం బన్ని మారిన తీరు 
యాక్షన్‌ సన్నివేశాలు 
 ఆర్మీ ట్రైనింగ్‌
అర్జున్ న‌ట‌న పాత్ర 
 
మైన‌స్ లు !!
క్లైమాక్స్‌
 
రేటింగ్ 3.25 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.