"నన్ను దోచుకుందువటే" సినిమా రివ్యూ

Breaking News

హోమ్        న్యూస్

nannu dochukunduvate review
Updated:  2018-09-21 02:41:41

"నన్ను దోచుకుందువటే" సినిమా రివ్యూ

చిత్రం: నన్ను దోచుకుందువటే
 
నటీనటులు: సుధీర్ బాబు, నభా నటేష్, నాజర్, వైవా హర్ష, పృథ్వీరాజ్, తదితరులు
 
సంగీతం: బి. అజనీష్ లోకనాథ్
 
ఛాయాగ్రహణం: సురేష్ రగుటు
 
నిర్మాతలు: సుధీర్ బాబు
 
రచన– దర్శకత్వం: ఆర్.ఎస్.నాయుడు
 
విడుదల తేదీ: సెప్టెంబర్‌ 21, 2018
 
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు చాలా మంది హీరోలు ప్రొడ్యూసర్స్ గా మారారు, యంగ్ హీరో శర్వానంద్ హీరోగా ప్రొడ్యూసర్ గా "కో అంటే కోటి" అనే సినిమా చేసాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది శర్వా ప్రొడ్యూసర్ గా ఫెయిల్ అయ్యాడు. గత ఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా చిరంజీవితో "ఖైది నంబర్ 150" సినిమాని ప్రొడ్యూస్ చేసి హిట్టు కొట్టాడు. ఇప్పుడు చిరంజీవి హీరోగా "సై రా" సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు చరణ్. ఇకపోతే సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన సుధీర్ బాబు హీరోగా తనే ప్రొడ్యూసర్ గా మారి "నన్ను దోచుకుందువటే" అనే సినిమాని తీసాడు. ఈ సినిమా ద్వారా షార్ట్ ఫిలిం మేకర్ ఆర్.ఎస్. నాయుడు కి డైరెక్టర్ గా అవకాశం ఇచ్చాడు సుధీర్ బాబు. మరి సుధీర్ బాబు సినిమా నిర్మాణంలో రామ్ చరణ్ లాగ సక్సెస్ అవుతాడ లేకపోతే శర్వానంద్ లాగ డీలా పడిపోతాడో వేచి చూడాలి. 
 
కథ 
 
ముందుగా కథ విషయంలోకి వెళ్తే కార్తీక్ (సుధీర్ బాబు) ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ లో మేనేజర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు, కార్తీక్ క్యారెక్టర్ ఎలాంటిది అంటే వర్క్ కి వాల్యూ ఇచ్చే వాడు. అందుకే అక్కడ ఉన్న ఉద్యోగులకి కార్తీక్ అంటే అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే కార్తీక్ వాళ్ళని టార్చర్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి కార్తీక్ తన తండ్రి (నాజర్) దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టడం కోసం మేఘన (నబా నటేష్) ని తీసుకొని వస్తాడు. తన తండ్రి దగ్గర మేఘనని సిరి అని పరిచయం చేస్తాడు. మేఘన కార్తీక్ లైఫ్ లోకి వచ్చాక కార్తీక్ లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది. ఆ తరువాత జరిగిన పరిమాణాలు ఏంటి అనేది మిగిలిన కథ.
 
నటీనటులు
 
సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన సుధీర్ బాబు నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో నటుడిగా సుధీర్ ఒక ఒక మెట్టు ఎక్కాడు అని చెప్పొచ్చు. టార్చర్ పెట్టె బాస్ గా గోల్ కోసం మాత్రమే పని చేసే వ్యక్తిగా సుధీర్ బాబు బాగా నటించాడు. ఇకపోతే హీరో పాత్రని కూడా డామినేట్ చేసే పాత్రలో నబా నటేష్ నటించింది. తెలుగు లో నబా కి ఇది తోలి సినిమానే అయిన కూడా సినిమా మొత్తానికి పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది. సినిమాలో నబా నటేష్ ఉన్న సీన్స్ అన్ని బాగా పండాయి.అలాగే హీరో ఫాదర్ గా నాజర్ పర్వాలేదు అనిపించాడు. తులసి, కమెడియన్ వేణు, వర్షిని తమ తమ పాత్రల్లో మెప్పించారు.
 
సాంకేతిక వర్గం
 
టెక్నికల్ విషయాలకి వస్తే ముందుగా మాట్లడుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ గురించి. కన్నడ "కిరిక్ పార్టీ" కి మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఇతను తోలిసారి తెలుగు సినిమాకి సంగీతం అందించాడు. ఈ సినిమా కి అజనీష్ ఇచ్చిన సంగీతం పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో అజనీష్ రీ రికార్డింగ్ బాగా ఇచ్చాడు. అలాగే కెమెరా మ్యాన్ సురేష్ కూడా తన పనితనంతో ఆకట్టుకున్నాడు. కానీ కొన్నిసీన్స్ కి డీఐ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి అనిపించింది. ఇక షార్ట్ ఫిలిం నుంచి ఫీచర్ ఫిలింస్ కి వచ్చిన ఆర్.ఎస్ నాయుడు తోలి సినిమాతోనే ఒక మంచి లవ్ స్టొరీ ని చెప్పే ప్రయత్నం చేసాడు. కథ కొత్తదేమీ కాకపోయినా హీరోయిన్ క్యారెక్టర్ ని మాత్రం బాగా డిజైన్ చేసుకొని రాసుకున్నాడు ఆర్.ఎస్.నాయుడు. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా బాగానే ఉన్న సెకండ్ హాఫ్ లో మాత్రం సినిమా కొంచెం తేడ కొట్టింది. సెకండ్ హాఫ్ ని కూడా కొంచెం డ్రాగ్ చెయ్యకుండా తీసి ఉంటే ప్రేక్షకులు ఇంకా బోర్ ఫీల్ అయ్యేవారు కాదు. గోల్స్ గోలలో పడి లైఫ్ ని లవ్ ని ఎలా స్పొయిల్ చేసుకుంటున్నారు అనే పాయింట్ ని బాగా చెప్పగలిగాడు నాయుడు.
 
మొత్తంగా చూసుకుంటే లవ్ హేట్ లవ్ స్టోరీస్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఈ సినిమాని ఒక్కసారి చూడొచ్చు. ఈ సినిమా అందరి మనసులు దోచుకోకపోయిన హీరోయిన్ నబా నటేష్ మాత్రం అందరి మనసులు దోచుకొని తీరుతుంది.
 
ప్లస్ పాయింట్స్
 
హీరోయిన్ నబా నటేష్
మ్యూజిక్ 
కెమెరా వర్క్
క్లైమాక్స్
 
మైనస్ పాయింట్స్
 
సాగిన సెకండ్ హాఫ్
 
రేటింగ్:- 2.5/5

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.