నీవెవరో మూవీ రివ్యూ

Breaking News

హోమ్        న్యూస్

nevevaro
Updated:  2018-08-24 10:22:30

నీవెవరో మూవీ రివ్యూ

తండ్రి రవిరాజ పినిశెట్టి తెలుగు లో మంచి డైరెక్టర్, కానీ తండ్రి ఇమేజ్ ని ఏ మాత్రం వాడకుండా తన సొంత టాలెంట్ తో నటుడిగా పైకి వచ్చాడు ఆది పినిశెట్టి. కెరీర్ మొదట్లో హీరోగా చేసిన కూడా విలన్ గా మంచి అవకాశాలు తెచ్చుకున్నాడు ఆది. అయితే ఇప్పుడు "రంగస్థలం" లాంటి భారీ సక్సెస్ తరువాత "నీవెవరో" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ఆది పినిశెట్టి. తాప్సీ, రితికా సింగ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని "లవర్స్" ఫేం అయిన హరినాథ్ డైరెక్టర్ చేసాడు. ఎం.వి.వి సత్యనారాయణ ఇంకా కోన వెంకట్ కలిసి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూ లో చూద్దాం.
 
ముందుగా కథ విషయంలోకి వెళ్తే కళ్యాణ్ కి (ఆది పినిశెట్టి) ఒక హోటల్ ఉంటుంది అందులో వాడు మెయిన్ చెఫ్. కానీ కళ్యాణ్ గుడ్డి వాడు. కళ్యాణ్ కి వెన్నెల (తాప్సీ) అనే అమ్మాయి అంటే చాలా ఇష్టం. వెన్నెల కళ్యాణ్ హోటల్ కి వస్తూ ఉంటుంది. మరో పక్క కళ్యాణ్ చిన్నప్పటి ఫ్రెండ్ అయిన అను (రితిక సింగ్) కళ్యాణ్ ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది.  కళ్యాణ్ ఏమో అను తన మీద జాలి చూపిస్తుంది అనుకోని వెన్నెల కి పడిపోతాడు. కళ్యాణ్ తను అనుకున్నట్టుగానే వెన్నెల కి ప్రోపోస్ చేస్తాడు. కానీ వెన్నెల కి లైఫ్ లో చాలా ప్రొబ్లెంస్ ఉంటాయి. అనుకి ఉన్న ప్రాబ్లంస్ అన్నీ సాల్వ్ చేస్తాను అని మాట ఇస్తాడు కళ్యాణ్. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే క్రమంలోనే కళ్యాణ్ కి ఆక్సిడెంట్ అవుతుంది. కానీ అసలు వెన్నెల కి ఉన్న సమస్యలు ఏంటి ? కళ్యాణ్ ఆ ప్రాబ్లంస్ ని సాల్వ్ చేసాడా లేదా ? చివరకి ఇద్దరు ఒకటయ్యార లేదా అనేదే సినిమా కథ.
 
ఇక నటీనటుల విషయానికి వస్తే ఆది నటనకి అసలు పేరు పెట్టాల్సింది ఏమి లేదు. గుడ్డివాడిగా ఆది పినిశెట్టి అధ్బుతమైన నటనని ప్రదర్శించాడు. అలాగే పర్ఫెక్ట్ చెఫ్ గా కూడా ఆ పాత్రలో ఒదిగిపోయాడు ఆది పినిశెట్టి. యాక్షన్ సీన్స్ లో కూడా ఆది తనదైన స్టైల్ ని కనబరిచాడు. ఇక తెలుగు ఇండస్ట్రీ ని పూర్తిగా వదిలేసి పూర్తిగా బాలీవుడ్ సినిమాలు చేసుకుంటున్న తాప్సీ మళ్ళి దాదాపు ఏడాది తరువాత ఈ సినిమాలో హీరోయిన్ గా నటించి బాగా అలరించింది. ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ గా నటించిన రితిక సింగ్ పర్వాలేదు అనిపించినా కూడా తాప్సీ రేంజ్ లో పెర్ఫార్మన్స్ ఇవ్వలేకపోయింది రితిక సింగ్. కానీ ఇప్పటి వరకు చేసిన సినిమాల కంటే కూడా ఒక డిఫరెంట్ రోల్ లో కనిపించింది ఈ భామ. ఇకపోతే సినిమాలో ఆడియన్స్ కి నవ్వు తెప్పించే పాత్రలో అలరించాడు. వెన్నెల కిషోర్ ఉన్నంత సేపు సినిమా చాలా సందడి సందడిగా ఉంటుంది. ఇకపోతే ఆదర్శ బాలకృష్ణ నటించిన చాలా చిన్న పాత్రలో అయిన కూడా పర్వాలేదు అనిపించాడు. అలాగే సప్తగిరి, శివాజీ రాజ, తులసి తమ తమ పాత్రల్లో మెప్పించారు. 
 
ఇక టెక్నికల్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ పని చేసారు. ఒకరు అచ్చు మరొకరు ప్రసాన్. ఈ సినిమాకి ఇద్దరు ఉన్నా కూడా ఇద్దరు తమ తమ పాటలతో అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఒక థ్రిల్లర్ సినిమాకి ఉండాల్సిన కనీస బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని కూడా మనం ఈ సినిమాలో చూడలేము. సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ మాత్రమే. యాక్షన్ సీన్స్ తో పాటు లవ్ సీన్స్ ని కూడా చాలా బాగా తెరకెక్కించాడు సాయి శ్రీరామ్. ఇకపోతే కథ పరంగా ఈ సినిమా బాగానే ఉన్నా కూడా ఒక థ్రిల్లర్ సినిమాకి ఉండాల్సి లక్షణాలని ఈ సినిమా మిస్ అయ్యింది అని చెప్పొచ్చు. దర్శకత్వం వరకు బాగానే నెట్టుకొచ్చిన హరినాథ్ కథనం దగ్గర తడబడ్డాడు. ఇకపోతే కోన వెంకట్ సమర్పించిన ఈ సినిమా యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. తక్కువ బడ్జెట్ లో సినిమాని చాలా క్వాలిటీగా చూపించారు.
 
కథ బాగున్నా కూడా కథనం బాలేక చతికిల బడిపోయింది "నీవెవరో". థ్రిల్లర్స్ అంటూ ఇష్టమైన వారు ఈ సినిమాకి దూరంగా ఉంటే మంచిది. ఫైనల్ గా ఒక హై క్వాలిటీ ఉన్న సినిమాని కథనంలో పట్టు లేకపోవడం వల్ల చెడగోట్టుకున్నాడు ఆది పినిశెట్టి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.