నోటా రివ్యూ

Breaking News

హోమ్        న్యూస్

nota review
Updated:  2018-10-05 12:50:54

నోటా రివ్యూ

నటీనటులు : విజయ్ దేవరకొండ, మెహ్రీన్ ఫిర్జాదా, నాజర్, సత్యరాజ్, తదితరులు
 
సంగీతం : శ్యామ్ సి.ఎస్
 
ఛాయాగ్రహణం : శాంతన్ కృష్ణన్, రవిచంద్రన్
 
ఎడిటింగ్ :  రేమాండ్ డెరిక్ క్రాస్టా
 
నిర్మాత : కె.ఇ. జ్ఞానవేల్ రాజా
 
రచన : షాన్ కరుప్పుసామి
 
దర్శకత్వం : ఆనంద్ శంకర్
 
విడుదల తేది : అక్టోబర్ 5, 2018
 
సెన్సేషనల్ హీరో అయిన విజయ్ దేవరకొండ పట్టిందల్ల బంగారమే అయిపొయింది. "పెళ్లి చూపులు" అనే క్లాస్ మూవీ తో హిట్టు కొట్టిన విజయ్ దేవరకొండ గత ఏడాది అర్జున్ రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మాస్ లో అలాగే సౌత్ లో మంచి క్రేజ్ రాబట్టుకున్నాడు. అలాగే ఈ ఏడాది గీత గోవిందం అంటూ ఒక రొమాంటిక్ కామెడీ హిట్ ని అందుకొని విజయపధంలో దూసుకుపోతున్నాడు విజయ్. ఇదిలా ఉంటే ఇప్పుడు నోటా అనే సినిమాతో విజయ్ దేవరకొండ ఇప్పుడు తమిళ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు. పూర్తి స్థాయి పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ని ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేసాడు. సూర్య కజిన్ అయిన జ్ఞ్యనావెల్ రాజ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అలాగే ఈ సినిమా ప్రొడక్షన్ లో విజయ్ దేవరకొండ కూడా భాగం అయ్యాడు. కింగ్ అఫ్ ది హిల్ అని సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టిన విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ప్రేక్షకులని ఎంత మేరకు ఆకట్టుకున్నాడో ఒకసారి రివ్యూ లో చూద్దాం. 
 
కథ:
ముందుగా కథ విషయంలోకి వెళ్తే వరుణ్ (విజయ్ దేవరకొండ) అమ్మాయిలు పబ్లు జల్సాలు అంటూ తిరిగే ఒక కుర్రాడు. వరుణ్ నాన్న వాసుదేవ్ (నాజర్) ముఖ్యమంత్రి. అయితే అపోసిషన్ పార్టీ చేసిన కొన్ని ఎలిగేషన్స్ వల్ల వాసుదేవ్ తన కొడుకు వరుణ్ ని సి.ఎం చేస్తాడు. ఎప్పుడు పార్టీలు అమ్మాయిలు అంటూ తిరిగే విజయ్ కి పోలిటిక్స్ గురించి అస్సలు ఐడియా లేదు. కానీ విజయ్ దేవరకొండ తనకి రాజకీయాల మీద ఉన్న కొద్దిపాటి తెలివితో రాష్ట్రంలో జరుగుతున్న విషయాలని ఎలా కంట్రోల్ చేసాడు, చివరగా విజయ్ దేవరకొండ సి.ఎం గా ఎం సాధించాడు అనేదే మిగిలిన కథ.
 
నటీనటులు:
ఈ సినిమాలో మనం మళ్ళి ఒక కొత్త విజయ్ ని చూస్తాము, ఎందుకంటే కొంచెం అటు ఇటు ప్లే బాయ్ లాగ ఉంటూనే సీరియస్ సి.ఎం క్యారెక్టర్ ని అవలీలగా చేసేసాడు విజయ్ దేవరకొండ. సినిమాలో సీనియర్ నటులు ఉన్నా కూడా ఏ మాత్రం బెదరకుండా తన క్యారెక్టర్ పరిధిలో క్యారెక్టర్ కి సీన్ కి కథకి కావాల్సిన ఎమోషన్ ని తీసుకురావడంలో విజయ్ దేవరకొండ సక్సెస్ అయ్యాడు. సినిమా పాతక సన్నివేశాల్లో అయితే విజయ్ నటన అధ్బుతం. ఇక ఈ సినిమాకి విజయ్ నిర్మాతగా కూడా వ్యవహరించాడు కాబట్టి తన పాత్రకి అలాగే తన లుక్ కి సంభందించిన జాగ్రత్తలని విజయ్ దేవరకొండ బాగానే పాటించాడు అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో మేహ్రిన్ చేసిన పాత్ర పర్వాలేదు అనిపిస్తుంది. సినిమా కథకి మేహ్రిన్ పాత్ర వల్ల పెద్ద ఉపయోగం కూడా ఏమి లేదు అనిపిస్తుంది. జస్ట్ సినిమాలో అలా వచ్చి అలా మెరిసిపోతుంది మేహ్రిన్. ఇకపోతే సినిమాలో విజయ్ తరువాత అంతగా మాట్లడుకోవాల్సిన క్యారెక్టర్ సత్య రాజ్ ది. ఒక హుందా తో కూడుకున్న పాత్రలో సత్య రాజ్ నటించిన ప్రేక్షకులని మెప్పించాడు. అలాగే నాజర్ కూడా తన పాత్ర మేరకు నటించి ఆ పాత్రకి తగ్గ న్యాయం చేసాడు. సినిమా మొత్తంలో ఏ పాత్రకి లేనటువంటి ప్రాముఖ్యత ఈ రెండు క్యారెక్టర్స్ కి ఉంది.
 
సాంకేతిక వర్గం:
ముందుగా ఈ సినిమాలోని టెక్నికల్ విషయానికి వస్తే సంగీతం గురించి మాట్లాడుకోవాలి, స్యాం సి.ఎస్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. పాటల సంగతి పక్కన పెడితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయేలా ఇచ్చాడు స్యాం సి.ఎస్. కొన్ని కొన్ని సీన్స్ అయితే కేవలం స్యాం సి.ఎస్ ఇచ్చిన సంగీతం వల్లే నిలబడ్డాయి అని చెప్పడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదు. పాటల కంటే కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు స్యాం సి.ఎస్. అలాగే ఈ సినిమాకి ఇద్దరు సినిమాటోగ్రాఫర్స్ పని చేసారు. వాళ్ళు శాంతన్ కృష్ణన్, రవిచంద్రన్. వీళ్ళిద్దరూ అందించిన కెమెరా వర్క్ బాగుంది. ఇకపోతే డైరెక్టర్ ఆనంద్ శంకర్ కథని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు అని చెప్పొచ్చు, ఎందుకంటే విజయ్ దేవరకొండ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని కొన్ని అనవసరమైన సీన్స్ ని క్రియేట్ చేసి కథనంని మరింత బలహీనంగా తాయారు చేసారు. అలాగే సినిమాని పొలిటికల్ డ్రామా గా తీద్దామ లేకపోతె పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకేక్కిద్దమా అనే సందేహంతో కథని పక్కన పెట్టేసారు అనిపించకమానదు. మొత్తానికి డైరెక్టర్ విజయ్ దేవరకొండ ని సరిగ్గా వాడుకోలేదు. 
 
మొత్తంగా చూసుకుంటే తమిళ ఫ్లేవర్ ఉన్నసినిమాకి కేవలం విజయ్ దేవరకొండ అనే పేరుని జతచేసి భారి హిట్టు కొడతాం అని అనుకున్న నోటా మేకర్స సరైన సినిమా ఇవ్వలేక డీలా పడిపోయారు. సినిమాలో విజయ్ దేవరకొండ తప్ప ఇంకేం ఆసక్తి పరిచే ఎలిమెంట్ లేదు.
 
ప్లస్ పాయింట్స్:
విజయ్ దేవరకొండ
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
కొంచెం పొలిటికల్ డ్రామా
 
మైనస్ పాయింట్స్:
పస లేని కథ,కథనం
సెకండ్ హాఫ్.
 
రేటింగ్ : – 2.25/5

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.