ఒక్క క్షణం రివ్యూ

Breaking News

హోమ్        న్యూస్

Updated:  2018-01-21 12:38:52

ఒక్క క్షణం రివ్యూ

జానర్ : సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లర్

తారాగణం : అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్

సంగీతం : మణిశర్మ

దర్శకత్వం : విఐ ఆనంద్

నిర్మాత : చక్రి చిగురుపాటి

మెగా ఫ్యామిలీ హీరోలు వ‌రుస పెట్టి స‌క్సెస్ ల‌తో దూసుకుపోతున్నారు.. ప్రతీ రెండు నెల‌ల‌కు మెగా హీరో సినిమా ఒక‌టి టాలీవుడ్ లో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది.. ముఖ్యంగా అల్లువారి  ఇంట అల్లు అర్జున్ త‌ర్వాత అల్లు శిరీష్ హీరోగా అరంగేట్రం చేసి శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు సినిమాతో హిట్ అందుకున్నారు.. ఇక  ఈ సినిమా విజ‌యం త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు శిరిష్, త‌ర్వాత ద‌ర్శ‌కుడు ఆనంద్ విఐ చెప్పిన క‌థ న‌చ్చడంతో, ఓ డిఫ‌రెంట్ క‌థ‌తో ఒక్క‌క్ష‌ణం సినిమా చేశారు మ‌రి ఆ ఒక్క క్ష‌ణం మూవీ ఎలా అల‌రించిందో చూద్దాం ప‌దండి?

కథ :

జీవా  (అల్లుశిరీష్)  మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం లేక ఖాళీగా ఉంటాడు. అమ్మా నాన్నలతో సరదాగా కాలం గడిపే జీవాకు ఓ రోజు ఇనార్బిట్ మాల్ లోని బేస్మెంట్ పార్కింగ్ పిల్లర్ నంబర్ బి 57 దగ్గర జ్యోత్స్న( సురభి)  అనే అమ్మాయి పరిచయం అవుతుంది... తొలి చూపులోనే ఇద్దరు ప్రేమలో పడతారు. తరువాత వాట్సప్ చాటింగ్ లతో మరింత దగ్గరవుతారు వీరిద్ద‌రూ . వారి ప్రేమను ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. తనచుట్టూ ఉన్న మనుషులను చూస్తూ టైం పాస్ చేసే జ్యోకి తమ అపార్ట్‌మెంట్ లోని పక్క పోర్షన్ లో ఉంటున్న శ్రీనివాస్ అవ‌స‌రాల

స్వాతి  (సీరత్ కపూర్ల)  ల‌ మధ్య ఏదో జరుగుతుందన్న అనుమానం కలుగుతుంది.. దీని మ‌ధ్య విష‌యం తెలుసుకోవాలి అని ప్ర‌య‌త్నం చేసిన జీవా జ్యోత్స్న‌ల‌కు కొన్ని ఆశ్చ‌ర్య‌మైన విషయాలు తెలుస్తాయి.

 సరిగ్గా ఏడాది క్రితం శ్రీనివాస్, స్వాతిల జీవితంలో ఏ సంఘటనలు అయితే జరిగాయో అవే సంఘటనలు జీవా, జ్యోత్స్నల జీవితంలో ప్రస్తుత కాలంలో జరుగుతుంటాయి. !!మహ్మద్  ఆస్తేకర్  జయప్రకాష్!! అనే ప్రొఫెసర్ ద్వారా ప్యారలల్ లైఫ్ గురించి తెలుసుకొని తన జీవితం కూడా స్వాతి జీవితం లాగే అవుతుందని భయపడుతుంది జ్యో. అదే సమయంలో స్వాతి తన అపార్ట్‌మెంట్ లో హత్యకు గురవుతుంది. దీంతో ఆ హత్య శ్రీనివాసే చేశాడని పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. దీంతో జీవా తనను చంపుతాడని మరింత భయపడుతుంది జ్యో.. త‌న లైఫ్ లా త‌న‌కు ఇలాంటి బాధలు వ‌స్తాయ‌ని అనుకుంటుంది అస‌లు స్వాతిని నిజంగా శ్రీనివాసే చంపాడా ? ఆత్మహత్య చేసుకుందా ? స్వాతి లాగే జ్యోత్స్న కూడా చనిపోతుందా?  విధిని ఎదురించి చేసే పోరాటంలో జీవా విజయం సాధించాడా..? అనేది వెండి తెర‌పై చూడాలి

విశ్లేష‌ణ‌!!

గ‌త సినిమాల కంటే ఈ సినిమాలో శిరీష్ న‌ట‌న బాగుంది.. ఈ సారి స‌రికొత్త సినిమాతో త‌న కెరియ‌ర్ మ‌ళ్లీ స్టార్ చేయాలి అని భావించిన‌ట్టు తెలుస్తోంది.. ఇక సినిమాలో ట్విస్ట్ లు ఆక‌ట్టుకున్నాయి.. ముఖ్యంగా న‌లుగురి చుట్టూ క‌థ తిరుగుతుంది.. ఆ నాలుగు పాత్ర‌ల మ‌ధ్య జ‌రిగే స‌న్నివేశాలు కూడా ఆక‌ట్టుకుంటాయి..నిర్మాణ విలువ‌లు బాగున్నాయి పాత్ర‌ల ఎంపిక బాగుంది.. అలాగే క‌థ‌లో వ‌చ్చే ట్విస్ట్ లు మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించాయి.. ఇంట‌ర్వెల్ సీన్ బాగా తెరకెక్కించారు. సంగీతం కాస్త ఫోక‌స్ చేయాలి పాటలు కూడా చిత్రానికి బ‌లం చేకూరేలా లేవు. మొత్తానికి సినిమా పై పాజిటివ్ టాక్ వ‌చ్చింది అనే చెప్ప‌వ‌చ్చు.

ప్లస్ పాయింట్స్ :

కథ లోని ట్విస్ట్

ఇంటర్వెల్ 

పాత్రల ఎంపిక ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌

మైనస్ పాయింట్స్ :

క‌థ‌నంలో బ‌లం లేక‌పోవ‌డం

సంగీతం

 

రేటింగ్ 3

 

 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.