"పేపర్ బాయ్" సినిమా రివ్యూ

Breaking News

హోమ్        న్యూస్

paper boy review
Updated:  2018-08-31 01:35:59

"పేపర్ బాయ్" సినిమా రివ్యూ

తెలుగు సినిమాల్లో ఈ మధ్య చిన్న సినిమాలు ధియేటర్ లో తెగ సందడి చేస్తున్నాయి. ఇప్పుడు అదే కోవలో "పేపర్ బాయ్" అనే సినిమా వస్తుంది. స్టార్ హీరోలు అయిన మహేష్ బాబు. ప్రభాస్ తో సినిమాలు డైరెక్ట్ చేసిన శోభన్ కొడుకు సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. షార్ట్ ఫిలిమ్స్ తో యుట్యూబ్ ప్రేక్షకులని అలరించిన జయశంకర్ ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇక కమర్షియల్ సినిమాల దర్శకుడు సంపత్ నంది తన సొంత ప్రొడక్షన్ హౌస్ సంపత్ నంది టీం వర్క్స్ పై ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసాడు. మరి ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుందో లేదో రివ్యూ లో చూద్దాం.
 
ముందుగా కథ విషయంలోకి వెళ్తే ముంబై లో డాక్టర్ గా పని చేస్తున్న మేఘాకి (తాన్యా హాప్) తానూ కొన్ని నెలల్లో చనిపోతుంది అని తెలుస్తుంది. అయితే అసలు తనని దేవుడి ఈ కొద్ది రోజులు ఎందుకు బ్రతికించాడు అనే అర్ధం కోసం మేఘా వెతికే క్రమంలో ఒక గుళ్ళో తనకి ఒక డైరీ దొరుకుతుంది. యా డైరీ లో రవి (సంతోష్ శోభన్) తన ప్రేమ కథని రాసుకుంటాడు. రవి ఒక పేపర్ బాయ్, అలాంటి రవి పెద్దింటి అమ్మాయి అయిన ధరణిని (రియ)ప్రేమిస్తాడు. ధరణి కూడా రవి ఆలోచనలకి పడిపోయి రవిని ప్రేమిస్తుంది. కానీ రవి, ధరణి ఇద్దరి కుటుంబ తరగతులు వేరు. ఇలాంటి సమయం అసలు రవి, ధరణిలు ఎలా ఒకటయ్యారు, మేఘా వీళ్ళ ప్రేమకి ఎలా ఉపయోగపడింది అనేది మిగిలిన కథ.
 
నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే శోభన్ కొడుకుగా ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఆయన సంతోష్ శోభన్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇది వరకు సంతోష్ శోభన్ చాలా సినిమాల్లో నటించిన కూడా ఈ సినిమాలో మాత్రం నటన పరంగా చాలా మెరుగు పడ్డాడు అనిపించింది. ఇతను ఫ్యూచర్ లో కమర్షియల్ హీరో అవుతాడో లేదో తెలియదు గాని తెలుగు ఇండస్ట్రీ కి ఒక మంచి నటుడు దొరికాడు అని చేపోచ్చు. సంతోష్ శోభన్ కొన్ని చోట్ల తడబడ్డా కూడా తన డైలాగ్ డెలివరీ తో ఆ తప్పుల్ని కవర్ చేసుకున్నాడు. ఇకపతే ధరణి పాత్రలో నటించిన రియ చూడటానికి బాగానే ఉన్న నటన పరంగా అంతగా ఆకట్టుకోలేదు. అలాగే ఇంకో హీరోయిన్ గా నటించిన తాన్య మాత్రం కొద్దిగా పర్వాలేదు అనిపించింది. ఇకపోతే సినిమాలో పెద్దగా చెప్పుకోడానికి క్యారెక్టర్స్ లేకున్నా కూడా పోసాని, నాగినీడు వంటి వారు మాత్రం అలా వచ్చి తళుకున్న మెరిసారు. సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే బిత్తిరి సత్తి ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకులకి కొంత ఊరటని ఇస్తుంది. 
 
ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే సౌందర్ రాజన్ తన కెమెరా వర్క్ తో సినిమాకి ఒక అందం తీసుకొని వచ్చాడు. సినిమా లవ్ స్టొరీ కాబట్టి ఆ ఫీల్ కి ఎక్కడా మిస్ కాకుండా చూసుకున్నాడు సౌందర్ రాజన్. అలాగే భీమ్స్ అందించిన పాటలు అన్నీ బాగున్నాయి, ముఖ్యంగా ముంబై పోతావా రాజా అనే పాట అయితే మాస్ ని ఆకట్టుకోవడం ఖాయం అనిపించింది. ఎడిటర్ తమ్మిరాజు అయితే షార్ప్ కట్స్ తో సినిమాని ఎంత ఫాస్ట్ గా నడిపిద్దాం అని చూసిన గాని కథనం ఈ సినిమాని వెనక్కి నెట్టేసింది. జయశంకర్ కథ ని బాగానే చెప్పుకొచ్చిన కథనం లో మాత్రం పట్టు కోల్పోయాడు. సినిమాలో అక్కడక్కడ వచ్చే మాటలు బాగున్నాయి. సంపత్ నంది మాత్రం ఒక చిన్న సినిమా కి ఎంత బడ్జెట్ అవసరమో అంత కంటే ఎక్కువే ఖర్చుపెట్టాడు అనిపించింది.
 
మొత్తంగా చూసుకుంటే ఒక రొటీన్ కథని రొటీన్ స్క్రీన్ ప్లే లో చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. సినిమా మొదటి భాగం ఏ స్లో అనుకుంటే రెండవ భాగం అంతకంటే స్లో గా నడించింది. సినిమాలో ఒక్క బిత్తిరి సత్తి ఎపిసోడ్ తప్పితే మిగతాది మొత్తం ఒక సగటు ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తుంది.
 
రేటింగ్ :- 2/5.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.