రంగస్థలం రివ్యూ

Breaking News

హోమ్        న్యూస్

rangasthalam review
Updated:  2018-03-30 11:45:46

రంగస్థలం రివ్యూ

నటీనటులు: రామ్‌చరణ్‌.. సమంత.. ఆది.. ప్రకాశ్‌రాజ్‌.. జగపతిబాబు.. అనసూయ.. నరేష్‌.. రోహిణి.. రాజీవ్‌ కనకాల తదితరులు 
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ 
ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు 
కూర్పు: నవీన్‌ నూలి 
కళ: రామకృష్ణ, మౌనిక 
పోరాటాలు: రామ్‌-లక్ష్మణ్‌ 
సాహిత్యం: చంద్రబోస్‌ 
రచన: తోట శ్రీనివాస్‌.. కాశీ విశాల్‌.. బుచ్చిబాబు.. శ్రీనివాస్‌ రంగోలి 
నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని.. వై. రవిశంకర్‌.. మోహన్‌ చెరుకూరి 
దర్శకత్వం: సుకుమార్‌ 
బ్యానర్‌: మైత్రీ మూవీ మేకర్స్‌ 
 
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ త‌న సినిమాల జోరు చూపుతున్నారు.. చిరుత సినిమా నుంచి రామ్ చ‌ర‌ణ్ త‌న న‌ట‌న‌లో వైవిధ్య‌ప‌ర‌మైన క‌థ‌లు ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు... అయితే ఇప్పుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ స‌రికొత్త సినిమాలో న‌టించాడు చెర్రి... రంగ‌స్ద‌లం 1985 చిత్రంలో న‌టించాడు చ‌ర‌ణ్ .... అప్ప‌టి రాజ‌కీయ ప‌రిస్దితుల బ‌ట్టి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.. ఈ సినిమాలో చెర్రి స‌ర‌స‌న స‌మంత న‌టించ‌గా జ‌గ‌ప‌తిబాబు మెయిన్ రోల్ ప్ర‌ధాన‌ప్ర‌తినాయ‌కుడిగా పోషించారు, ఓ సారి ఈ సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.
 
క‌థ‌!!
రంగస్థలం అనే గ్రామానికి ప్రెసిడెంట్‌ ఫణీంద్ర భూపతి !! జగపతిబాబు!!  30ఏళ్లుగా ప్రెసిడెంట్‌ పదవిలో 
కొన‌సాగుతూ ఉంటాడు అక్క‌డ రాజకీయంగా మ‌రొక‌రికి అవ‌కాశం అనేది ఇవ్వ‌డు.. ఇక అత‌ను చెప్పిందే గ్రామంలో వేదం అన్న చందంగా ఉంటుంది అక్క‌డ ప‌రిస్దితి.. ఇక అత‌న్ని ఎదురించే వారు అక్క‌డ క‌నిపించ‌రు ఆయ‌న అంటే అంద‌రూ భ‌య‌ప‌డ‌తారు.. ప్రెసిడెంట్‌ ఇంటి ముందు నుంచి వెళ్లాలన్నా చెప్పులు విడిచి వెళ్లాలి. ఇదే గ్రామంలో పొలాలకు నీరు పెట్టే ఇంజిన్‌ను నడుపుతూ ఉంటాడు చిట్టిబాబు.!! రామ్‌ చరణ్‌!! అతడికి చెవుడు. పెద్దగా వినిపించదు. 
 
అయినా త‌న ప‌ని తాను చేసుకుంటూ గ్రామంలో అందరితోనూ సరదాగా ఉంటాడు. తండ్రి !!నరేష్‌!!  గ్రామంలో టైల‌ర్ గా ప‌నిచేసుకుంటాడు ఇక చిట్టిబాబు అన్న కుమార్‌బాబు(ఆది) చదువుకుని దుబాయ్‌లో ఉద్యోగం చేసి వస్తాడు. అదే ఊరిలో ఉండే రామలక్ష్మి(సమంత)కి చిట్టిబాబు అంటే ఎంతో ఇష్టం. గ్రామంలోని అమాయక రైతులను తన సహాయకుడితో కలిసి ఫణీంద్రభూపతి మోసం చేస్తూ ఉంటాడు. అలా రామలక్ష్మి(సమంత) తండ్రిని మోసం చేసి డబ్బు కట్టాల్సిందిగా ఆదేశిస్తాడు. ఈ విషయంలో కుమార్‌బాబుకి ప్రెసిడెంట్‌ సహాయకుడికి మధ్య గొడవ జరుగుతుంది. 
ఆ స‌మ‌యంలో ప‌లు కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటాయి.రంగస్థలం’ గ్రామ సర్పంచ్‌ ఎన్నికల్లో కుమార్‌బాబు ఎందుకు నామినేషన్‌ వేయాల్సి వచ్చింది? ఫ‌ణీంద్ర‌భూప‌తి ఏంచేశాడు.. చివ‌ర‌కు చిట్టిబాబు ఎటువంటి ప‌రిస్దితులు ఎదుర్కొన్నాడు. అన్న‌దే క‌థ‌. వెండితెర‌పై చూడాల్సిందే
 
!!కథ -విశ్లేష‌ణ‌!! 
సుకుమార్ సినిమాలు అంటేనే ట్విస్టులు ఉంటాయి... ఆ నేరేష‌న్ క‌థ‌లో విభిన్న‌త క‌నిపిస్తుంది.. రొటీన్ క‌థ‌ల‌కు ఎప్పుడూ విభిన్నం సుకుమార్ చిత్రాలు.. ఇప్పుడు ఈ రంగ‌స్ధ‌లం కూడా అలాంటి క‌థ అని చెప్పాలి..1985 లో భూస్వామి వ్య‌వ‌స్ద ఎలా ఉండేది అనేదానిని ఈ చిత్రంలో స్ప‌ష్టంగా చూపించారు.. అప్ప‌టి ప‌రిస్దితులు నేటివిటీని బాగా చూపించారు.పూర్తిగా సినిమాలో గ్రామీణ వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది.ఇక ఫ‌స్ట్ పార్ట్ అంతా చిట్టిబాబు చేసే స‌ర‌దా సంద‌డి ఉంటుంది... అలాగే సినిమాలో వ‌చ్చే ట్విస్టులు క‌థ‌లో ఓ కొత్త మ‌లుపుతు చూపుతాయి. 
 
ఇక రామ‌ల‌క్ష్మితో చిట్టిబాబు చేసే స‌రదా స‌న్నివేశాలు అల‌రిస్తాయి.ముఖ్యంగా రామలక్ష్మిగా సమంత నటన ఆకట్టుకుంటుంది...... ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పంచుతాయి -ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తాయి.. ఇద్ద‌రిమ‌ధ్య  పాటలు కూడా సన్నివేశాలకు తగ్గట్టుగా ఉన్నాయి.....ఇక సినిమాలో చిట్టిబాబు అన్న‌ కుమార్ బాబు నామినేష‌న్ వేయ‌డంతో క‌థ కీల‌క మ‌లుపు తిరుగుతుంది. అయితే ప్రెసిడెంట్ తండ్రిని అన్న‌ని  అవ‌మానించిన విష‌యం చిట్టిబాబుకు తెలియ‌కుండా ఈ క‌థ జ‌రుగుతుండం తీసిని విధానం బాగుంది.
 
అలాగే మొద‌టిభాగం అంతా క‌థ‌లో స‌రదా సన్నివేశాలతో  దర్శకుడు న‌డిపించాడు.. చివ‌ర‌కు అస‌లు క‌థ‌ను సెకండాఫ్ లో పెట్టారు.. అలాగే కుమార్‌బాబు నామినేషన్‌ వేయడం, ప్రెసిడెంట్ అరాచకాలను ఊరి వాళ్లకు తెలియజేయడం, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు తదితర సన్నివేశాలతో సెకండాఫ్‌ను తీర్చిదిద్దాడు దర్శకుడు సుకుమార్..రంగమ్మత్తగా అనసూయ యాక్టింగ్ కూడా బాగుంది అనే చెప్పాలి. సినిమాలో  చివ‌ర్లో ప్ర‌కాశ్ రాజు ట్విస్ట్ కూడా బాగుంది అని చెప్పాలి....సినిమాలో మొత్తం గోదావ‌రి యాస‌తోనే న‌డిచింది..మొత్తానికి అంద‌మైన 1985 రంగ‌స్ధ‌లం చూసిరావ‌చ్చు సినిమాలో ద‌ర్శ‌కుడు చిట్టిబాబు అల‌రించిన విధానం స్టోరి అంద‌రికి న‌చ్చుతుంది.
 
!! బలాలు !!
రామ్‌చరణ్‌ నటన 
పాటలు, నేపథ్య సంగీతం 
డైరెక్ష‌న్ 
సెట్స్ 
 
!! బలహీనతలు !!
ఫ‌స్ట్ పార్ట్ స్లో గా ఉండ‌టం
 
రంగ‌స్ధ‌లం సినిమా చూసేందుకు అనువైన స్ధ‌లం. 
 
రేటింగ్ 3.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.