Rx 100

Breaking News

హోమ్        న్యూస్

Updated:  2018-07-12 15:20:04

Rx 100

మన తెలుగు ఇండస్ట్రీ కి "అర్జున్ రెడ్డి" మంచి మార్పు తీసుకువచ్చింది అని చెప్పొచ్చు, ఎందుకంటే "అర్జున్ రెడ్డి" అనే సినిమా తెలుగు సినిమాకి ఒక బోల్డ్ అండ్ రా కంటెంట్ ఎలా ఉంటుందో అని చెప్పింది. ఆ సినిమా తరువాత అదే కోవలో తెలుగు లో చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అదే కోవలో వస్తున్న మరో సినిమా "Rx 100". కార్తికేయ రెడ్డి హీరో గా పరిచయం అవుతున్న ఈ సినిమా ట్రైలర్ నుంచే మంచి రా ఇంకా బోల్డ్ కంటెంట్ ఉన్న మూవీగా అనిపించింది. అజయ్ భూపతి ఈ సినిమాని చాలా ఎమోషనల్ పాయింట్ తో తెరకెక్కించాడు అని అర్ధం అవుతుంది. మరి ట్రైలర్ తోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
 
ముందుగా కథ విషయంలోకి వెళితే శివ (కార్తికేయ) చిన్నప్పుడే అమ్మ నాన్నలని ఒక ఆక్సిడెంట్ లో కోల్పోతాడు, అప్పటి నుంచి శివ ని డాడీ (రాంకి) తన సొంత కొడుకుల పెంచుతాడు. ఆ ఊరిలో విశ్వనాధ్ (రావు రమేష్) మంచి పలుకుబడి ఉన్న వ్యక్తీ. విశ్వనాద్ కి కొంచెం చేదోడు వాదోడు గా డాడీ ఉండటానికి ట్రై చేస్తాడు, కాని విశ్వనాధ్ కి డాడీ అంటే అస్సలు పడదు. అయితే ఈ క్రమం లో శివ అనుకోకుండా విశ్వనాధ్ కూతురు అయిన ఇందు (పాయల్ రాజ్ పూత్) ని ప్రేమిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న విశ్వనాధ్ ఎం చేసాడు ? ఇందు ని శివ నుంచి ఎలా దూరం చేసాడు. అసలు శివ ఇందుని కలుసుకున్నాడ లేదా తనని పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ.
 
ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ మూవీ తో హీరో గా పరిచయం అవుతున్న కార్తికేయ ఇంటెన్స్ రోల్ లో బాగానే నటించాడు, అక్కడక్కడా విజయ్ దేవరకొండ ని ఇమిటేట్ చేసిన గాని పర్వాలేదు అనిపించాడు. కాని ఎమోషనల్ సీన్స్ లో మాత్రం కార్తికేయ ఇంకా బాగా చేయొచ్చు అనిపించింది. యాక్షన్ సీన్స్ లో మాత్రం కార్తికేయ బాగా నటించాడు. అలాగే హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ విషయానికి వస్తే కేవలం గ్లామర్ ని వలకించడానికి మాత్రమే సినిమాలో ఉంది అనిపిస్తుంది. కథలో పాయల్ ది ముఖ్యమైన క్యారెక్టర్ అయిన కూడా తన నటనతో ఆ క్యారెక్టర్ ని అంతగా పడించలేకపోయింది ఈ భామ. ఇక మూవీ లో మరో మెయిన్ క్యారెక్టర్ విషయానికి వస్తే రావు రమేష్ గురించి మాట్లాడుకోవాలి. రావు రమేష్ తనదైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు, ఇంకా చెప్పాలి అంటే కొన్ని సీన్స్ లో రావు రమేష్ అలా ఒదిగిపోయాడు అనిపిస్తుంది. అలాగే "సింధూర పువ్వు" సినిమాతో తెలుగు లో మంచి క్రేజ్ తెచ్చుకున్న రాంకి ఈ సినిమాతో మళ్ళి తెలుగు లో చాలా కాలం తరువాత నటించిన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టాడు. కాని సెకండ్ ఇన్నింగ్స్ కి ఏ నటనైతే కావాలో అది ఇవ్వడం లో ఫెయిల్ అయ్యాడు రాంకి.
 
ఇక మూవీ టెక్నికల్ విషయానికి వస్తే ముందుగా మాట్లడుకోవాల్సింది కెమెరా వర్క్ గురించి. సినిమాటోగ్రాఫర్ అయిన రామ్ తన కెమెరా పనితనంతో సినిమా ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్ళాడు. సినిమాలోని యాక్షన్ సీన్స్ గాని లవ్ సీన్స్ గాని ఎమోషనల్ సీన్స్ లో గాని అన్ని సీన్స్ ని రామ్ తన కెమెరా టాలెంట్ తో నింపేసాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అయిన చైతన్ భరద్వాజ్ కూడా తన సంగీతం తో ఆకట్టుకున్నాడు. "పిల్లా రా" అనే సాంగ్ అయితే వన్ అఫ్ ది బెస్ట్ సాంగ్ ఇన్ ఆల్బం గా చెప్పుకోవచ్చు. కాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో మాత్రం చైతన్ భరద్వాజ్ కొంచెం తడబడ్డాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "కబాలి" మూవీ కి పనిచేసిన ఎడిటర్ కె.ఎల్ ప్రవీణ్ ఈ సినిమా కి కూడా పనిచేసాడు. కె.ఎల్ ప్రవీణ్ ఇంకాస్త షార్ప్ ఎడిట్ చేసి ఉంటే మూవీ స్క్రీన్ ప్లే ఇంకా హెల్ప్ అయ్యేది. ఇక దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమా ని చాలా బోల్డ్ గా న్యాచురల్ గా తెరకెక్కించాడు. కథతో తను చెప్పాల్సిన పాయింట్ ని చెప్పిన అజయ్ స్క్రీన్ ప్లే ని మాత్రం ఎంగేజింగ్ గా ఉంచలేకపోయాడు. కాని సెకండ్ హాఫ్ లో వచ్చే రావు రమేష్ ఇంకా హీరోయిన్ మధ్యలో సీన్ అలాగే క్లైమాక్స్ పోర్షన్ మొత్తం చక్కగా హ్యాండిల్ చేసాడు అజయ్. ఇకపోతే అజయ్ కొంచెం మూవీ లో రొమాన్స్ పాళ్ళు తగ్గించి ఉంటే బాగుండు అనిపించకమానదు.
 
మొత్తానికి ఒక రా అండ్ బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ "Rx 100" పూర్తిగా ప్రేక్షకుల్ని రంజింపజేయకుండానే ఆగిపోయింది అని చెప్పొచ్చు. కొంచెం యాక్షన్ అంశాలు కోరుకునే వాళ్ళు అలాగే స్లో స్క్రీన్ ప్లే కావలి అనుకునే వారు అలా ధియేటర్ కి వెళ్లి ఒక లుక్ వేసి రావొచ్చు. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.