శైలజా రెడ్డి అల్లుడు సినిమా రివ్యూ

Breaking News

హోమ్        న్యూస్

Updated:  2018-09-13 05:50:16

శైలజా రెడ్డి అల్లుడు సినిమా రివ్యూ

అక్కినేని వంశం నుంచి హీరోగా వచ్చిన నాగ చైతన్య కెరీర్ మొదట్లో ఫ్యామిలీ పేరు వాడుకున్న కూడా ఆ తరువాత తన సొంత కాళ్ళ మీద నిలబడి అవకాశాలు అందుకుంటున్నాడు. కానీ నాగ చైతన్య కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు, అలాగే నాగ చైతన్య ఎప్పటి నుంచ మంచి మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఈ కోవలోనే పలు సినిమాలు చేసిన కూడా అవన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గరకు ఫ్లాప్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు నాగ చైతన్య నటిస్తున్న పక్క కమర్షియల్ సినిమా "శైలజా రెడ్డి అల్లుడు". రమ్య కృష్ణ నాగ చైతన్య అత్తగా నటించిన ఈ సినేఅని మారుతీ డైరెక్ట్ చేసాడు. మరి ఈ సినిమాతో అయిన నాగ చైతన్య మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడో లేదో రివ్యూ లో చూద్దాం.

 
ముందుగా కథ విషయంలోకి వెళ్తే చైతన్య (నాగ చైతన్య) మొదటి చూపులోనే రిచ్ గర్ల్ అయిన అను రెడ్డి (అను ఎమన్యుఎల్) ని ప్రేమిస్తాడు. కానీ అను కి కొంచెం ఇగో ఎక్కువ. కానీ చైతు ఎలాగైనా తన ఫ్రెండ్ సహాయం తో అను ని ప్రేమలో పడేస్తాడు చైతు. కానీ అను తల్లి శైలజా రెడ్డికి (రమ్య కృష్ణ) మాత్రం చైతు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఈ నేపధ్యంలోనే శైలజా రెడ్డి ఇంకా అను రెడ్డి మాట్లాడుకోవడం మానేస్తారు. చివరగా చైతు వాళ్ళిద్దరిని మళ్ళి కలిపి ఎలా తన ప్రేమని గెలిపించుకున్నాడు అనేది మిగిలిన కథ.
 
నటీనటుల విషయానికి వస్తే అక్కినేని నాగ చైతన్య ఈ సినిమాలో ఇది వరకు సినిమాల కంటే కూడా చాలా గ్లామర్ గా కనిపించాడు. ఆడియో వేడుక లో అఖిల్ చెప్పినట్టు పెళ్లి అయ్యాక నాగ చైతన్య నుంచి వచ్చిన పర్ఫెక్ట్ సినిమా శైలజా రెడ్డి అల్లుడు. అక్కినేని అభిమానులు ఇన్ని రోజులు నాగ చైతన్య లో మాస్ యాంగిల్ మిస్ అయ్యాం అని ఫీల్ అయ్యారు, కానీ ఈ సినిమాలో ఫైట్ సీన్స్ అభిమానులకి కన్నుల పండగే అని చెప్పొచ్చు. పైగా నాగ చైతన్య కి ఇలాంటి అత్తా అల్లుళ్ళ సినిమాకి కొత్త, అయిన కూడా ఎంతో ఈజ్ తో నటించాడు చైతు. ఇకపోతే సినిమా కి మరో హై లైట్ గా నిలుస్తుంది శైలజా రెడ్డి పాత్ర. ఈ పాత్రలో నటించిన రమ్య కృష్ణ అయితే పాత్రలో జీవించింది అని చేపోచ్చు. నాగ చైతన్య ఇంకా రమ్య కృష్ణ మధ్యలో వచ్చే సీన్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. అలాగే అను ఎమన్యుఎల్ కూడా పొగరు ఉన్న అమ్మాయిగా బాగా నటించింది. ఇకపోతే సినిమా సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు, ఆ సీన్స్ కి ప్రేక్షకులు ధియేటర్ లో పగలబడి నవ్వుతున్నారు. వెన్నెల కిషోర్ తో పాటు 30 ఇయర్స్ పృథ్వి కూడా ఆకట్టుకున్నాడు. నరేష్, మురళి శర్మ కూడా తమ తమ పాత్రలో పర్వాలేదు అనిపించారు.
 
ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే ముందుగా మాట్లడుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గురించి, ఇటివలే గీత గోవిందంతో హిట్ అందుకొని ఆ సినిమాకి మంచి పాటలు ఇచ్చిన గోపి సుందర్ ఈ సినిమాకి కూడా అదే తరహాలో పాటల్ని అందించాడు. ముఖ్యంగా లవ్ సీన్స్ కి అయితే గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. అదే విధంగా నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది, సినిమాకి ఒక క్లాస్ లుక్ ని తీసుకొని వచ్చాడు ఈ సినిమాటోగ్రాఫర్. ఇక తన కథలతో కామెడీ పండించే మారుతీ ఈ సినిమా కథలో కూడా ఒక ఫన్ని పాయింట్ పెట్టాడు. మనుషులకి ఇగో ఉండి అది ఎక్కువ అయితే ఎలా ఉంటుంది అనే పాయింట్ ని చాలా ఫన్ని గా చూపించాడు మారుతి. ఫస్ట్ హాఫ్ అలా అలా సాగిన కూడా సెకండ్ హాఫ్ లో మాత్రం వెన్నెల కిషోర్ కామెడీ ద్వారా ధియేటర్ లో నవ్వులు పూయించాడు ఈ దర్శకుడు. యాక్షన్ సీన్స్ ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేసాడు మారుతీ. అక్కినేని ఫ్యాన్స్ నాగ చైతన్య కి ఎలాగైతే చూడాలి అనుకున్నారో మారుతీ అదే తరహాలో నాగ చైతన్యని చూపించే ప్రయత్నం చేసాడు. అత్తా అల్లుళ్ళ మధ్యలో వచ్చే సీన్స్ ని కూడా బాగా రాసుకున్నాడు మారుతీ.
 
మొత్తంగా చూసుకుంటే ఒక కమర్షియల్ సినిమాని ఎంజాయ్ చేయాలి అనుకునే వారు ఈ సినిమాకి హ్యాపీగా వెళ్ళొచ్చు. సెకండ్ హాఫ్ లో అయితే కొన్ని సీన్ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తాయి. శైలజా రెడ్డి అల్లుడు ప్రేక్షకులని పూర్తీ స్థాయి లో ఆకట్టుకోలేక పోయిన కూడా కొంత వరకు ఈ అల్లుడు అన్దరీ నచ్చొచ్చు.
 
రేటింగ్:- 2.5/5

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.