సాక్ష్యం మూవీ రివ్యూ

Breaking News

హోమ్        న్యూస్

saksham
Updated:  2018-07-27 15:53:13

సాక్ష్యం మూవీ రివ్యూ

స్టార్ ప్రొడ్యూసర్స్ కొడుకులు ఎంతో మంది ఇండస్ట్రీ కి వచ్చారు, కానీ అందులో అల్లు అరవింద్ కొడుకు అయిన అల్లు అర్జున్ ఒక్కడు మాత్రమే స్టార్ హీరోగా ఇండస్ట్రీ లో నిలదొక్కుకోగలిగాడు. ఇప్పుడు మళ్ళి బెల్లంకొండ సురేష్ కొడుకు అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గా నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. "జయ జానకి నాయక" సినిమాతో యాక్షన్ దారిలోకి వచ్చిన శ్రీనివాస్ ఇప్పుడు "సాక్ష్యం" మూవీ తో తన సక్సెస్ ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాడు. శ్రీవాస్ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉందొ ఇప్పుడు రివ్యూ లో చూద్దాం.
 
ముందుగా కథ విషయంలోకి వెళ్తే ముని స్వామి (జగపతి బాబు) ఒక ఫ్యామిలీ ని దారుణంగా హత్య చేస్తాడు కానీ ఒక ఆవు మాత్రం ఆ ఫ్యామిలీ లో ఉన్న ఒక చిన్న బాబు ని కాపాడుతుంది ముని స్వామి నుంచి. ఆ బాబు పేరు విశ్వ(బెల్లంకొండ సాయి శ్రీనివాస్). పెరి పెద్దైనా విశ్వ వీడియో గేమ్స్ డిజైన్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఒక దుబాయ్ లో సౌందర్య (పూజ హెగ్డే) ని మీట్ అవుతాడు విశ్వ. చూసి చూడగానే తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. తనతో ప్రేమలో ఉండగానే అనుకోకుండా పంచభూతాలు అన్ని కలిసి విశ్వా ని తన ఫ్యామిలీ హతం అని చోటుకి తీసుకొని వస్తాయి. ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్న విశ్వా ఫైనల్ గా వాళ్ళ ఫ్యామిలీని చంపిన ముని స్వామిని ఎలా హతమార్చాడు అనేది కథ.
 
ఇక నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ గా మారాడు. నటన లో గాని ముఖ కవళికల విషయంలో గాని ఇదివరకు సినిమాలలో కంటే కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ఈ సినిమా కోసం బెల్లంకొండ శ్రీనివాస్ ఎంత కష్టపడ్డాడు అనేది అర్ధం అవుతుంది. అలాగే ఎమోషన్ సీన్స్ ఇంకా ఫైట్స్ విషయం లో కూడా చాలా బాగా ఆకట్టుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇకపోతే పూజ హెగ్డే కూడా ఈ సారి గ్లామర్ కంటే కూడా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించింది. గత సినిమాల్లో కంటే కూడా ఈ సినిమాలో చాల అందంగా కనిపించింది పూజ హెగ్డే. ఇకపోతే సీనియర్ హీరో అయిన జగపతి బాబు మళ్ళి విలన్ గా విజ్రుబించాడు అని చెప్పొచ్చు. అలాగే శరత్ కుమార్ ఇంకా సీనియర్ హీరోయిన్ మీనా కూడా తమ తమ పాత్రల ద్వారా ఆకట్టుకున్నారు. అశుతోష్ రానా, రవి కిషన్ లు కూడా తమ విలనిజం తో ఆకట్టుకున్నారు. ఇక మూవీ లో నటించిన వెన్నెల కిషోర్, రావు రమేష్, బ్రహ్మాజీ ఇంకా పవిత్ర లోకేష్ కూడా తమ తమ పాత్రల్లో పర్వాలేదు అనిపించారు.
 
అలాగే మూవీ టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమాకి మాటలు అందించిన సాయి మాధవ్ బుర్రా కొన్ని కొన్ని సీన్స్ కి అయితే చాలా పవర్ ఫుల్ మాటలని రాసాడు. "మహానటి" తరువాత మళ్ళి ఆ రేంజ్ లో ఈయన మాటల ధియేటర్ లో పేలనున్నాయి. మూవీ కి సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన ఆర్థర్ విల్సన్ సినిమా ని తన కెమెరా వర్క్ తో అధ్బుతంగా ప్రెసెంట్ చేసాడు. ఇక హర్షవర్ధన్ రామేశ్వర్ అనే మ్యూజిక్ కంటే కూడా మూవీ కి స్కోరింగ్ బాగా ఇచ్చాడు. ముఖ్యంగా పంచభూతాల మీద చేసిన సాంగ్ తో హర్షవర్ధన్ బాగా ఆకట్టుకున్నాడు. ఇకపోతే మూవీ డైరెక్టర్ శ్రీవాస్ గురించి మాట్లాడుకుంటే ప్రేక్షకుల అంచనాల కి మించి ఈ సినిమాని తెరకెక్కించాడు శ్రీవాస్. కథ లోని పాయింట్ కొంచెం కొత్తగానే ఉన్నా కూడా కథనం పరంగా ఇంకొన్ని సీన్స్ బాగా రాసుకుంటే వర్క్ అవుట్ అయ్యేది అనిపించింది. సెకండ్ హాఫ్ కంటే కూడా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. శ్రీవాస్ గత చిత్రాల తో పోలిస్తే ఈ సినిమా చాల బెటర్ అని చెప్పొచ్చు. ఇకపోతే అభిషేక్ పిక్చర్స్ వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. మూవీ ని చాలా రిచ్ గా హై క్లాస్ లో తెరకెక్కించారు వీళ్ళు.
 
మొత్తంగా చూసుకుంటే ఒక మంచి పాయింట్ కొంచెం ఎక్కువ నిడివితో బోర్ కొట్టే ఛాన్స్ ఉంది, సినిమా నిడివి విషయం పక్కన పెడితే "సాక్ష్యం" సినిమా మాత్రం కొన్ని సీన్స్ కోసం హాయిగా చూడొచ్చు, ముఖ్యంగా వారణాసి సీక్వెన్స్ అయితే బాగుంది. ఫైనల్ గా ఒక మంచి పాయింట్ తో వచ్చి కథనం వాళ్ళ రొటీన్ బ్యాక్ డ్రాప్ లోకి వెళ్లిపోయింది "సాక్ష్యం". 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.