సర్కార్ రివ్యూ..!

Breaking News

హోమ్        న్యూస్

sarkar movie review
Updated:  2018-11-06 12:25:06

సర్కార్ రివ్యూ..!

విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం సర్కార్. ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. ఈ చిత్రాన్ని అదే పేరుతో నిర్మాత అశోక్ వల్లభనేని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.. నేడు విడుదల అయినా ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.. 
 
విజయ్ హీరోగా ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం సర్కార్ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. పొలిటికల్ సిస్టంలోని లోపాలను ఎత్తి చూపుతూ..... ఒక సందేశాత్మక చిత్రంగా మురుగదాస్ ఈ చిత్ర కథను అల్లారు. విజయ్ అభిమానులు మెచ్చే మాస్ఎలిమెంట్స్, ఎమోషనల్ కంటెంట్ మిస్ కాకుండా సినిమాను ఒక మంచి వినోదాత్మక చిత్రంగా మలిచారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఫారిన్ లో కార్పోరేట్ కంపెనీ సిఈఓ అయిన సుందర్ తన ఓటు హక్కు వినియోగించు కునేందుకు ఇండియా వస్తాడు. కాని అతని ప్లేస్ లో ఎవరో తన ఓటు వేసినట్టు గుర్తిస్తాడు.
 
అప్పటి నుండి పొలిటిషియన్స్ మీద పగ బట్టిన సుందర్ ఎలక్షన్స్ రద్దు చేయిస్తాడు. అంతేకాదు తాను కూడా ఓ పార్టీ పెట్టి ఎన్నికల్లో నిలబడతాడు. ఇంతకీ సుందర్ అసలు టార్గెట్ ఏంటి..? అతను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు..? చివరకు ఏమైంది అన్నది సినిమా కథ. ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ కథలో విజయ్ దుమ్ముదులి పేశాడు అంటున్నారు ప్రేక్షకులు.. విజయ్ ఫ్యాన్స్ అసలు సిసలు పండుగ సర్కార్ మూవీ అని.. విజయ్-మురుగదాస్ మాస్ కాంబోకి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ పడింది. సర్కార్ పవర్ ప్యాక్డ్ పొలిటికల్ పంచ్ మూవీ. ఇలాంటి చిత్రాన్ని మిస్ కాకూడదు అంటూసినిమా చూసినవారు చెప్తున్నారు.. హీరోయిన్ కీర్తి సురేష్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రం తన పాత్ర వరకు న్యాయం చేసింది.