సవ్యసాచి రివ్యూ...హిట్టా.. ఫ‌ట్టా..

Breaking News

హోమ్        న్యూస్

savya sachi
Updated:  2018-11-02 01:02:46

సవ్యసాచి రివ్యూ...హిట్టా.. ఫ‌ట్టా..

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై చందు మొండేటి దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ సి వి ఎం సంయుక్తంగా నిర్మిస్తోన్న డిఫరెంట్ కథా చిత్రం సవ్యసాచి. వెర్సటైల్ యాక్టర్ మాధవన్, భూమిక, ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి స్వరవాణి ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందించారు.  కాగా ఈ చిత్రం నేడు రిలీజ్ కాగా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.. 
 
పక్కా కమర్షియల్ అండ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సవ్యసాచి కథ విషయానికొస్తే విక్రమ్ ఆదిత్య ట్విన్ వానిషింగ్ సిండ్రోమ్ అనే ఒక జబ్బుతో బాధపడుతుంటాడు. అతడు తన అక్క తో ఉంటుంటాడు. ఈ క్రమంలో కాలేజీలో చదుకునే చిత్ర ను చూసి ప్రేమిస్తాడు ఆదిత్య. కట్ చేస్తే.. ఆదిత్య మేనకోడలు కిడ్నాప్‌కు గురవుతుంది. ఈ కిడ్నాప్ చేసింది ఎవరు అనే మిస్టరీని చేధించే పనిలో ఆదిత్య ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు..? ఈ కిడ్నాప్‌ను ఎవరు, ఎందుకు చేశారు..? ఆదిత్యతో వారికి ఉన్న సంబంధం ఏమిటి అనేది సినిమా కథ. ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని కమర్షియల్ ఫార్మెట్ లో తెరకెక్కించడమంటే కత్తిమీద సాములాంటిది.
 
సవ్యసాచి చిత్రంతో అలాంటి సాహాసమే చేశాడు దర్శకుడు చందూ మొండేటి. రాసుకున్న కథ బాగున్నప్పటికీ దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం ప్రేక్షకులను మెప్పించడంలో వెనుకబడింది. యాక్షన్, థ్రిల్, సస్పెన్స్ లాంటి అంశాలను సరిగా హ్యాండిల్ చేయడంలో చందూ ఫెయిల్ అయ్యాడు. స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం చందూ మెప్పించాడు. అయితే ఫ్లాట్‌గా సాగిపోయే నెరేషన్ సినిమాకు పెద్ద మైనస్ అని చెప్పాలి.సవ్యసాచి కథ మరీ కొత్తదేం కాదుగానీ.. నడిపించిన తీరు కొంత ఇంట్రెస్టింగ్ ఉంది. చైతూ ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. తన గత సినిమాలతో పోల్చుకుంటే యాక్టింగ్ పరంగా మెచ్యూరిటీ పెరిగిందని చెప్పాలి. ఇక ఈ సినిమాకు అసలుసిసలు ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా మాధవన్ అనే చెప్పాలి.
 
హీరోగా మనకు మాధవన్ సుపరిచితుడే. కానీ తొలిసారి తెలుగులో విలన్ పాత్రలో చెలరేగిపోయాడు. అతడి యాక్టింగ్ లెవెల్స్‌కు ఆడియెన్స్ ఇంప్రెస్ అవుతారు. ఓవరాల్ గా సినిమా పై మిక్స్డ్ టాక్ వస్తుడ్ని..చైతూ - చందు కాంబోలో మరో బ్లాక్ బస్టర్ పండిందని అంటున్నారు. మరికొంతమంది మాత్రం కాన్సెప్ట్ కొత్తగా ఉంది కాని.. నేరేషన్ పాతదే అని , ఈ కథ కు నాగ చైతన్య కాకుండా వేరే వాళ్లు ఎవరైనా చేసుంటే ఇంకా బాగుండేది అంటూ ట్వీట్లు చేస్తున్నారు. మొత్తం మీద మాత్రం సినిమాకు చాలామంది పాజిటివ్ టాకే చెపుతున్నారు.

షేర్ :

Comments

0 Comment