శ్రీనివాస కళ్యాణం

Breaking News

హోమ్        న్యూస్

srinivasa kalyanam
Updated:  2018-08-09 16:43:36

శ్రీనివాస కళ్యాణం

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫ్యామిలీ సినిమాలు తగ్గిపోతున్నాయ్ అని అందరూ అనుకునే టైం లో దిల్ రాజు వంటి ప్రొడ్యూసర్ వచ్చి మళ్ళి ఫ్యామిలీ ఎమోషన్స్ తో సినిమాలు తియ్యడం స్టార్ట్ చేసాడు. ఇప్పటికే గత ఏడాది "శతమానంభవతి" అనే సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని అందించాడు. ఆ సినిమాని డైరెక్ట్ చేసిన సతీష్ వేగ్నేశ కి మరో ఛాన్స్ ఇస్తూ నితిన్ ని హీరో గా పెట్టి "శ్రీనివాస కళ్యాణం" అనే సినిమాని ప్రొడ్యూస్ చేసాడు దిల్ రాజు. ఈ సినిమా కూడా పెళ్లి యొక్క విలువలని నేటి యూత్ కి తెలియజేస్తూ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు దర్శకుడు. మరి ఈ సినిమా కూడా "శతమానంభవతి" సినిమా లాగే ఫ్యామిలీ ఆడియన్స్ ని ప్రేక్షకులని ఆకట్టుకుందో లేదో రివ్యూ లో చూద్దాం.
 
ముందుగా కథ విషయంలోకి వెళ్తే సంప్రదాయానికి బంధుత్వాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే కుటుంబంలో పుట్టిన అబ్బాయి శ్రీనివాస్ (నితిన్) చండిఘర్ లో జాబు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే శ్రీ (రాశి ఖన్నా) తో ప్రేమలో పడతాడు, అలా ఇద్దరూ తమ ప్రేమని పెళ్ళికి చెప్పి ఒప్పిద్దాం అనుకుంటారు. కానీ శ్రీ ఏమో ఆర్.కే (ప్రకాష్ రాజ్) కూతురు. ఆర్.కే అనేవాడు తెలుగు రాష్ట్రాల్లోనే టాప్ బిజినెస్ మ్యాన్ గా చలామణి అవుతుంటాడు. అలాంటి అతను కొన్ని కండిషన్స్ మేరకు శ్రీనివాస్ ఇంకా శ్రీ ల పెళ్ళికి ఒప్పుకుంటాడు, అలాగే శ్రీ కూడా పెళ్లి సంప్రాదాయ బద్దంగా జరగాలి మీరే దగ్గరుండి అన్ని పనులు చూసుకోవాలి అని ఆర్.కే దగ్గర మాట తీసుకుంటాడు. అసలు ఇంతకీ ఆర్.కే శ్రీనివాస్ కి పెట్టిన కండిషన్ ఏంటి ? ఆ కండిషన్ శ్రీనివాస కళ్యాణం కి ఎలా అడ్డుగా మారింది. ఫైనల్ గా శ్రీనివాస కళ్యాణం ఎంత సంప్రదాయ బద్దంగా జరిగింది అనేది మిగిలిన కథ.
 
ఇక నటీనటుల గురించి మాట్లాడుకుంటే నితిన్ కెరీర్ లో ఇదొక మంచి క్లీన్ బ్యూటిఫుల్ సినిమా అని చేపోచ్చు. ఇప్పటి వరకు మనం నితిన్ ని ఇలాంటి ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో చూడకపోవడం వల్ల నితిన్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా మారాడు. సినిమా మొత్తంలో నితిన్ నటన ఎలా ఉన్న గాని క్లైమాక్స్ కి వచ్చే సరికి మాత్రం చాలా పరిణితితో నటించాడు.ఇకపోతే రాశి ఖన్నా కొంచెం గ్లామర్ షో నుంచి బయటకి వచ్చి చాలా కంఫర్ట్ జోన్ లో నటించింది అనిపించింది. ఇక టాప్ బిజినెస్ మెన్ అయిన ఆర్.కే గా ప్రకాష్ రాజ్ తనదైన నటనతో మెప్పించాడు. సినిమా మొత్తం లో నటన పరంగా ఎక్కువ మార్క్స్ వేయాల్సి వస్తే ప్రకాష్ రాజ్ కి వేయొచ్చు. ఇక నితిన్ నానమ్మ గా జయసుధ తనకి అలవాటు అయిన పాత్రలో మెప్పించింది. అలాగే రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్, ఆమని, ప్రియ, సత్యం రాజేష్, ప్రవీణ్, సితార తమ తమ పాత్రల్లో మెప్పించారు.
 
ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే ముందుగా మాట్లడుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జే మేయర్ గురించి...ముఖ్యంగా మిక్కి జే మేయర్ ఇచ్చిన టైటిల్ సాంగ్ ఈ సినిమాకే హై లైట్ గా నిలుస్తుంది. మిగతా అన్ని సాంగ్స్ అంత వినసొంపుగా లేకున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం మిక్కి జే మేయర్ తన పనితనాన్ని చూపించాడు. ఒక ఫ్యామిలీ సినిమాకి ఏ రేంజ్ లో మిక్సింగ్ కావాలో అదే రేంజ్ లో మిక్సింగ్ ని చేసి ఇచ్చాడు. అలాగే సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి తో తన కెమెరా వర్క్ ద్వారా మూవీని చాలా బ్యూటిఫుల్ గా చూపించాడు. పల్లెటూరి లో సన్నివేశాల్ని అలాగే పెళ్లి తాలూకు సీన్స్ ని కూడా బాగా ప్రెసెంట్ చేసాడు సమీర్ రెడ్డి.
 
ఇకపోతే దర్శకుడు ఇంకా రచయిత అయిన సతీష్ వేగ్నేశ గురించి మాట్లాడుకోవాలి. రచయిత గా కథ పాతగా రాసుకున్న సతీష్ కథనాన్ని కూడా అలాగే రాసుకొని సినిమాని చాలా నెమ్మదిగా నడిపించాడు, కానీ క్లైమాక్స్ లో మాత్రం పెళ్లి యొక్క గొప్పతనాన్ని చెప్పే సన్నివేశాన్ని మాత్రం చాలా బాగా తెరకెక్కించాడు సతీష్. ఈ సినిమాలో అక్కడక్కడ కొన్ని "శతమానంభవతి" తాలూకు సన్నివేశాలు గుర్తొచ్చినా గాని పెద్దగా ఆశ్చర్యపోనకర్లేదు. రచయిత కొంత వరకు సినిమాని బాగానే నడిపించిన సతీష్ డైరెక్టర్ గా ఇంకాస్త పనితనాన్ని చూపించి ఉంటే బాగుండు అనిపించింది. ఇదిలా ఉంటే దిల్ రాజు మళ్ళి తనకి అలవాటు అయిన పద్ధతి లో ఒక ఫ్యామిలీ సినిమాని ప్రొడ్యూస్ చేసాడు, కానీ కొన్ని చోట్ల మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గాయి అనిపించక మానదు.
 
ఇకపోతే "శతమానంభవతి" తరువాత దిల్ రాజు నుంచి మరో ఫ్యామిలీ సినిమా కాబట్టి ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆ అంచనాల్ని అందుకోలేక పోయినగాని పర్వలేదు అనిపిస్తుంది. ఇంకా ఏదైనా పండగ సమయం లో ఈ సినిమా ని రిలీజ్ చేసి ఉంటే సినిమాకి ఇంకా ప్లస్ పాయింట్ అయ్యేది. మొత్తానికి ఫ్యామిలీ అంతా కలిసి ఒక సారి హాయిగా చూసోచ్చే సినిమాగా "శ్రీనివాస కళ్యాణం" ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.