తొలిప్రేమ‌ రివ్యూ

Breaking News

హోమ్        న్యూస్

Updated:  2018-02-10 12:14:01

తొలిప్రేమ‌ రివ్యూ

నిర్మాణ సంస్థ‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌
తారాగ‌ణం: వ‌రుణ్ తేజ్‌, రాశీ ఖ‌న్నా, సుహాసిని, సప్న ప‌బ్బి, ప్రియ‌ద‌ర్శి, హైప‌ర్ ఆది, విద్యుల్లేఖా రామన్ త‌దిత‌రులు
కూర్పు: న‌వీన్ నూలి
సంగీతం: ఎస్‌.త‌మ‌న్‌
ఛాయాగ్ర‌హ‌ణం: జార్జ్ సి.విలియ‌మ్స్‌
నిర్మాత‌: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌
క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: వెంకీ అట్లూరి
 
బాబాయ్ టైటిట్ లో సినిమా చేస్తున్నాడు వ‌రుణ్ అన‌గానే మెగా ఫ్యాన్స్ కి ఎంతో ఆనందం వచ్చింది.. డిఫ‌రెంట్ మూవీస్ తో మెగా ఫ్యామిలీలో త‌న కంటూ ప్ర‌త్యేక స్ధానం సంపాదించుకున్నాడు.. కంచె - ఫిదా సినిమాలు వ‌రుణ్ కు బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చాయి.. ఇక ఈ ఏడాది తొలి ప్రేమ‌తో మ‌న ముందుకు వ‌చ్చాడు. ఓసారి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
 
క‌థ‌:
ఆదిత్య (వరుణ్ తేజ్‌) కాలేజ్ టాప‌ర్‌.. తాను క‌రెక్ట్‌గానే ఆలోచించి ఏ ప‌నైనా చేస్తాను అని అంటాడు.. అందులో ఏ త‌ప్పు ఉండ‌ద‌నుకునే మ‌న‌స్ద‌త్వం క‌లిగిన యువ‌కుడు. ఇలాంటి మ‌న‌స్థత్వం ఉన్న ఆదిత్య ఓసారి  ట్రెయిన్ జ‌ర్నీలో వ‌ర్ష (రాశీ ఖ‌న్నా)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. వ‌ర్ష‌కు  తన ప్రేమ‌ను దాచుకోకుండా చెప్పేస్తాడు. ఇద్ద‌రు ఇంజ‌నీరింగ్ కోసం ఒకే కాలేజ్‌లో జాయిన్ అవుతారు. ఆదిత్య ప్రేమ‌కు వ‌ర్ష గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుంది. అయితే ప‌రిస్థితుల కార‌ణంగా ఇద్ద‌రూ విడిపోతారు. ఆరేళ్ల త‌ర్వాత ఒకే కంపెనీలో లండ‌న్‌లో ఇద్ద‌రూ క‌లుస్తారు. అప్పుడు వారి మాన‌సిక సంఘ‌ర్షణ ఏంటి? ఇద్ద‌రూ మ‌ళ్లీ క‌లుసుకుంటారా? వీరి ప్రేమ ఏమౌతుంది? అనేదే వెండితెర‌పై చూడాలి.
 
విశ్లేష‌ణ‌:
కంచె- ఫిదా సినిమాలు వ‌రుణ్ కు మంచి స‌క్సెస్ ను అందించాయి.. న‌ట‌న‌లో వ‌రుణ్ త‌న‌కంటూ ఓ స్దానాన్ని సంపాదించుకున్నాడు ఈ రెండు చిత్రాల ద్వారా.. ఇక వెంకీ అట్లూరితో ఈ సినిమాలో కూడా త‌న న‌ట‌న‌లో విభిన్న‌త‌ను చూపించాడు వ‌రుణ్... ఈ సినిమాలో ల‌వ‌ర్ బాయ్ గా బాగా అల‌రించాడు.
 
ఇక వ‌ర్ష పాత్రలో రాశిఖన్నా బాగా న‌టించింది... త‌న హావ‌భావాలు, కారులోని రొమాంటిక్ సీన్ అన్నీ యూత్‌ను, సగటు ప్రేక్ష‌కుల‌కు ఆక‌ట్టుకున్నాయి... అలాగే సినిమాలో స్వ‌ప్న ప‌బ్బి పాత్ర చిన్న‌దే అయినా ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది.
జ‌జ‌ర్‌ద‌స్త్‌ ఆది, సుహాసిని, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌తో  సినిమాలో బాగా ఆక‌ట్టుకున్నారు. ఇక‌ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి త‌న మార్క్ చూపించాడు.. మంచి ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ తెర‌కెక్కించారు...త‌మ‌న్ సంగీతం బాగుంది.. నిర్మాణ విలువలు ఎక్క‌డా త‌గ్గలేదు.. అద్బుత‌మైన ఫీల్ గుడ్ మూవీ యువ‌త‌కు ఈ సినిమా.
 
బ‌లాలు:
బ‌లమైన క‌థ‌ 
వ‌రుణ్ న‌ట‌న 
సినిమాటోగ్ర‌ఫీ
సంగీతం
పాటలు
 
బ‌ల‌హీన‌త‌లు:
కామెడీ లోటు
 
 
 రేటింగ్‌: 2.75 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.