టచ్ చేసి చూడు రివ్యూ

Breaking News

హోమ్        న్యూస్

Updated:  2018-02-02 01:07:32

టచ్ చేసి చూడు రివ్యూ

నిర్మాణ సంస్థ‌: శ్రీ ల‌క్ష్మి న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్‌
తారాగ‌ణం: ర‌వితేజ‌, రాశిఖ‌న్నా, సీర‌త్‌క‌పూర్‌, ఫ్రెడ్డీ దారువాలా, ముర‌ళీశ‌ర్మ‌, స‌త్యం రాజేష్‌, జ‌య‌ప్ర‌కాష్ త‌దిత‌రులు
సంగీతం: జామ్ 8
సినిమాటోగ్ర‌ఫీ: రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌, ఛోటా కె.నాయుడు
క‌ళ‌: ర‌మ‌ణ వంక‌
క‌థ‌: వ‌క్కంతం వంశీ
మాట‌లు: దీప‌క్ రాజ్‌
నిర్మాత‌లు: న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, వ‌ల్ల‌భ‌నేని వంవీ
ద‌ర్శ‌క‌త్వం: విక్ర‌మ్ సిరికొండ‌
 
!! ఇంట్రో !!
 
మాస్ మ‌హారాజ్ ర‌వితేజ ఈ పేరు చెబితేనే ఓ హై వోల్టేజ్ వ‌స్తుంది ఆయన అభిమానుల‌కు... రైమింగ్  టైమింగ్ స్టార్ గా కూడా చెప్ప‌వ‌చ్చు ర‌వితేజ‌ను.. గ‌త ఏడాది రాజాది గ్రేట్ వంటి గుడ్ ఫిలిమ్ తో వ‌చ్చిన ర‌వితేజ, ఇప్పుడు తాజాగా ట‌చ్ చేసి చూడు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.. ఈ చిత్రంలో కూడా త‌న‌కు ఎంతో పేరు తెచ్చిన పోలీస్ పాత్ర‌లో న‌టించారు మాస్ మ‌హారాజ్.. అయితే వెండితెర‌పై నేడు ఎటువంటి మ్యాజిక్ చేశాడో ఓలుక్కెద్దాం 
 
 
 !! క‌థ !!
 
పాండిచ్చేరిలో నివ‌సించే కార్తికేయ ఇండ‌స్ట్రీస్ అధినేత కార్తికేయ !! ర‌వితేజ‌!!  కి కుటుంబం అంటే చాలా ప్రేమ‌. కుంటుంబానికి చెడ్డ పేరు తెచ్చే ఏ ప‌ని చేయ‌కూడ‌ద‌ని అనుకునే స్వ‌భావి. ర‌వితేజ తండ్రి !! జ‌య‌ప్ర‌కాష్‌!! కి కొడుకు పెళ్లి చేసుకోవ‌డం లేద‌నే బాధ ఉంటుంది. తండ్రి బాధ‌ను చూడ‌లేక పెళ్లి చేసుకోవాలనుకుంటాడు ర‌వితేజ‌. అందుకోసం పుష్ప‌!! రాశిఖ‌న్నా!! ను పెళ్లి సంబంధంలో చూస్తాడు. లేడీస్‌తో ఎలా మాట్లాడో తెలియ‌ని కార్తికేయ, పుష్ప‌ను రెండు సార్లు హర్ట్ చేస్తాడు. దాంతో పుష్ప కార్తికేయ‌ను పెళ్లి చేసుకోన‌ని చెబుతుంది 
 
 
కానీ ఆమెకు కార్తికేయ అంటే ప్రేమ ఉంటుంది. వేరే అమ్మాయితో జరిగే పెళ్లి సంబ‌ధాన్ని కూడా పుష్ప అబ‌ద్ధాలు చెప్పి క్యాన్సిల్ చేయిస్తుంది.ఆ విష‌యం తెలిసిన కార్తికేయ పుష్ప‌ను పెళ్లి చేసుకోన‌ని అంటాడు. క‌థ ఇలా జ‌రుగుతుండ‌గా.. కార్తీకేయ కంపెనీకి వ‌చ్చే మిష‌న‌రీస్‌ను సెల్వమ్ అనే గూండా రాకుండా అడ్డుకుని త‌న‌తో తీసుకెళ్లిపోతాడు. ఈ విష‌య‌మై కార్తికేయ పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చినా ప‌ట్టించుకోరు. రెండు నిమ‌షాల్లో స‌మ‌స్య‌ను క్లియ‌ర్ చేయ‌వ‌చ్చునని.. కానీ పోలీసులు స‌మ‌స్య‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటారు. 
 
దాంతో పోలీసులు కార్తికేయ‌కు రెండు నిమిషాల స‌మ‌యం ఇచ్చి స‌మ‌స్య‌ను తీర్చుకోమంటారు. కార్తికేయ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌తాడు. అదే స‌మ‌యంలో సెల్వ‌మ్ గ‌తంలో చేసిన నేర చ‌రిత్ర అంతా చెప్పేస్తాడు. దాంతో సెల్వ‌మ్‌కి కార్తికేయ ఎవ‌ర‌ని సందేహం వ‌స్తుంది. ఇలాంటి స‌మ‌యంలో కార్తికేయ కంపెనీలో ప‌నిచేసే స‌త్య‌ను ఎవ‌రో హత్య చేస్తారు. ఆ హ‌త్య‌ను కార్తికేయ చెల్లెలు చూసి పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తుంది. ఆమె ఇచ్చిన ఆధారాల‌తో పోలీసులు నిందుతుడి ఫోటోను గీయిస్తారు. అది ఇమ్రాన్ అని తెలుస్తుంది. కానీ ఇమ్రాన్ చ‌నిపోయి రెండు సంవ‌త్స‌రాలైంద‌ని పోలీసు రికార్డుల్లో ఉంటుంది. అదే స‌మ‌యంలో ఇమ్రాన్ బ్ర‌తికే ఉన్నాడ‌నే నిజం కార్తికేయ‌కు తెలుస్తుంది. వెంట‌నే హైద‌రాబాద్ క‌మీష‌న‌ర్‌కి ఫోన్ చేసి అస‌లు విష‌యం తెలుసుకున్న కార్తికేయ ఏం చేస్తాడు? అస‌లు కార్తికేయ‌కి, ఇమ్రాన్‌కి ఉన్న రిలేష‌న్ ఏంటి?  కార్తికేయ గ‌తం ఏమిటి అనేది తెలియాలి అంటే వెండితెర‌పై ఈ చిత్రం చూడాల్సిందే.
 
!! విశ్లేష‌ణ !!
 
న‌ట‌న ప‌రంగా ర‌వితేజ అద్బుతంగా న‌టించారు ఇందులో సందేహాం లేదు అయితే పాత చింత‌కాయ ప‌చ్చ‌డి క‌థ అని కొంద‌రు అనుకుంటారు.. కాని క‌థ‌నంలో కొన్ని ట్విస్టులతో తెర‌కెక్కింది ట‌చ్ చేసి చూడు.. ఇక త‌న ఎన‌ర్జీని చూపాడు ర‌వితేజ, అలాగే టైమింగ్ డైలాగుల‌తో ఆక‌ట్టుకున్నాడు ర‌వితేజ‌.ఇక సినిమాలో హీరోయిన్ల పాత్ర కేవ‌లం గ్లామ‌ర్ కు మాత్ర‌మే ప‌రిమితం అయింది. ఇక వారి పాత్ర‌ల‌లో సీనియ‌ర్లు ఒదిగిపోయారు.. రవితే కోసం ఓ ఫార్మూలాతో సినిమా తీయాలి అని ఓ క‌థ రాసుకున్న‌ట్లు తెలిసిపోతుంది ఈ చిత్రంలో...సినిమాకి  రిచ‌ర్డ్‌, ఛోటా సినిమాటోగ్రఫీ వ‌ర్క్ బావుంది.  జామ్ 8వారి ట్యూన్స్ కంటే నేప‌థ్య సంగీత‌మే ఆక‌ట్టుకుంది. సినిమాలో కొత్త ద‌నాన్ని చూపించాలి అనే పాయింట్ ద‌ర్శ‌కుడు మిస్ అయ్యాడు... ప్ర‌తీ ర‌వితేజ అభిమాని ఈ సినిమాని ట‌చ్ చేస్తారు.
 
 
బ‌లాలు:
ర‌వితేజ న‌ట‌న‌
సినిమాటోగ్ర‌ఫీ
నేప‌థ్య సంగీతం
యాక్ష‌న్ పార్ట్ 
 
 
బ‌ల‌హీన‌త‌లు:
రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ స్టోరీ,
బ‌ల‌మైన క‌థ 
సంగీతం
 
హీరోయిన్స్‌కు గ్లామ‌ర్ కు మాత్ర‌మే ప‌రిమితం అవ్వ‌డం 
 
రేటింగ్ 2.50 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.