విశ్వరూపం 2 సినిమా రివ్యూ

Breaking News

హోమ్        న్యూస్

vishwaroopam 2
Updated:  2018-08-10 12:23:51

విశ్వరూపం 2 సినిమా రివ్యూ

"విశ్వరూపం"...ఈ సినిమా 2013 లో వచ్చి పెద్ద సంచలనం సృష్టించింది. కమల్ హసన్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. మల్లి దాదాపు అయిదేళ్ళ తరువాత ఈ సినిమాకి సీక్వెల్ గా "విశ్వరూపం 2" ని రిలీజ్ చేసాడు కమల్. అసలైతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి, కానీ ఎన్నో అడ్డంకులు ఎడురుకొని ఫైనల్ గా ఈ సినిమా ధియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. మరి సెకండ్ పార్ట్ ని కూడా డైరెక్ట్ చేసిన కమల్ ఈ సినిమా లో కూడా మొదటి భాగంలో లాగే ఉగ్రవాదం పై కంటెంట్ ని క్రియేట్ చేసాడు కమల్ హసన్. మరి కమల్ హసన్ స్వయంగా డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసిన "విశ్వరూపం 2" ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూ లో చూద్దాం.
 
ముందుగా కథ విషయంలోకి వెళ్తే "విశ్వరూపం" కథ ఎక్కడైతే ముగిసిందో ఈ కథ అక్కడే స్టార్ట్ అవుతుంది. డాన్సర్ విశ్వనాధ్ (కమల్ హసన్) అసలు డాన్సర్ కాదు ఇండియన్ సీక్రెట్ రా ఏజెంట్ అయిన విసం అహమద్ కాశ్మీరీ అని రివీల్ అయ్యి కథ కాస్త ఇండియా కి వస్తుంది. ఇప్పుడు రెండవ భాగంలో కూడా తన భార్య నిరుపమ (పూజ కుమార్) అలాగే తన రా పార్టనర్ అయిన ఆశ్మిత (ఆండ్రియా) తో కలిసి మళ్ళి తన మిషన్ ని స్టార్ట్ చేస్తాడు కాశ్మీరీ. ఈ క్రమం లో తనని స్నేహం పేరుతో మోసం చేసిన కాశ్మీరీ పై అలాగే అతని వెంట ఉండే అందరి పై పగ సాధించాలని అని ఒమర్ (రాహుల్ బోస్) ఎదురుచూస్తూ ఉంటాడు. ఫైనల్ గా ఎన్నో అడ్డంకుల తరువాత కాశ్మీరీ ఒమర్ వేసిన ప్లాన్ ని ఎలా దెబ్బ కొట్టి ఒమర్ ని చంపేసి టేర్రరిసం ని ఎలా అంతమందించాడు అనే దానితో కథ ముగుస్తుంది.  
 
ఇక నటీనటుల విషయానికి వస్తే యూనివర్సల్ హీరో అయిన కమల్ హసన్ కి ఇలాంటి క్యారెక్టర్స్ కొట్టిన పిండితో సమానం. ఇప్పటికే "విశ్వరూపం" లో ఇలాంటి పాత్రనే పోషించాడు కాబట్టి ఈ సినిమాలో అదే పాత్ర తాలుకు గుణగణాలని కంటిన్యూ చేసాడు కమల్ హసన్. ఇకపోతే ఇంత సీరియస్ సినిమాలో కూడా తనదైన హ్యుమర్ తో అక్కడక్కడ నవ్వులు పూయించాడు కమల్ హసన్. అలాగే ఆండ్రియా కి ఈ సీక్వెల్ లో మంచి యాక్షన్ సీన్ కూడా ఒకటి లభించింది. రా ఏజెంట్ గా తను బాగా చేసింది. అలాగే పూజ కుమార్ కూడా తనదైన హుందా తనమైన నటనతో ఆకట్టుకుంది. ఇక సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్ర వహీదా రహమాన్ ది. ఈమె సినిమాలో ఉన్నది కాసేపే అయిన కూడా చాలా అధ్బుతంగా నటించింది. ఈ సినిమాలో కమల్ హసన్ తల్లి పాత్రలో ఆమె నటించారు. ఇకపోతే శేఖర్ కపూర్, నాజర్ తమ తమ పాత్రల్లో పర్వాలేదు అనిపించారు.
 
ఇక టెక్నికల్ పరంగా చూసుకుంటే ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించాడు కమల్ హసన్. సినిమాకి సినిమాటోగ్రఫీ అందించిన సను ఇంకా శందత్ తమ పనితీరుతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్ని బాగా షూట్ చేసారు వీరిద్దరూ. జిబ్రాన్ మ్యూజిక్ రెండో పార్ట్ కంటే కూడా మొదటి భాగంలోనే బాగుంది అనిపించింది. ఇకపోతే ఈ సినిమాని తన భుజాల మీద తీసుకెళ్ళిన ఒకేఒక్కడు కమల్ హసన్. తనదైన రచనతో అలాగే దర్శకత్వంతో ప్రేక్షకులని కొంత మేరకు అలరించాడనే చేపోచ్చు. ఫస్ట్ హాఫ్ బాగానే నడిపించిన గాని సెకండ్ హాఫ్ ని వచ్చే సరికి మాత్రం చాలా డల్ అయిపోయాడు కమల్ హసన్. ముఖ్యంగా మతం మీద వచ్చే కొన్ని మాటలని మాత్రం బాగా రాసుకున్నాడు కమల్. ఇక ఈ సినిమాకి నిర్మాత కూడా తానే కాబట్టి సినిమాని విలువలని ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు. ఈ విషయం లో మాత్రం కమల్ ని మెచ్చుకోక తప్పదు.
 
మొత్తంగా చూసుకుంటే "విశ్వరూపం" ని బాగా ఎంజాయ్ చేసిన వారు "విశ్వరూపం 2" అంతగా ఎంజాయ్ చేయలేకపోవచ్చు. ఒకవేళ కమల్ హసన్ అభిమానులు అయితే మాత్రం ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్ గా "విశ్వరూపం" రేంజ్ లో ప్రేక్షకులని మెప్పించాలేకపోయిన "విశ్వరూపం 2". 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.