"వైఫ్ అఫ్ రామ్" మూవీ రివ్యూ

Breaking News

హోమ్        న్యూస్

wife of ram movie review
Updated:  2018-07-20 10:57:37

"వైఫ్ అఫ్ రామ్" మూవీ రివ్యూ

మన తెలుగు లో ఇప్పటి వరకు స్టార్ ఫ్యామిలీస్ నుంచి హీరోలు వచ్చారే గాని హీరోయిన్స్ మాత్రం ఇప్పటి వరకు ఎవరు రాలేదు, కాని మంచు ఫ్యామిలీ నుచి మాత్రం మంచు లక్ష్మి హీరోయిన్ గా మాత్రమే కాకుండా యాంకర్ గా సింగర్ కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో రాణిస్తుంది. అయితే ఇలాంటి మంచు లక్ష్మి రీసెంట్ గా "వైఫ్ అఫ్ రామ్" అనే థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ థ్రిల్లర్ ని కొత్త దర్శకుడు అయిన విజయ్ డైరెక్ట్ చేసాడు. మరి ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాని బాలీవుడ్ సినిమా అయిన "కహాని" తో పోలుస్తున్నారు మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూ లో చూద్దాం.
 
ముందుగా కథ విషయంలోకి వెళ్తే దీక్ష (మంచు లక్ష్మి ప్రసన్న) ఇంకా రామ్ (సామ్రాట్) ఇద్దరు భార్య భర్తలు. వీళ్ళు ఒక రిసార్ట్ కి సరదాగా సమయం గడుపుదాం అని వెళ్తారు. కాని అనుకోకుండా అక్కడ కొండ మీద నుంచి రామ్ కింద పది చనిపోతాడు. దీక్షకి కూడా అక్కడే గాయాలు అవుతాయి ఈ ప్రాసెస్ లో కడుపుతో ఉన్న దీక్ష తన కడుపు పోగొట్టుకుంటుంది. అయితే పోలీస్ విచారణ లో మాత్రం దీక్ష తన భర్తని మర్డర్ చేసారు అని చెప్తుంది. పోలీస్ ఆఫీసర్ అయిన సత్య (శ్రీకాంత్ అయ్యర్) మాత్రం దీక్ష కేసు ని అస్సలు పట్టించుకోడు. ఈ క్రమం లో అదే పోలీస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రమణ చారి (ప్రియ దర్శి) దీక్ష బాధని అర్ధం చేసుకొని దీక్షకి సాయం చేస్తాడు. ఇలా వీళ్ళిద్దరూ కలిసి కేసుని విచారిస్తూ ఈ కేసు కి సంభందించిన ముఖ్య వ్యక్తీ అయిన రాకీ (ఆదర్శ్ బాలకృష్ణ) బ్యాంకాక్ లో ఉన్నాడు అని తెలుస్తుంది. దీక్ష తన తెలివితేటల ద్వారా రాకీ ని హైదరబాద్ కి రప్పిస్తుంది. ఈ లోపు దీక్ష పై రెండు సార్లు హత్య ప్రయత్నం కూడా జరుగుతుంది. అసలు రామ్ ని హత్య చేసింది ఎవరు? అలాగే దీక్ష ని హత్య చేయడానికి ట్రై చేసింది ఎవరు ? అలాగే రాకీ కి ఈ హత్య కి ఉన్న సంభందం ఏంటి అనేదే మిగిలిన కథ.
 
ఇక నటీనటుల విషయానికి వస్తే "ఊ కొడతార ఉలిక్కి పడతార" అనే సినిమాతో ఆల్రెడీ గా నటిగా తనేంటో నిరూపించుకుంది మంచు లక్ష్మి. కాని ఒక థ్రిల్లర్ సినిమాలో మాత్రం మంచు లక్ష్మి నటించడం ఇదే తొలిసారి. భర్త చావుకి ఎవరు కారణమయ్యరో అని తెలుసుకునే పాత్రలో మంచు లక్ష్మి బాగా చేసింది. ఇంకా చెప్పాలి అంటే సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసుకొచ్చింది మంచు లక్ష్మి. అలాగే మంచు లక్ష్మి భర్త పాత్ర పోషించిన సామ్రాట్ నిడివి తక్కువే అయిన కూడా పర్వాలేదు అనిపించాడు. కాని సామ్రాట్ కి భర్త గా ఇంకొంచెం నిడివి ఉండి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇకపోతే అన్యానమైన పోలీస్ ఆఫీసర్ గా శ్రీకాంత్ అయ్యర్ తన పాత్ర మేరకు అధ్బుతంగా నటించాడు. ప్రియ దర్శి కూడా ఈ సారి కామెడీ కి భిన్నంగా ఒక కొత్త పాత్రలో నటించి ఇలాంటి సీరియస్ పాత్రలకి కూడా తానూ సెట్ అవుతాను అన్నట్టు నిరూపించాడు. అలాగే ఆదర్శ్ బాలకృష్ణ గురించి పెద్దగా చెప్పుకోడానికి ఏమి లేదు.
 
ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే సమాల భాస్కర్ ఈ సినిమా ని తన కెమెరా వర్క్ తో ఒక థ్రిల్లర్ లుక్ ని తీసుకొని వచ్చాడు. మూవీ మొత్తాన్ని ఒక టెంపో క్యారీ చేస్తూ కథని బాగా తీసుకెళ్ళాడు. ఇక రఘు దీక్షిత్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఒక థ్రిల్లర్ కి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అవసరమో అలాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని ఈ థ్రిల్లర్ కి అందించాడు రఘు దీక్షిత్. కాని ఈ థ్రిల్లర్ సినిమాలో ఒక్క పాట కూడా లేదు. ఇకపోతే ఎడిటర్ బిక్కిన తమ్మిరాజు ఈ కథని ఇంకాట్రిమ్ చేసి చెప్తే బాగుంటుంది అనిపించింది. కొన్ని కొన్ని చోట్ల మాత్రం చాలా షార్ప్ కట్స్ వేసి ల్యాగ్ లేకుండా చూసుకున్నాడు. ఇక ఒక థ్రిల్లర్ తో దర్శకుడిగా పరిచయం అయిన రఘు దీక్షిత్ గురించి మాట్లాడుకోవాలి. ఒక మెసేజ్ ఓరియెంటెడ్ కథ రాసుకొని దానికి కమర్షియల్ హంగులు అద్ది కథనం నడిపించాడు విజయ్ ఎలికంటి. కథనాన్ని కాస్త స్లో గా తీసుకెళ్ళిన గాని లాస్ట్ వరకు ఆ సస్పెన్స్ ఎలిమెంట్ మాత్రం ఎక్కడా పోనివ్వలేదు విజయ్. కాని కథనాన్ని ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే ఈ సినిమా కంప్లీట్ థ్రిల్లర్ అయ్యేది. 
 
మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా ద్వారా సమాజానికి ఒక మెసేజ్ ఇస్తూ ఆలాగే థ్రిల్లర్ ఎలిమెంట్ కి కూడా అందించాడు విజయ్, కాని ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ అనేది ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉంటె బాగుండేది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లాంటి సినిమాలు కాకుండా మామూలు థ్రిల్లర్స్ అంటే నచ్చే వాళ్ళు ఈ సినిమాపై ఒక లుక్ వేసి రావొచ్చు.  
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.