కుష్బూ పైకే సు న‌మోదు

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-02-04 04:00:46

కుష్బూ పైకే సు న‌మోదు

త‌మిళ‌నాడులోని నెల్లై జిల్లా ముక్కూడల్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఓ  సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ స‌మావేశానికి
 కాంగ్రెస్ నాయ‌కురాలు, సినీన‌టి కుష్బూతో, పాటు ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కులు  హ‌జ‌ర‌య్యారు. అయితే ఈ కార్య‌క్ర‌మానికి త‌మ‌కు ఆహ్వానం అందలేదని కొంద‌రు కాంగ్రెస్ నాయ‌కులు స‌మావేశం ద‌గ్గ‌ర‌ నిర‌స‌న‌కు దిగారు.  వారిలో మాజీ మంత్రి ధనుష్‌కోఠి ఆదిత్య, సహా జిల్లా కాంగ్రెస్‌ నేతలు కూడా ఉన్నారు.
 
స‌మావేశానికి హ‌జ‌రైన సీనియ‌ర్ నాయ‌కుల‌కు, నిర‌స‌న‌కు దిగిన నాయ‌కుల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివ‌ర‌కు
మాజీ మంత్రి ధనుష్‌కోఠి ఆదిత్యకు న‌చ్చ‌జెప్పి స‌మావేశం నిర్వ‌హించుకున్నారు.  ఈ సంద‌ర్భంగా కుష్బూ మాట్లాడుతూ..
పార్టీ కోసం నిరంత‌రం క‌ష్ట‌ప‌డుతున్నా... కొంద‌రు నాయ‌కులు దాన్ని గుర్తించ‌క‌పొవ‌డం బాధ క‌లిగిస్తుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అధికారంలో వున్న బీజేపీని ఎదుర్కోవ‌డానికి మ‌న అంద‌రం క‌లిసి పొరాడాల‌ని పిలుపునిచ్చారు.
 
ఈ సమావేశానికి పోలీసులు రాత్రి 10 గంటల వరకే అనుమ‌తి ఇచ్చారు. అనుమ‌తి ఇచ్చిన స‌మ‌యం త‌ర్వాత కూడా  పార్టీ సమావేశం నిర్వహించినందుకుగానూ  కుష్బూతో పాటు కాంగ్రెస్ పార్టీ  నేతలపై ఐపీసీ 143, 188 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.