ఐపీఎల్ వేలంలో అనూహ్య ప‌రిణామాలు

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-01-27 04:06:21

ఐపీఎల్ వేలంలో అనూహ్య ప‌రిణామాలు

బెంగళూరులో ఐపీఎల్‌ 11వ సీజన్ అట‌గాళ్ల‌ వేలం ర‌స‌వ‌త్త‌క‌రంగా కొన‌సాగింది. ఈ సీజన్‌లో యువ అట‌గాళ్ల‌కు ప్రాధాన్యం ఇచ్చారు ఫ్రాంచైజీ యాజమాన్యాలు. ఇందులో మొదటిగా భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ జాక్‌పాట్ కొట్టాడు. అతడిని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు రూ. 11 కోట్లకు కొనుగోలు చేసింది. కర్నాటక బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్‌ను రూ. 5.60 కోట్లు ప‌లికాడు.

టీ20 విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌, వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌ను కొనుగోలు చేసుకునేందుకు ఏ ఒక్క ఫ్రాంఛైజీ ఆసక్తి చూపకపోవడం గ‌మ‌నార్హం. గత ఏడాది ఐపీఎల్‌ వేలంలో రూ.14.5 కోట్లకు అమ్ముడుపోయిన స్టోక్స్‌ ఈ ఏడాది 12.5 కోట్లు ప‌లికాడు.

బెన్‌ స్టోక్స్‌ - రాజస్థాన్‌ రాయల్స్‌ - రూ.12.5 కోట్లు

మనీష్ పాండే - సన్‌రైజర్స్ హైదరాబాద్- రూ. 11 కోట్లు

క్రిస్ లిన్ - కోల్‌కతా నైట్‌రైడర్స్- రూ. 9.60 కోట్లు

మిచెల్‌ స్టార్క్‌ - కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ - రూ.9.4 కోట్లు

రవిచంద్రన్‌ అశ్విన్‌ - కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ - కూ.7.6 కోట్లు

అరోన్ ఫించ్ - కింగ్స్ ఎలెవెన్ పంజాబ్- రూ. 6.20 కోట్లు

కరుణ్ నాయర్ - కింగ్స్ ఎలెవెన్ పంజాబ్- రూ. 5.60 కోట్లు

కీరన్‌ పొలార్డ్‌ - ముంబయి ఇండియన్స్‌ - రూ.5.4 కోట్లు

శిఖర్‌ ధావన్‌ - సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-రూ.5.2 కోట్లు

అజింక్య రహానె - రాజస్థాన్‌ రాయల్స్‌ - రూ.4 కోట్లు

మెక్‌కల్లమ్ - బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్- రూ. 3.60 కోట్లు

డేవిడ్ మిల్లర్ - కింగ్స్ ఎలెవెన్ పంజాబ్- రూ. 3.0 కోట్లు

షకీబ్‌ ఆల్‌ హాసన్‌ - సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ - రూ.2 కోట్లు

డూప్లిసిస్‌ - చెన్నై సూపర్‌ కింగ్స్‌ - రూ.1.6కోట్లు

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.