సోషల్ మీడియాకు దొరికిన మోడి

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-01-27 12:25:41

సోషల్ మీడియాకు దొరికిన మోడి

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డానికి మోడి ఉప‌యోగించిన వాటిలో ప్ర‌ధాన ఆయుధం సోషల్ మీడియా. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడ ప్ర‌జ‌ల‌కు సోషల్ మీడియా ద్వారా నిరంత‌రం అందుబాటులో ఉంటున్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడి. అలాగే మోడి కేబినెట్‌లో ఉన్న మంత్రులు కూడా సోషల్ మీడియా ద్వారా వ‌చ్చిన ప్ర‌జా స‌మ‌స్య‌ల‌కు స్పందించి వాటిని వెంట‌నే ప‌రిష్క‌రిస్తున్నారు.

విష‌యంలోకి వ‌స్తే దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ప్రధాని మోడీ ప్రసంగంలో చిన్న త‌ప్పు జరిగింది. భారత్ లో 600 కోట్ల మంది ఓటర్లు ఉన్నారంటూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్లీనరీ సెషన్ లో మోడీ తన ప్రసంగంలో తెలిపారు. సుమారు మూడు దశాభ్ధాల తర్వాత 600 కోట్ల భారతీయ ఓటర్లు ఒక‌ రాజకీయ పార్టీకి పూర్తి మెజారిటీతో కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి అవ‌కాశం ఇచ్చారని తన ప్రసంగంలో మోడీ అన్నారు.

ఈ పొర‌పాటును గ‌మ‌నించ‌కుండా పీఎంఓ కార్యాలయం కూడ‌ అధికారిక ట్విట్టర్ ఎకౌంట్ లో పొస్ట్ చేసింది. అయితే త‌ప్పును గ‌మ‌నించి తొలిగించే లోపు లైక్‌లు, షేర్లు చేశారు. భార‌త‌దేశంలో ఈసి లెక్క‌ల ప్ర‌కారం 2014కు రిజిస్టర్ అయిన ఓటర్ల సంఖ్య 81.45 కోట్లు మాత్రమే. అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్ననెటిజ‌న్లు విరుచుకుప‌డ్డారు.

నియంతృత్వంగా నోట్ల‌ర‌ద్దు, జీఎస్టీ లాంటి సంస్క‌ర‌ణ‌లు తెచ్చిన మోడి పై వ్య‌తిరేక వాద‌న‌లు వ్యంగ్యాస్త్రాలతో విమ‌ర్శించారు. అయితే వ్యంగ్యంగా ప్ర‌పంచ జ‌నాభా మొత్తం ఓట్లు వేసారా... లేక‌పొతే భార‌తదేశ ఓట‌ర్ల‌లో ఆవులు కూడ చేరాయా.. అంటూ సోషల్ మీడియాలో మోడీని ఒక ఆట ఆడుకున్నారు నెటిజ‌న్లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.