శ్రీకాంత్ కు ప‌ద్మశ్రీ

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-01-26 03:12:23

శ్రీకాంత్ కు ప‌ద్మశ్రీ

గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌ష్క‌రించుకుని 85 మంది ప్ర‌ముఖుల‌కు ప్ర‌తిష్టత్మ‌క ప‌ద్మ పుర‌ష్కారాల‌ను ప్ర‌క‌టించింది కేంద్ర ప్ర‌భుత్వం.తెల‌గురాష్ట్రాల నుండి వివిధ రంగాల‌కు చెందిన సుమారు 50 మందిని సిఫారు చేశారు. అయితే కేవ‌లం క్రీడారంగానికి చెందిన ష‌ట్ల‌ర్ కిదాంబి శ్రీకాంత్ కు మాత్ర‌మే ప‌ద్మ‌శ్రీ అవార్డు ద‌క్కింది. దీంతో కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ష‌ట్ల‌ర్ గా త‌న‌దైన శైలిలో ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రుస్తూ విజ‌యాల‌ను సొంతం చేసుకుంటున్నారు శ్రీకాంత్. నాలుగేళ్ల కిందట ప్రపంచ దిగ్గజం లిన్‌ డాన్‌ను అతడి సొంతగడ్డ చైనాలో ఓడించి చ‌రిత్ర తిర‌గ‌రాశారు. 2017లో నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లను నెగ్గి దిగ్గజాల సరసన స్థానం సంపాదించాడు. ఇప్పుడు పద్మశ్రీ అవార్డు రావ‌డంతో నా బాధ్య‌తను మ‌రింత పెంచింద‌ని....ఒలంపిక్స్‌, కామ‌న్‌వెల్త్‌లో విజ‌యం సాధించ‌డమే ల‌క్ష్యం అని శ్రీకాంత్ ధీమా వ్య‌క్తం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.