బీజేపికి షాక్

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-01-23 04:29:09

బీజేపికి షాక్

ఎన్డీయే కూట‌మికి మ‌రో గ‌ట్టి షాక్ త‌గిలింది. ఓ  వైపు ఏపీలో తెలుగుదేశం పార్టీకి, భార‌తీయ జ‌న‌తా పార్టీకి మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తూనే  ఉంది. మ‌రోవైపు   గ‌త కొన్ని  నెల‌లుగా మ‌హారాష్ట్ర‌లో భాజాపాకి, శివ‌సేన పార్టీకి విభేదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ప‌లు రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల కార‌ణంగా  మోదీ స‌ర్కార్ పై శివ‌సేన విమ‌ర్శ‌లు చేస్తూనే వ‌స్తోంది. 
 
బీజేపీ-శివ‌సేనలు 1990 నుండి స్నేహంగా కొన‌సాగుతున్నాయి. అయితే 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో శివ‌సేన‌, బీజేపీ విడివిడిగా పోటీ చేసి, ఫ‌లితాల అనందత‌రం తిరిగి క‌లిసే మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేశారు. ముంబై కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో కూడా ఇలాగే జ‌రిగింది. 
 
ఇప్పుడు కూడా మ‌రోసారి  శివ‌సేన, బీజేపీతో తెగ‌దెంపులు చేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం నాడు జ‌రిగిన శివ‌సేన పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ భేటీలో తీర్మానం చేసింది. ఇక రానున్న రోజుల్లో శివ‌సేన-బీజేపీతో క‌లిసే అవ‌కాశాలు లేవ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.