దోహా ఖతార్ లో ఘనంగా జరిగిన వాక్ విత్ జగనన్న కార్యక్రమము

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-01-27 01:44:08

దోహా ఖతార్ లో ఘనంగా జరిగిన వాక్ విత్ జగనన్న కార్యక్రమము

దోహా ఖతార్ : ఉమ్ సలాల్ ఆలీ ప్రాంతములో దొండపాటి శశికిరణ్ గారి ఆధ్వర్యములో ఘనంగా వాక్ విత్ జగనన్న కార్యక్రమము జరిగిందని గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి. హెచ్, గల్ఫ్ ప్రతినిధి వర్జిల్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భముగా శశికిరణ్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న మా అధినేత ప్రజానేత 1000 కిమీ ల మైలు రాయి దాటినా సందర్భంగా వారికి సంఘీభావంగా దోహా ఖతార్ లో వై.యస్.ఆర్. కుటుంబ అభిమానులు వాక్ విత్ జగనన్న పేరుతో పాదయాత్ర చేస్తున్నామని.

ఈ రోజు రాష్ట్ర పరిస్ధితి అల్లోకల్లం ల ఉంది అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం మనకు కలుగుతుంది పేద వారికి సంక్షేమ పధకాలు అందడము లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఇటువంటి ప్రభుత్వానికి రాష్ట్ర పౌరులు ఏ దేశంలో ఉన్న జగన్నను అండగా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి చామరగీతం పాడి 2019లో జగనన్నకు ముఖ్యమంత్రి చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఈ కార్యక్రమములో ప్రముఖ వ్యాపారవేత్త సాంబశివరావు, సామజిక సేవకులు బి. విల్సన్ బాబు, ఎన్. నాగేశ్వరరావు, లియో, మనిష్, జాఫర్, ప్రశాంత్, కిషోర్, గిరిధర్, రత్నం, భార్గవ్, రాజశేఖర్, అరుణ్, సాగర్ కోలా, సునీల్, ఇంజేటి శ్రీను, శ్రీను, సునీల్, సుభాని, మరియు వై.యస్.ఆర్. కుటుంబ అభిమానులు పాల్గోన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.