బీజేపీకి షాక్ ఇచ్చిన తాజా స‌ర్వే ఏకంగా నాలుగు రాష్ట్రాల్లో గ‌డ్డు ప‌రిస్థితి

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

modi
Updated:  2018-10-08 11:08:20

బీజేపీకి షాక్ ఇచ్చిన తాజా స‌ర్వే ఏకంగా నాలుగు రాష్ట్రాల్లో గ‌డ్డు ప‌రిస్థితి

ఐదు రాష్ట్రాల్లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో జాతీయ ఎన్నిక‌ల క‌మీష‌న్ శ‌నివారం మ‌ధ్యాహ్నం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎన్నిక‌ల ఫెడ్యూల్ ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసింది. ఇక ఈ ఐదు రాష్ట్రాలో అధికార పార్టీ ప్ర‌జ‌ల్లో బ‌లంగా ఉందా లేక ప్ర‌తిప‌క్ష పార్టీ బలంగా ఉందా అనే విష‌యంపై ఏబీపీ న్యూస్ సీవోట‌ర్ ఒక స‌ర్వే ను నిర్వ‌హించింది. 
 
ఈ స‌ర్వేలో ప‌లు అస‌క్తికర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ స‌ర్వే ప్ర‌కారం తెలంగాణ‌లో మ‌ళ్లీ టీఆర్ఎస్ జెండా ఎగురుతుంద‌ని తెలిపింది. అలాగే మ‌ధ్య‌ప్ర‌దేశ్, చ‌త్తీస్ గ‌ఢ్, రాజ‌స్థాన్, రాష్ట్రాల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఓట‌మి చ‌విచూసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఈ స‌ర్వే తెలిపింది. ఈ స‌ర్వే ప్ర‌కారం రాజ‌స్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెల‌వ‌నుంద‌ని, మ‌ధ్య‌ప్ర‌దేశ్, ఛ‌త్తీస్ గ‌ఢ్, రాష్ట్రాల్లో సుమారు 15 సంవ‌త్స‌రాల త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ గెల‌వ‌నుంద‌ని తెలిపింది.
 
ఈ మూడు రాష్ట్రాల్లో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే రాజ‌స్థాన్ లో 200 అసెంబ్లీ సీట్ల‌కుగాను ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీకి 142 సీట్లు ద‌క్కుతాయ‌ని, బీజేపీ కేవ‌లం 56 సీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతుంద‌ని ఈ స‌ర్వే తెలిపింది. అలాగే మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో 230 అసెంబ్లీ సీట్ల‌కుగాను కాంగ్రెస్ 122 ద‌క్కించుకుంటుంద‌ని బీజేపీకి 108 సీట్లు వ‌స్తాయ‌ని తెలిపింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ఇరు పార్టీలు నువ్వానేనా అన్న స్థాయిలో పోటీ ప‌డి చివ‌రికి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన అభ్య‌ర్థుల‌ను ఆయా పార్టీల్లోకి చేర్చుకుని అధికారం ద‌క్కించుకునే ఆస్కారం ఉంద‌ని తెలుస్తుంది. 
 
గ‌డిచిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏవిధంగా బీజేపీకి రుచి చూపించాయో సేమ్ సీన్ మ‌ళ్లీ ఇక్క‌డ రిపీట్ అయ్యే ఆస్కారం ఉంద‌ని ఈ స‌ర్వే తెలిపింది. ఇక చివ‌రిగా ఛ‌త్తీస్ గ‌ఢ్ ఈ రాష్ట్రంలో  మొత్తం 90 అసెంబ్లీ సీట్లు గాను కాంగ్రెస్ 50 నుంచి 57 సీట్ల‌ను కైవ‌సం చేసుకుంటుంద‌ని బీజేపీ 40 సీట్ల‌కు ప‌రిమితం అవుతుంద‌ని ఈ స‌ర్వే తెలిపింది. మొత్తం మీద చూస్తే ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రిగితే సుమారు 4 రాష్ట్రాల్లో బీజేపీ గడ్డుప‌రిస్థితిని ఎదుర్కునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.