బీజేపీలో చేరిన ప్రముఖ నటి

Breaking News

హోమ్        జాతీయం      న్యూస్

Updated:  2018-02-19 04:38:30

బీజేపీలో చేరిన ప్రముఖ నటి

2014  నుంచి దేశంలో క‌మ‌లం పార్టీ హవా కొన‌సాగుతూనే ఉంది... భార‌తీయ జ‌న‌తా పార్టీ విజ‌యాల‌ను, న‌రేంద్ర మోదీ పొలిటిక‌ల్ చ‌రిష్మా  చూసిన రాజ‌కీయ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, దేశ ప్ర‌జ‌లు ఆయ‌న‌కు రాజ‌కీయంగా తిరుగులేద‌ని భావిస్తున్నారు. దేశంలో నూత‌న సంస్క‌ర‌ణ‌లు ప్ర‌వేశ‌పెట్టి ప్ర‌జ‌ల్లో భారీ ఆద‌ర‌ణ పొందుతున్న తీరు కొంద‌రిని ఆక‌ర్షించింది. దీంతో ఎన్నో సంవ‌త్స‌రాలుగా ప‌లు పార్టీల్లో కీల‌క ప‌ద‌వులు అధిరోహించి, పార్టీ అభ్యున్న‌తికి కృషి చేసిన నాయ‌కులు సైతం త‌మ సొంత పార్టీల‌ని వ‌దిలి బీజేపీలో చేరుతున్నారు.
 
తాజాగా ఒడిశా కాంగ్రెస్ నాయ‌కురాలు,  ప్ర‌ముఖ‌ సీనియర్ నటి అపరాజితా మొహంతీ కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.... భువనేశ్వర్‌లో  కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో బీజేపీ కండువా క‌ప్పుకున్నారు ఆమె. త్వ‌ర‌లో బైజెపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక  జరుగనున్న నేపథ్యంలో అపరాజిత బీజేపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
ఈ సందర్భంగా  మాట్లాడిన అపరాజిత దేశాన్ని అభివృద్ది వైపు న‌డిపిస్తున్న, ప్ర‌ధాని మోదీ విధానం న‌చ్చి... బీజేపీలో చేరాన‌ని  ఆమె తెలియ‌చేశారు.... ప్రజాసేవ చేసేందుకు అవకాశమిచ్చిన బీజేపీకి నా కృతజ్ఞతలు అని ఆనందం వ్య‌క్త ప‌రిచారు.. 2014లో కటక్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి  కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసిన అపరాజిత, ఆ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలై కాంగ్రెస్ లో కొన‌సాగుతున్నారు.. ఇక దేశంలో ప‌లు సంస్క‌ర‌ణ‌ల‌తో దూసుకుపోతున్న క‌మ‌లం పార్టీని చూసి ఆమె బీజేపీలో చేరారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.